చ‌రిత్ర సృష్టించిన కగిసో రబాడ.. 108 ఏళ్ల రికార్డు బ్రేక్‌ | Kagiso Rabada Creates History With Bat As South Africa Qualify For WTC Final | Sakshi
Sakshi News home page

SA vs PAK: చ‌రిత్ర సృష్టించిన కగిసో రబాడ.. 108 ఏళ్ల రికార్డు బ్రేక్‌

Published Mon, Dec 30 2024 11:33 AM | Last Updated on Mon, Dec 30 2024 11:44 AM

Kagiso Rabada Creates History With Bat As South Africa Qualify For WTC Final

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికా అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. సెంచూరియ‌న్ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రిగిన తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో సంచ‌ల‌నం విజ‌యం సాధించిన ప్రోటీస్‌.. తొలిసారి డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు ఆర్హ‌త సాధించింది.

ఈ విజయంలో సౌతాఫ్రికా స్పెషలిస్టు సీమ్‌ బౌలర్‌ కగిసో రబాడ (26 బంతుల్లో 31 నాటౌట్‌; 5 ఫోర్లు) కీల‌క పాత్ర పోషించాడు. 148 పరుగుల సులువైన లక్ష్య చేధ‌న‌లో ప్రోటీస్ 99 ప‌రుగుల‌కే 8 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు కష్టాల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో రబాడ‌, మార్కో జానెస‌న్ విరోచిత పోరాటం క‌న‌బ‌రిచారు.

వీరిద్ద‌రూ తొమ్మిదో వికెట్‌కు 51 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా ఊహించని విధంగా మ్యాచ్‌ గెలిచింది. ఈ మ్యాచ్‌లో స్పెషలిస్టు బ్యాటర్‌ అవతరమెత్తిన ర‌బాడ ఓ అరుదైన ఘ‌న‌తను త‌న పేరిట లిఖించుకున్నాడు.

రబాడ అరుదైన ఘనత..
విజయవంతమైన లక్ష్య చేధనలో పది లేదా అంతకంటే ఎక్కువ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోర్ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా రబాడ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సౌతాఫ్రికా దిగ్గజం పెర్సీ షెర్వాల్ పేరిట ఉండేది. అతడు 1906లో జోహన్నెస్‌బర్గ్‌లో ఇంగ్లండ్‌పై పదో వికెట్‌కు బ్యాటింగ్‌కు వచ్చి ఆజేయంగా 22 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో 108 ఏళ్ల షెర్వాల్ రికార్డును రబాడ బ్రేక్ చేశాడు.
చదవండి: IND vs AUS: బెయిల్స్ మార్చిన స్టార్క్‌.. ఇచ్చిపడేసిన యశస్వి జైశ్వాల్‌! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement