స్టబ్స్, బవుమా సెంచరీలు.. గెలుపు దిశగా దక్షిణాఫ్రికా | South Africa On Top As Sri Lanka 5 Wickets Down In Chase Of 516, Check Out Score Details Inside | Sakshi
Sakshi News home page

SA vs SL 1st Test: స్టబ్స్, బవుమా సెంచరీలు.. గెలుపు దిశగా దక్షిణాఫ్రికా

Published Sat, Nov 30 2024 7:28 AM | Last Updated on Sat, Nov 30 2024 10:55 AM

South afrcia On Top As Sri Lanka 5 Down In Chase Of 516

డర్బన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో శ్రీలంక పరాజయానికి చేరువైంది. 516 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన శ్రీలంక మ్యాచ్‌ మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 103 పరుగులే చేసింది.

కరుణరత్నే (4), నిసాంక (23), మాథ్యూస్‌ (25), కమిందు (10), ప్రభాత్‌ (1) ఇప్పటికే పెవిలియన్‌ చేరారు. దినేశ్‌ చండీమల్‌ (29 బ్యాటింగ్‌), ధనంజయ డిసిల్వ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. శ్రీలంక గెలుపు కోసం మరో 413 పరుగులు చేయాల్సి ఉంది. రబడ, మార్కో యాన్సెన్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. 

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 132/3తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 366 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (221 బంతుల్లో 122; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ తెంబా బవుమా (228 బంతుల్లో 113; 9 ఫోర్లు) సెంచరీలు నమోదు చేయడం విశేషం. స్టబ్స్‌ కెరీర్‌లో ఇది రెండో శతకం కాగా...బవుమాకు మూడోది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 249 పరుగులు జోడించారు.
చదవండి: ‘గులాబీ’ బంతితో సాధనకు సిద్ధం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement