డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక దారుణ ప్రదర్శన కనబరిచింది. శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్‌లో 13.5 ఓవర్లలో కేవలం 42 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బౌలర్ల దాటికి లంకేయులు వణికిపోయారు.
వచ్చినవారు వచ్చినట్టుగానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. లంక బ్యాటర్లలో కమిందు మెండిస్(13), లహురు కుమారా(10) మినహా మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్ 7 వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు. అతడితో పాటు కోయిట్జీ రెండు, రబాడ ఒక్క వికెట్ సాధించారు.
కాగా అంతకుముందు 80/4 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. ప్రోటీస్ బ్యాటర్లలో కెప్టెన్ టెంబా బావుమా(70) హాఫ్ సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 77 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
శ్రీలంక చెత్త రికార్డు..
ఇక ఈ మ్యాచ్‌లో 42 పరుగులకే ఆలౌటైన శ్రీలంక ఓ చెత్త రికార్డు మూటకట్టుకుంది. దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అత్యల్ప టోటల్‌ను జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2013లో కేప్‌టౌన్ వేదికగా జరిగిన టెస్టులో 45 పరుగులకే కివీస్ ఆలౌటైంది. అదే విధంగా శ్రీలంకకు ఇదే టెస్టుల్లో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం.
చదవండి: IND vs AUS: ఒకే ఒక్క వికెట్.. చరిత్రకు అడుగు దూరంలో జస్ప్రీత్ బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment