
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఢిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ లీగ్‌లో భాగంగా శుక్రవారం పార్ల్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పార్ల్ రాయల్స్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులకే పరిమితమైంది. సన్‌రైజర్స్ బౌలర్లలో లైడ్ డాసన్, మార్కో జనెసన్, స్వాన్‌పోయెల్ తలా రెండు వికెట్లు సాధించారు. పార్ల్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్(64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
జానెసన్ విధ్వంసం..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 71 పరుగులు చేశాడు. అతడితో పాటు టామ్ ఎబెల్ 46 పరుగులతో రాణించాడు. కాగా సన్‌రైజర్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.
చదవండి: IND vs ENG: డబుల్ సెంచరీతో విధ్వంసం.. చరిత్ర సృష్టించిన యశస్వీ జైశ్వాల్
Comments
Please login to add a commentAdd a comment