పోర్ట్ ఎలిజబెత్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. శనివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
ఎయిడెన్ మార్క్‌రమ్ (75 బంతుల్లో 55; 5 ఫోర్లు) అర్ధ శతకంతో మెరవగా... కెప్టెన్ తెంబా బవుమా (48 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టబ్స్ (36 నాటౌట్; 2 ఫోర్లు) రాణించారు. వీరిద్దరూ అజేయమైన నాలుగో వికెట్‌కు 82 పరుగులు జోడించారు.
శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు పడగొట్టాడు. చేతిలో 7 వికెట్లు ఉన్న ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం 221 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 242/3తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక చివరకు 99.2 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటైంది.
ఏంజెలో మాథ్యూస్ (44; 6 ఫోర్లు), కమిందు మెండిస్ (48; 4 ఫోర్లు) కాస్త పోరాడారు. కెపె్టన్ ధనంజయ డిసిల్వా (14), కుశాల్ మెండిస్ (16), ప్రభాత్ జయసూర్య (24) మరికొన్ని పరుగులు జోడించారు. సఫారీ బౌలర్లలో ప్యాటర్సన్ 5 వికెట్లు పడగొట్టగా.. యాన్సెన్, కేశవ్ మహరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment