దారుణంగా ఢీకొట్టుకున్నారు.. జన్సెన్‌కు తీవ్ర గాయం..! | T20 World Cup 2024, SA vs WI: Kagiso Rabada And Marco Jansen Collide On The Boundary Line | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: దారుణంగా ఢీకొట్టుకున్నారు.. జన్సెన్‌కు తీవ్ర గాయం..!

Published Mon, Jun 24 2024 8:48 AM | Last Updated on Mon, Jun 24 2024 9:46 AM

T20 World Cup 2024 SA VS WI: Kagiso Rabada And Marco Jansen Collide On The Boundary Line

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా వెస్టిండీస్‌తో ఇవాళ (జూన్‌ 24) జరుగుతున్న కీలక సమరంలో ఓ ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. మార్క్రమ్‌ బౌలింగ్‌ కైల్‌ మేయర్స్‌ కొట్టిన సిక్సర్‌ను క్యాచ్‌గా మలిచే క్రమంలో మార్కో జన్సెన్‌, కగిసో రబాడ తీవ్రంగా గాయపడ్డారు. బౌండరీ లైన్‌ వద్ద రబాడ, జన్సెన్‌ ఒకరినొకరు దారుణంగా ఢీకొట్టుకున్నారు. ఈ ఘటనలో జన్సెన్‌ తీవ్రంగా గాయపడగా.. రబాడ స్వల్ప గాయంతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌.. సౌతాఫ్రికా బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. తబ్రేజ్‌ షంషి తన స్పిన్‌ మాయాజాలాన్ని ప్రదర్శించి విండీస్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. షంషి 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. షంషికి జతగా సఫారీ బౌలర్లంతా రాణించారు. జన్సెన్‌, మార్క్రమ్‌, కేశవ్‌ మహారాజ్‌, రబాడ తలో వికెట్‌ పడగొట్టారు.

విండీస్‌ ఇన్నింగ్స్‌లో రోస్టన్‌ ఛేజ్‌ (52) అర్దసెంచరీతో రాణించగా.. కైల్‌ మేయర్స్‌ 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. వీరిద్దరు మినహా విండీస్‌ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. హోప్‌ 0, పూరన్‌ 1, రోవ్‌మన్‌ పావెల్‌ 1, రూథర్‌ఫోర్డ్‌ 0, రసెల్‌ 15, అకీల్‌ హొసేన్‌ 6 పరుగులు చేశారు. అల్జరీ జోసఫ్‌ (11 నాటౌట్‌), మోటీ (4) నాటౌట్‌గా నిలిచారు. 10 పరుగులు ఎక్సట్రాల రూపంలో వచ్చాయి.  

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు వరుణుడు అడ్డు తగిలాడు. ఆ జట్టు స్కోర్‌ 15/2 (2 ఓవర్లలో) వద్ద ఉండగా.. వర్షం మొదలైంది. దీంతో అక్కడే మ్యాచ్‌ను ఆపేశారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవాలంటే మరో 18 ఓవర్లలో 121 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిస్తే గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌తో పాటు సెమీస్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడితే మెరుగైన రన్‌రేట్‌ కలిగిన జట్టు (విండీస్‌, సౌతాఫ్రికా) సెమీస్‌కు చేరుకుంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement