
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 19) రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్‌లో రాయల్స్ గెలుపుకు 9 పరుగులు అవసరం కాగా.. ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులే ఇచ్చాడు.
లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ 66, ఆయుశ్ బదోని 50 పరుగులు చేయగా.. ఆఖర్లో అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్ మార్ష్ (4), పంత్ (3) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే తలో వికెట్ దక్కించుకున్నారు.
ఛేదనలో యశస్వి జైస్వాల్ (74), వైభవ్ సూర్యవంశీ (34), రియాన్ పరాగ్ (39) అద్భుతంగా ఆడినప్పటికీ.. రాయల్స్ ఒత్తిడికి చిత్తై గెలుపు వాకిట బోర్లా పడింది. రాయల్స్ ఈ సీజన్‌లో ఇలా ఓడటం ఇది రెండో సారి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ రాయల్స్ గెలుస్తుందనుకుంటే సూపర్ వరకు వెళ్లి ఓటమిపాలైంది. ఆవేశ్ ఖాన్ (4-0-37-3) ఒంటిచేత్తో రాయల్స్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.