చెలరేగిన పంజాబ్‌ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన గుజరాత్‌ | IPL 2026: Punjab kings restricted gujarat titans for 162 runs | Sakshi
Sakshi News home page

చెలరేగిన పంజాబ్‌ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన గుజరాత్‌

Mar 31 2026 9:46 PM | Updated on Mar 31 2026 9:46 PM

IPL 2026: Punjab kings restricted gujarat titans for 162 runs

ఐపీఎల్‌ 2026లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో ఇవాళ (మార్చి 31) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. పంజాబ్‌ హోం గ్రౌండ్‌ అయిన మహారాజా యాదవీంద్ర సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో (ముల్లాన్‌పూర్‌) జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.

వారి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులకే పరిమితమైంది. విజయ్‌కుమార్‌ వైశాక్‌ (4-0-34-3), యుజ్వేంద్ర చహల్‌ (4-0-28-2), మార్కో జన్సెన్‌ (4-0-20-1), బార్ట్‌లెట్‌ (4-0-36-0) అద్భుతంగా బౌలింగ్‌ చేసి గుజరాత్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. ఒక్క అర్షదీప్‌ సింగ్‌ (4-0-42-0) మినహా పంజాబ్‌ బౌలర్లంతా అద్బుతంగా బౌలింగ్‌ చేశారు.

గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (27 బంతుల్లో 39; 6 ఫోర్లు), జోస్‌ బట్లర్‌ (33 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్‌ ఫిలిప్స్‌ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. సాయి సుదర్శన్‌ (13), వాషింగ్టన్‌ సుందర్‌ (18), షారుక్‌ ఖాన్‌ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. రాహుల్‌ తెవాతియా (11), రషీద్‌ ఖాన్‌ (0) అజేయంగా నిలిచారు. 

Advertisement
 
Advertisement
Advertisement