ప్రొటిస్‌ పేసర్ల దెబ్బ.. న్యూజిలాండ్‌ తడబాటు  | New Zeland Vs South Africa 2nd Test Highlights | Sakshi
Sakshi News home page

NZ vs SA: ప్రొటిస్‌ పేసర్ల దెబ్బ.. న్యూజిలాండ్‌ తడబాటు 

Published Sun, Feb 27 2022 2:08 PM | Last Updated on Sun, Feb 27 2022 2:08 PM

New Zeland Vs South Africa 2nd Test Highlights - Sakshi

క్రైస్ట్‌చర్చ్‌: దక్షిణాఫ్రికా పేస్‌ బౌలర్లు కగిసో రబడ (3/37), మార్కో జాన్సెన్‌ (2/48) ధాటికి రెండో టెస్టులో న్యూజిలాండ్‌ తడబడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా స్కోరుకు కివీస్‌ 207 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం గ్రాండ్‌హోమ్‌ (54 బ్యాటింగ్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్‌ (29 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 238/3తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా133 ఓవర్లలో 364 పరుగులకు ఆలౌటైంది. కివీస్‌ బౌలర్లలో నీల్‌ వాగ్నర్‌ నాలుగు, హెన్రీ మూడు వికెట్లు తీశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement