కెరీర్‌లో తొలి బంతికే సిక్సర్‌.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ | RR VS LSG: Youngest IPL Debutant Vaibhav Suryavanshi Smashes First Ball Six | Sakshi
Sakshi News home page

కెరీర్‌లో తొలి బంతికే సిక్సర్‌.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ

Published Sat, Apr 19 2025 10:33 PM | Last Updated on Sun, Apr 20 2025 11:35 AM

RR VS LSG: Youngest IPL Debutant Vaibhav Suryavanshi Smashes First Ball Six

Photo Courtesy: BCCI

14 ఏళ్ల 23 రోజుల వయసులోనే ఐపీఎల్‌ అరంగేట్రం చేసి లీగ్‌లో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన రాజస్థాన్‌ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీ.. ఐపీఎల్‌ కెరీర్‌లో తానెదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి మరో రికార్డు నెలకొల్పాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో తొలి బంతికే (కెరీర్‌లో) సిక్సర్‌ బాదిన 10వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

ఐపీఎల్‌ కెరీర్‌లో తొలి బంతికే సిక్సర్‌ బాదిన ఆటగాళ్లు..
రాబ్ క్వినీ (RR)
కెవోన్ కూపర్ (RR)
ఆండ్రీ రస్సెల్ (KKR)
కార్లోస్ బ్రాత్‌వైట్ (DD)
అనికేత్ చౌదరి (RCB)
జావోన్ సియర్ల్స్ (KKR)
సిద్దేష్ లాడ్ (MI)
మహేష్ తీక్షణ (CSK)
సమీర్ రిజ్వీ (CSK)
వైభవ్‌ సూర్యవంశీ (RR)

ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కులైన ఆటగాళ్లు..
14y 23d - వైభవ్ సూర్యవంశీ (RR) vs LSG, 2025*
16y 157d - ప్రయాస్ రే బర్మన్ (RCB) vs SRH, 2019
17y 11d - ముజీబ్ ఉర్ రెహ్మాన్ (PBKS) vs DC, 2018
17y 152d - రియాన్ పరాగ్ (RR) vs CSK, 2019
17y 179d - ప్రదీప్ సాంగ్వాన్ (DC) vs CSK, 2008

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్‌ 66, ఆయుశ్‌ బదోని 50 పరుగులు  చేయగా.. ఆఖర్లో అబ్దుల్‌ సమద్‌ 10 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్‌ మార్ష్‌ (4), పంత్‌ (3) విఫలమయ్యారు. రాజస్థాన్‌ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్‌, సందీప్‌ శర్మ, తుషార్‌ దేశ్‌పాండే తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం ఛేదనకు దిగిన రాయల్స్‌ ఆది నుంచే దూకుడుగా ఆడుతుంది. తొలి బంతికే సిక్సర్‌ కొట్టిన సూర్యవంశీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో ఆవేశ్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి నితీశ్‌ రాణా (8) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత రాయల్స్‌ స్కోర్‌ 94/2గా ఉంది. యశస్వి జైస్వాల్‌ (52), రియాన్‌ పరాగ్‌ క్రీజ్‌లో ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement