
IND vs SA 1st ODI:
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు మాత్రమే చేయగలిగింది. శిఖర్ ధావన్(75), విరాట్ కోహ్లి(51), శార్ధూల్ ఠాకూర్(50 నాటౌట్) రాణించినప్పటికి వారి మెరుపులు సరిపోలేదు. దీనికి తోడూ మిగతా బ్యాట్స్‌మన్ విఫలం కావడంతో టీమిండియా పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, తబ్రైజ్ షంసీ, ఆండీ ఫెలుక్యావో తలా రెండు వికెట్లు తీశారు. ఇక రెండో వన్డే శుక్రవారం జరగనుంది.
అంతకముందు టాస్ గెలిచి సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్వింటన్ డికాక్, జానెమన్ మలన్‌లు నిరాశపరిచారు. తర్వాత వచ్చిన డికాక్ 27 పరుగులు చేసి ఔటయ్యాడు.ఒక దశలో 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సౌతాఫ్రికాని కెప్టెన్ బావుమా 143 బంతుల్లో 8 ఫోర్లతో సహాయంతో 110 పరుగులు చేశాడు. వాండర్ డస్సెన్ 96 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 129 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరు సెంచరీలతో చెలరేగడంతో నాలుగో వికెట్‌కి 204 రికార్డు పరుగుల భాగస్వామ్యం నమోదైంది. వీరిద్దరి మెరుపులతో సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ సాధించారు.
8: 57 PM: ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా
టీమిండియాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. కేవలం 7 పరుగుల వ్యవధిలో ముగ్గురు బ్యాటర్లు పెవిలియన్‌కు చేరారు. 181 పరుగుల వద్ద అయ్యర్, పంత్ ఔట్ కాగా, 188 పరుగుల స్కోర్ వద్ద అరంగేట్రం ఆటగాడు వెంకటేశ్ అయ్యర్(7 బంతుల్లో 2) ఔటయ్యాడు. దీంతో అప్పటి దాకా విజయం దిశగా సాగిన టీమిండియా ఓటమి బాట పట్టింది. 36 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 188/6. క్రీజ్‌లో అశ్విన్(4), శార్ధూల్ ఠాకూర్ ఉన్నారు.
8: 46 PM: తడబడుతున్న భారత్.. 181 పరుగులకే సగం వికెట్లు డౌన్
నిలకడగా ఆడుతూ విజయం దిశగా సాగుతున్న టీమిండియాకు వరుస షాక్‌లు తగిలాయి. మూడు బంతుల వ్యవధిలో శ్రేయస్ అయ్యర్(17), పంత్(16)లు ఔటయ్యారు. తొలుత 33.5వ ఓవర్లో 181 పరుగుల వద్ద ఎంగిడి బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ పెవిలియన్‌కు చేరగా... అదే స్కోర్ వద్ద మరుసటి ఓవర్ తొలి బంతికే పంత్.. ఫెలుక్వాయో బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి స్టంప్ అవుటయ్యాడు. దీంతో సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి.
8:16 PM: టీమిండియా మూడో వికెట్ డౌన్.. కోహ్లి(51) ఔట్
రెండేళ్లకుపైగా ఉన్న శతక దాహాన్ని ఈ మ్యాచ్‌లో ఎలాగైనా తీర్చుకుంటాడని భావించిన కోహ్లి(51).. హాఫ్ సెంచరీ మార్కు దాటగానే ఔటయ్యాడు. షంషి బౌలింగ్‌లో బవుమాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా టీమిండియా 152 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో పంత్(4), అయ్యర్ ఉన్నారు.
8:02 PM: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
సెట్ బ్యాటర్ శిఖర్ ధవన్ ఔటయ్యాడు. 84 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 79 పరుగులు చేసిన గబ్బర్.. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా టీమిండియా 138 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 26 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 140/2గా ఉంది. క్రీజ్‌లో కోహ్లి(44), పంత్(1) ఉన్నారు.
7:15 PM: గబ్బర్ హాఫ్ సెంచరీ.. నిలకడగా టీమిండియా
చాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన శిఖర్ ధవన్(55 బంతుల్లో 54; 8 ఫోర్లు).. తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. సమయోచితంగా ఆడుతూ అర్ధ శతకం సాధించాడు. ఫలితంగా టీమిండియా 15 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. క్రీజ్‌లో గబ్బర్‌కు తోడుగా విరాట్ కోహ్లి(18 బంతుల్లో 13; ఫోర్) ఉన్నాడు.
07:02 PM: 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన ఓపెనర్ రాహుల్ మార్క్రమ్ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 46 పరుగులతో ఆడుతుంది.
06:02 PM: టాస్ గెలిచి సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్వింటన్ డికాక్, జానెమన్ మలన్‌లు నిరాశపరిచారు. తర్వాత వచ్చిన డికాక్ 27 పరుగులు చేసి ఔటయ్యాడు.ఒక దశలో 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సౌతాఫ్రికాని కెప్టెన్ బావుమా 143 బంతుల్లో 8 ఫోర్లతో సహాయంతో 110 పరుగులు చేశాడు. వాండర్ డస్సెన్ 96 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 129 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరు సెంచరీలతో చెలరేగడంతో నాలుగో వికెట్‌కి 204 రికార్డు పరుగుల భాగస్వామ్యం నమోదైంది. వీరిద్దరి మెరుపులతో సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ సాధించారు.
5: 43 PM: IND vs SA 1st ODI: నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
110 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బవుమా ఔటయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 48.1 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 272/4గా ఉంది. క్రీజ్‌లో డస్సెన్(86 బంతుల్లో 109), మిల్లర్ ఉన్నారు.
5: 21 PM: బవుమా శతకం, డస్సెన్ విధ్వంసం.. భారీ స్కోర్ దిశగా దక్షిణాఫ్రికా
సఫారీ కెప్టెన్ టెంబా బవుమా(133 బంతుల్లో 100; 7 ఫోర్లు) కెరీర్‌లో రెండో శతకాన్ని నమోదు చేశాడు. మరో ఎండ్‌లో డస్సెన్(77 బంతుల్లో 93; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టిస్తూ సెంచరీ దిశగా పయనిస్తున్నాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా 45 ఓవర్ల తర్వాత 3 నష్టానికి 245 పరుగులు చేసింది. బవుమా- డస్సెన్ జోడీ నాలుగో వికెట్‌కు 177 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేసి, జట్టును భారీ స్కోర్ దిశగా నడిపిస్తుంది.
4: 42 PM: బవుమా, డస్సెన్ అర్ధ శతకాలు.. దక్షిణాఫ్రికా స్కోర్ 175/3
68 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను కెప్టెన్ బవుమా(101 బంతుల్లో 78; 7 ఫోర్లు), డస్సెన్(49 బంతుల్లో 54; 4 ఫోర్లు, సిక్స్) అర్ధ శతకాలతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 100 పరుగులకు పైగా జోడించి జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. 35 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 181/3గా ఉంది.
3: 24 PM: మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా..
68 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. వెంకటేశ్ అయ్యర్ కళ్లు చెదిరే త్రోతో మార్క్రమ్(11 బంతుల్లో 4)ను రనౌట్ చేశాడు. క్రీజ్‌లో బవుమా(23), డస్సెన్ ఉన్నారు.
డికాక్ క్లీన్ బౌల్డ్
డ్రింక్స్ అనంతరం తొలి బంతికి సఫారీ జట్టుకు భారీ షాక్ తగిలింది. క్రీజ్‌లో కుదురుకుంటున్న స్టార్ ప్లేయర్ డికాక్ (41 బంతుల్లో 27; 2 ఫోర్లు)ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా 58 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో బవుమా(17), మార్క్రమ్ ఉన్నారు.
2: 21 PM: తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
►బుమ్రా బౌలింగ్‌లో మలన్.. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. టీమిండియా పేసు గుర్రం అద్భుత అవుట్‌స్వింగర్‌కు బలైపోయి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు: 19/1 (4.2).
2: 01 PM: దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్వింటన్ డికాక్, జానేమన్ మలన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు.
1: 35 PM: టీమిండియాతో స్వదేశంలో జరుగుతున్న మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచింది. బ్యాటింగ్ ఎంచుకుని రాహుల్ సేనను ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది. ఇక టీమిండియా యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని కెప్టెన్ కేఎల్ రాహుల్ ధ్రువీకరించాడు. కాగా కేఎల్ రాహుల్‌కు వన్డే కెప్టెన్‌గా ఇదే తొలి అవకాశం.
తుది జట్లు:
టీమిండియా: కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్.
దక్షిణాఫ్రికా:
క్వింటన్ డికాక్, జానేమన్ మలన్, ఎయిడెన్ మార్కరమ్, రసీ వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లూక్వాయో, మార్కో జాన్‌సెన్, కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షంషీ, లుంగి ఎంగిడి.
చదవండి: Ind Vs Sa ODIs: కోహ్లి భయ్యా.. నేనెవరి వికెట్ తీయాలో చెప్పవా?: చహల్ భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment