దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా పేసర్ బుమ్రా.. ఆరున్నర అడుగుల దక్షిణాఫ్రికా యువ పేసర్ మార్కో జన్సెన్‌పైకి దూసుకెళ్లాడు. భారత రెండో ఇన్నింగ్స్ 54వ ఓవర్లో చోటు చేసుకున్న ఘటనలో ఈ ఇద్దరు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు బాహాబాహికి దిగినంత పని చేశారు. అయితే అంపైర్ జోక్యంతో ఇద్దరు సర్దుకుపోయారు.
— Addicric (@addicric) January 5, 2022
వివరాల్లోకి వెళితే.. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్ 230/8 వద్ద ఉండగా జన్సెన్.. బుమ్రాను టార్గెట్ చేస్తూ వరుస బౌన్సర్లను సంధించాడు. ఈ క్రమంలో వరుసగా కొన్ని బంతులు బుమ్రా శరీరాన్ని బలంగా తాకాయి. దీంతో చిర్రెతిపోయిన భారత పేసు గుర్రం.. జన్సెన్ వైపు దూసుకెళ్లాడు. ఈ సందర్భంగా ఇరువురు మాటామాటా అనుకున్నారు. అయితే అంపైర్ సర్ధిచెప్పడంతో ఇద్దరు మిన్నకుండిపోయారు. ఈ కోపంతో రబాడ వేసిన మరుసటి ఓవర్లో బుమ్రా సిక్సర్ బాదాడు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.
కాగా, ఇంగ్లండ్ సిరీస్‌లోనూ బుమ్రా- ఆండర్సన్‌ల మధ్య ఇలాంటి బాహాబాహి సన్నివేశాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, మూడో రోజు ఆటలో టీమిండియా నిర్ధేశించని 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సఫారీ జట్టు.. ఆఖరి సెషన్ ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతుంది.
చదవండి: Ind vs Sa: కేఎల్ రాహుల్ అవుటైన తీరుపై వివాదం... కెప్టెన్ల మధ్య వాగ్వాదం.. వైరల్!
Comments
Please login to add a commentAdd a comment