ఈ ఏడాది ప్రారంభమైన సౌతాఫ్రికా టి20 లీగ్ తొలి ఎడిషన్ విజయవంతంగా సాగుతుంది. లీగ్‌లో భాగంగా బుధవారం ముంబై కేప్‌టౌన్, సన్‌రైజర్స్ ఈస్ట్రన్ మధ్య మ్యాచ్ జరిగింది. హోరాహోరిగా సాగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఈస్ట్రర్న్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విషయం పక్కనబెడితే మ్యాచ్ మధ్యలో ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది.
సన్‌రైజర్స్ ఈస్ట్రన్ ఇన్నింగ్స్ సందర్భంగా మార్కో జాన్సెన్ క్రీజులో ఉన్నాడు. ముంబై బౌలర్ సామ్ కర్రన్ వేసిన 13వ ఓవర్ లో చివరి బంతిని జాన్సెన్ డీప్ మిడ్ వికెట్ కార్నర్ మీదుగా షాట్ ఆడాడు. ఆ బాల్ ఇద్దరు ఫీల్డర్ల మధ్య నుంచి బౌండరీకి వెళ్లింది. ఈ క్రమంలో ఒక ఫీల్డర్ బంతిని ఆపే ప్రయత్నంలో డైవ్ చేశాడు. అయితే ఆ ఫీల్డర్ సరాసరి అక్కడే ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్‌ను ఢీ కొన్నాడు. దీంతో యాంకర్ పట్టుతప్పి కిందపడిపోయింది. కాగా అనుకోని ఘటనలో యాంకర్‌కు పెద్దగా గాయాలు కాలేదు. ఆ తర్వాత పైకి లేచిన యాంకర్ తనకు ఏమీ కాలేదని నవ్వుతూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది.
ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై కేప్ టౌన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. జట్టులో గ్రాంట్ రోలోఫ్సెన్ 56 పరుగులతో రాణించాడు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ జట్టు 15 ఓవర్లలో 101 పరుగులకే 6 వికెట్లు కొల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో మార్కో జాన్సెన్ అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు . కేవలం 27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 66 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
"This is coming straight for us.." 🫣@ZAbbasOfficial, you good? 🤣@CapeTownCityFC your manager somehow avoided the contact! pic.twitter.com/32YPcfLCMf
— SuperSport 🏆 (@SuperSportTV) January 18, 2023
Comments
Please login to add a commentAdd a comment