SA Captain Temba Bavuma-Marco Jansen Funny Photo Goes Viral - Sakshi
Sakshi News home page

Bavuma-Marco Jansen: 'వీడేంట్రా బాబు ఇంత పొడుగున్నాడు'

Published Thu, Dec 29 2022 4:12 PM | Last Updated on Thu, Dec 29 2022 9:44 PM

SA Captain Temba Bavuma-Marco Jansen Funny Photo Viral Social Media - Sakshi

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులోనూ ఓటమిపాలైన సౌతాఫ్రికా ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కోల్పోయింది. ఇక మూడో టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ప్రొటీస్‌ భావిస్తుంటే.. ఆసీస్‌ మాత్రం క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. సౌతాఫ్రికా మాత్రం నాలుగో స్థానానికి పడిపోయి అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. 

ఈ సంగతి పక్కనబెడితే.. సోషల్‌ మీడియలో ఒక ఫోటో ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది. ఇది కేవలం సరదా కోసం మాత్రమే రాసుకొచ్చాం. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ సమయంలో కెప్టెన్‌ బవూమా, మార్కో జాన్సెన్‌లు క్రీజులో ఉన్నారు. సాధారణంగా బవుమా చాలా పొట్టిగా ఉంటాడు. ఇక మార్కో జాన్సెన్‌ చాలా పొడగరి.. దాదాపు ఆరున్నర అడుగులు ఉంటాడు.

యాదృశ్చికమో ఏమో తెలియదు కానీ బవుమా.. మార్కో జాన్సెన్‌ వైపు అదో రకమైన ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు. అదెలా ఉందంటే.. ''వీడేంటి ఇంత పొడుగున్నాడు అనేలా''.. ఫోటో చూడగానే మీకు కూడా అలాగే కనిపిస్తుంది. అందుకే ఈ ఫోటో ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది. మాములుగానే తమకంటే హైట్‌ ఎక్కువుంటేనే తెగ బాధపడిపోయే పొట్టోళ్లు.. తమకు సాధ్యం కాని ఎత్తులో ఉన్న వ్యక్తులను చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి. పాపం బవుమా పరిస్థితి కూడా అదే. అందుకే అతని వైపు చూస్తూ బవుమా కచ్చితంగా అదే అనుకొని ఉంటాడు.

ఇక వాస్తవానికి వస్తే.. బవుమా రివ్యూ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. నిజానికి మార్కో జాన్సెన్‌తో రివ్యూ విషయమై మాట్లాడుతున్నాడు. ఆ సమయంలోనే ఒక ఫోటోగ్రాఫర్‌ ఇలా క్లిక్‌మనిపించాడు. ఒక్క ఫోటోతో మనం ఇంకో విధంగా ఊహించుకునేలా చేసిన ఫోటోగ్రాఫర్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.

చదవండి: WTC: పోతే పోయింది.. మనకు మాత్రం మేలు చేసింది

పది రోజులైనా కిక్కు దిగలేదు.. చుట్టుముట్టేశారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement