పక్షిలా.. గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో సంచలన క్యాచ్‌! వీడియో | SA20 League 2024: Is It A Bird, Aiden Markram's Senstational Catch - Sakshi
Sakshi News home page

పక్షిలా.. గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో సంచలన క్యాచ్‌! వీడియో వైరల్‌

Published Wed, Feb 7 2024 10:46 AM | Last Updated on Wed, Feb 7 2024 3:26 PM

SAT20 League 2024 Is It A Bird Aiden Markram Senstational Catch - Sakshi

మార్కరమ్‌ సంచలన క్యాచ్‌ (PC: SAT20 X)

SAT20 League 2024: డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌ కెప్టెన్‌ ఐడెన్‌ మార్కరమ్‌ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. డర్బన్‌ బ్యాటర్‌ జేజే స్మట్స్‌ బంతిని గాల్లోకి లేపగానే పక్షిలా ఎగిరి ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు. 

ఈ క్రమంలో దాదాపు రెండు సెకండ్లపాటు గాల్లోనే ఉన్న మార్కరమ్‌ విజయవంతంగా క్యాచ్‌ పట్టి.. కీలక వికెట్‌ కూల్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2024లో భాగంగా క్వాలిఫయర్‌-1లో సన్‌రైజర్స్‌- డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌తో తలపడింది.

కేప్‌టౌన్‌లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఈ క్రమంలో టార్గెట్‌ ఛేదించేందుకు బరిలోకి దిగిన డర్బన్‌ను ఆదిలోనే కష్టాలపాలైంది. అతడికి తోడుగా వియాన్‌ మల్దర్‌(38), హెన్రిచ్‌ క్లాసెన్‌(23) రాణించినా మిగతా వాళ్ల నుంచి ఏమాత్రం సహకారం అందలేదు.

ఒంటిచేత్తో సంచలన క్యాచ్‌
ఈ క్రమంలో రైజర్స్‌ పేసర్ల ధాటికి తలవంచిన డర్బన్‌ 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో సన్‌రైజర్స్‌ 2024-ఫైనల్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో మార్కరమ్‌ పట్టిన క్యాచ్‌ హైలైట్‌గా నిలిచింది.

డర్బన్‌ ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్‌ ఐదో బంతికి రైజర్స్‌ పేసర్‌ ఒట్నీల్‌ బార్ట్‌మన్‌ బౌలింగ్‌లో.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ జేజే స్మట్స్‌ మిడాన్‌ దిశగా పుల్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి గాల్లోకి లేవగానే మెరుపువేగంతో కదిలిన మార్కరమ్‌ ఒంటి చేత్తో అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో.. 4 బంతులు ఎదుర్కొన్న స్మట్స్‌ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు.

చదవండి: దంచికొట్టిన మలన్‌.. చెలరేగిన పేసర్లు.. ఫైనల్‌కు సన్‌రైజర్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement