సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు తొలి విజయం నమోదు చేసింది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం ఎంఐ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ విజయం సాధించింది. 159 పరుగుల విజయం లక్ష్యంతో బరిలోకి ఈస్టర్న్ కేప్ 19.3 ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి చేధించింది.
ఇక సన్‌రైజర్స్ గెలుపులో ఆ జట్టు కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ కీలక పాత్ర పోషించాడు. తొలుత బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన మార్క్రమ్.. అనంతరం బ్యాటింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 35 బంతులు ఎదుర్కొన్న మార్కరమ్ 7 ఫోర్లు సాయంతో 50 పరుగలు సాధించాడు.
అతడితో పాటు సరేల్ ఎర్వీ(41), స్టబ్స్(30) పరుగులతో రాణించారు. ఎంఐ కేప్‌టౌన్ బౌలర్లలో ఒడియన్ స్మిత్ మూడు, సామ్ కుర్రాన్ రెండు, రషీద్ ఖాన్ ఒక్క వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.
కాగా కేప్‌టౌన్ 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రాసీ వాన్ డర్ డస్సెన్ (29), లిండే(63) అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. కాగా ఈస్టర్న్ కేప్ బౌలర్లలో బార్ట్‌మాన్ మూడు వికెట్లు, మగాల, మార్కరమ్ తలా రెండువికెట్లు పడగొట్టారు.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. సూర్యకుమార్‌కు నో ఛాన్స్! కిషన్‌కు చోటు
Comments
Please login to add a commentAdd a comment