Marco Jansen smashes Rashid Khan for 28 runs in an over - Sakshi
Sakshi News home page

SA20 2023: రషీద్‌ ఖాన్‌కు చుక్కలు చూపించిన సన్‌రైజర్స్‌ బ్యాటర్‌.. ఒకే ఓవర్‌లో 28 పరుగులు!

Published Thu, Jan 19 2023 10:58 AM | Last Updated on Fri, Jan 20 2023 10:26 AM

Marco Jansen clobbers Rashid Khan for 28 runs in a single over - Sakshi

ఆఫ్గానిస్తాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఏంఐ కేప్‌టౌన్‌కు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో రషీద్‌ ఖాన్‌ తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నాడు. తాజాగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక్క వికెట్‌ పడగొట్టి ఏకంగా 53 పరుగులిచ్చాడు. ముఖ్యంగా రషీద్‌కు సన్‌రైజర్స్ బ్యాటర్‌ మార్కో జాన్సెన్ చుక్కలు చూపించాడు. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ 16 ఓవర్‌ వేసిన రషీద్‌ బౌలింగ్‌లో జాన్సెన్ ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. ఆ ఓవర్‌లో జాన్సెన్‌ 4 సిక్స్‌లు, ఒక్క ఫోర్‌ బాదాడు.

ఈ ఓవర్‌తోనే మ్యాచ్‌ సన్‌రైజర్స్‌ వైపు మలుపు తిరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను సౌతాఫ్రికా టీ20 ట్విటర్‌లో ఫోస్ట్‌ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో ఏంఐ కేప్‌టౌన్‌పై సన్‌రైజర్స్ ఈస్టర్న్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్‌ విజయంలో జాన్సెన్ కీలక పాత్ర పోషించాడు. 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జాన్సెన్ కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66 పరుగులు సాధించాడు.


చదవండి: Mohammed Siraj: కుటుంబ సభ్యుల నడుమ మ్యాచ్‌.. నిప్పులు చెరిగిన లోకల్‌ బాయ్‌.. భావోద్వేగ ట్వీట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement