Durban Super Giants
-
హెన్రిస్ క్లాసెన్ విధ్వంసం.. కేవలం 30 బంత్లులో! వీడియో వైరల్
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో ప్రోటీస్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిస్ క్లాసెన్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్లాసెన్.. జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సూపర్ కింగ్స్ బౌలర్లను హెన్రిచ్ ఊచకోత కోశాడు. తొలుత ఆచితూచి ఆడిన క్లాసెన్ 15 ఓవర్ తర్వాత తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ముఖ్యంగా సూపర్ కింగ్స్ బౌలర్ సామ్ కుక్కు క్లాసెన్ చుక్కలు చూపించాడు. 18 ఓవర్ వేసిన కుక్ బౌలింగ్‌లో క్లాసెన్ హ్రాట్రిక్ సిక్స్‌లు బాదాడు. ఓవరాల్‌గా ఈమ్యాచ్‌లో కేవలం 30 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్.. 7 సిక్స్‌లు, 3 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా క్లాసెన్ కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన 208.87 స్ట్రైక్ రేట్‌తో క్లాసెన్ 447 పరుగులు చేశాడు. కాగా క్లాసెన్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సూపర్ కింగ్స్‌పై 69 పరుగుల తేడాతో డర్బన్ సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. దీంతో తొలిసారి సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫైనల్లో డర్బన్ అడుగుపెట్టింది. 𝐇𝐞𝐢𝐧𝐫𝐢𝐜𝐡 𝐊𝐥𝐚𝐚𝐬𝐞𝐧 - Remember the name 😌#DSGvJSK #WelcomeToIncredible #SA20onJioCinema #SA20onSports18 #JioCinemaSports pic.twitter.com/SJzzo54dzK — JioCinema (@JioCinema) February 8, 2024 -
సూపర్ కింగ్స్ చిత్తు.. ఫైనల్‌కు చేరిన డర్బన్ సూపర్ జెయింట్స్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో డర్బన్ సూపర్ జెయింట్స్ ఫైనల్లో అడగుపెట్టింది. గురువారం జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన జెయింట్స్.. తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. డర్బన్ బ్యాటర్లలో హెన్రిస్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 30 బంతుల్లోనే 7 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. అతడితో వియాన్ ముల్డర్(50) హాఫ్ సెంచరీతో రాణించాడు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో నంద్రే బర్గర్, బ్రెస్‌వెల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్ కుక్, గాలైం తలా వికెట్ సాధించారు. అనంతరం 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో 142 పరుగులకే చాపచుట్టేసింది. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో మొయిన్ అలీ(30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డర్బన్ బౌలర్లలో జూనియర్ డాలా 4 వికెట్లతో సూపర్ కింగ్స్ పతనాన్ని శాసించగా.. నవీన్ ఉల్ హాక్, ప్రిటోరియస్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఫిబ్రవరి 10న కేప్‌టౌన్ వేదికగా జరగనున్న ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, డర్బన్ సూపర్ జెయింట్స్ తాడొపేడో తెల్చుకోనున్నాయి. -
పక్షిలా.. గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో సంచలన క్యాచ్! వీడియో
SAT20 League 2024: డర్బన్ సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కెప్టెన్ ఐడెన్ మార్కరమ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. డర్బన్ బ్యాటర్ జేజే స్మట్స్ బంతిని గాల్లోకి లేపగానే పక్షిలా ఎగిరి ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు. ఈ క్రమంలో దాదాపు రెండు సెకండ్లపాటు గాల్లోనే ఉన్న మార్కరమ్ విజయవంతంగా క్యాచ్ పట్టి.. కీలక వికెట్ కూల్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో భాగంగా క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్- డర్బన్ సూపర్ జెయింట్స్‌తో తలపడింది. కేప్‌టౌన్‌లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఈ క్రమంలో టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన డర్బన్ను ఆదిలోనే కష్టాలపాలైంది. అతడికి తోడుగా వియాన్ మల్దర్(38), హెన్రిచ్ క్లాసెన్(23) రాణించినా మిగతా వాళ్ల నుంచి ఏమాత్రం సహకారం అందలేదు. ఒంటిచేత్తో సంచలన క్యాచ్ ఈ క్రమంలో రైజర్స్ పేసర్ల ధాటికి తలవంచిన డర్బన్ 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ 2024-ఫైనల్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో మార్కరమ్ పట్టిన క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. డర్బన్ ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్ ఐదో బంతికి రైజర్స్ పేసర్ ఒట్నీల్ బార్ట్‌మన్ బౌలింగ్‌లో.. నాలుగో నంబర్ బ్యాటర్ జేజే స్మట్స్ మిడాన్ దిశగా పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి గాల్లోకి లేవగానే మెరుపువేగంతో కదిలిన మార్కరమ్ ఒంటి చేత్తో అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో.. 4 బంతులు ఎదుర్కొన్న స్మట్స్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. చదవండి: దంచికొట్టిన మలన్.. చెలరేగిన పేసర్లు.. ఫైనల్‌కు సన్‌రైజర్స్ 𝐈𝐬 𝐢𝐭 𝐚 𝐛𝐢𝐫𝐝, 𝐢𝐬 𝐢𝐭 𝐩𝐥𝐚𝐧𝐞.. 𝐧𝐨 𝐢𝐭 𝐢𝐬 𝐒𝐮𝐩𝐞𝐫 𝐀𝐢𝐝𝐞𝐧. 🦸♂️#Betway #SA20 #Playoffs #SECvDSG #WelcomeToIncredible pic.twitter.com/WFz4dZJvPW — Betway SA20 (@SA20_League) February 6, 2024 -
దంచికొట్టిన మలన్.. చెలరేగిన పేసర్లు.. ఫైనల్‌కు సన్‌రైజర్స్
SA20, 2024 Qualifier 1 - Sunrisers Eastern Cape won by 51 runs: సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జైత్రయాత్ర కొనసాగుతోంది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఈ డిఫెండింగ్ చాంపియన్ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వాలిఫయర్-1లో డర్బన్ సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసి.. ఈ సీజన్లో తుదిపోరుకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. దంచికొట్టిన మలన్ సొంతమైదానం న్యూలాండ్స్‌లో మంగళవారం డర్బన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డేవిడ్ మలన్(45 బంతుల్లో 63 రన్స్) దంచికొట్టగా.. కెప్టెన్ ఐడెన్ మార్కరమ్(23 బంతుల్లో 30) కూడా రాణించాడు. చెలరేగిన ఒట్నీల్, జాన్సెన్ వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు స్కోరు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్‌కు సన్‌రైజర్స్ పేసర్లు ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జాన్సెస్ చుక్కలు చూపించారు. 51 పరుగుల తేడాతో రైజర్స్ గెలుపు ఇద్దరూ తలా నాలుగేసి వికెట్లు పడగొట్టి డర్బన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. వీరికి తోడు స్పిన్నర్ లియామ్ డాసన్ రెండు కీలక వికెట్లు తీసి 106 పరుగులకే డర్బన్ జట్టును ఆలౌట్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. రైజర్స్ విధించిన టార్గెట్‌ను పూర్తిచేయలేక 19.3 ఓవర్లకే డర్బన్ ఇలా చేతులెత్తేయడంతో 51 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. అద్భుత బౌలింగ్‌తో డర్బన్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్(20), వియాన్ మల్దర్(38), హెన్రిచ్ క్లాసెన్(23) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇక సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఒట్నీల్ బార్ట్‌మన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు. డర్బన్‌కు మరో అవకాశం ఇదిలా ఉంటే.. డర్బన్ సూపర్ జెయింట్స్‌కు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంది. పర్ల్ రాయల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో డర్బన్ ఫైనల్లో చోటు కోసం తలపడాల్సి ఉంటుంది. చదవండి: జింబాబ్వే పర్యటనకు టీమిండియా.. ఐదు మ్యాచ్‌ల సిరీస్.. షెడ్యూల్ ఇదే 𝑭𝒊𝒓𝒔𝒕 𝒊𝒏𝒏𝒊𝒏𝒈𝒔 𝒂𝒄𝒕𝒊𝒐𝒏 🔥#Betway #SA20 #Playoffs #SECvDSG #WelcomeToIncredible pic.twitter.com/LG99C0gG5r — Betway SA20 (@SA20_League) February 6, 2024 -
టీ20 మ్యాచ్‌లో బ్యాటర్ల ఊచకోత.. ఏకంగా 412 పరుగులు!
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో జో బర్గ్ సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సూపర్ కింగ్స్.. ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది.ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి ఏకంగా 412 పరుగులు చేశాయి. ఇరు జట్ల బ్యాటర్లు ఏకంగా 20 సిక్స్‌లు బాదారు. తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. సూపర్ జెయింట్స్ బ్యాటర్లలో జేజే స్మట్స్(55), ముల్దర్(59) హాఫ్ సెంచరీలతో సత్తచాటగా.. ఆఖరిలో క్లాసెన్(16 బంతుల్లో 40, 3 సిక్స్‌లు, 3 ఫోర్లు) మెరుపులు మెరిపించాడు. అనంతరం 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేదించింది. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(29 బంతుల్లో 57), లూస్ డిప్లై(57) హాఫ్ సెంచరీతో సత్తాచాటారు. వీరిద్దరితో పాటు మడ్సన్(44 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో నూర్ ఆహ్మద్ రెండు, ప్రిటోరియస్ ఒక్క వికెట్ పడగొట్టాడు. -
విల్ జాక్స్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా డర్బన్ సూపర్ జెయింట్స్‌తో నిన్న (జనవరి 18) జరిగిన మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ ఓపెనర్, ఇంగ్లండ్ ఆటగాడు విల్ జాక్స్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో జాక్స్ కేవలం 41 బంతుల్లోనే 8 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో శతక్కొట్టి, లీగ్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. జాక్స్ రెచ్చిపోవడంతో ఈ మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి, సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. Will Jacks is the King of Centurion 👑#Betway #SA20 #WelcomeToIncredible #PCvDSG pic.twitter.com/TvhnZcI3DN — Betway SA20 (@SA20_League) January 18, 2024 తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. జాక్స్ శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో జాక్స్‌తో పాటు కొలిన్ ఇంగ్రామ్ (23 బంతుల్లో 43), ఫిలిప్ సాల్ట్ (13 బంతుల్లో 23) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో రీస్ టాప్లే (4-1-34-3) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. జూనియర్ డాలా 2, కేశవ్ మహారాజ్, మార్కస్ స్టోయినిస్, కీమో పాల్, ప్రిటోరియస్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో తడబడిన సూపర్ జెయింట్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 187 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. బ్యాట్‌తో విజృంభించిన విల్ జాక్స్.. బంతితోనూ (3-0-18-2) రాణించాడు. అతనితో పాటు వేన్ పార్నెల్ (2/54), విల్యోన్ (2/39), నీషమ్ (1/28) వికెట్లు తీశారు. సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ బ్రీట్జ్కీ (33) టాప్ స్కోరర్‌గా నిలువగా.. డికాక్ (25), స్మట్స్ (27), కేశవ్ మహారాజ్ (25 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం.. కేవలం 35 బంతుల్లోనే..!
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మూడు రోజుల్లోనే మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌తో నిన్న (జనవరి 11) జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 35 బంతుల్లోనే 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. క్లాసెన్ ఊచకోత దెబ్బకు డర్బన్ సూపర్ జెయింట్స్ 11 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్) గెలుపొందింది. WHAT A KNOCK, HENRICH KLAASEN....!!!! An iconic innings in SA20 league, Durban was down & out in the chase then a one man show from Klaasen, smashed 85 runs from just 35 balls against MI Capetown - The beast. 🔥 pic.twitter.com/AklROoddtN — Johns. (@CricCrazyJohns) January 11, 2024 తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (51 బంతుల్లో 87; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోగా.. కెప్టెన్ పోలార్డ్ (14 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), లివింగ్‌స్టోన్ (20 బంతుల్లో 25; 3 సిక్సర్లు), వాన్‌డర్ డస్సెన్ (20 బంతుల్లో 24; ఫోర్, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. డర్బన్ బౌలర్లలో కీమో పాల్ 2, కెప్టెన్ కేశవ్ మహారాజ్, ప్రిటోరియస్, రిచర్డ్ గ్లీసన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో వరుణుడు అడ్డుతగలడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన డర్బన్ను విజేతగా ప్రకటించారు. 16.3 ఓవర్లు ముగిసే సమయానికి డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 166 పరుగులు చేయాల్సి ఉండగా.. డర్బన్ 177 పరుగులు (6 వికెట్ల నష్టానికి) చేసి 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. డర్బన్ ఇన్నింగ్స్‌లో క్లాసెన్‌తో పాటు మాథ్యూ బ్రీట్జ్కీ (39) రాణించాడు. కేప్‌టౌన్ బౌలర్లలో రబాడ 2, హెండ్రిక్స్, సామ్ కర్రన్, ఓలీ స్టోన్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో డర్బన్ SA20 2024 ఎడిషన్‌లో బోణీ కొట్టింది. ఈ సీజన్లో నిన్న జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. -
క్లాసెన్ సూపర్ సెంచరీ.. 151 పరుగుల తేడాతో సూపర్ జెయింట్స్ భారీ విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ మరో అద్భుత విజయం సాధించింది. ఈ లీగ్‌లో భాగంగా ఆదివారం ప్రిటోరియా క్యాపిటిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 151 పరుగుల తేడాతో సూపర్ జెయింట్స్ విజయభేరి మోగించింది. 255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా క్యాపిటిల్స్ 103 పరుగులకే కుప్పకూలింది. డర్బన్ బౌలర్లలో జూనియర్ డలా మూడు వికెట్లతో ప్రిటోరియా పతనాన్ని శాసించగా.. ప్రిటోరియస్, ముల్డర్ తలా రెండు వికెట్లు, టోప్లీ, కీమో పాల్ చెరో ఒక్క వికెట్ సాధించారు. ప్రిటోరియా బౌలర్లలో ఈతాన్ బాష్ 23 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హెన్రిచ్ క్లాసెన్ సూపర్ సెంచరీ.. ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్.. క్లాసన్ అద్భుతసెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. 44 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్ 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు బ్రీట్జెక్(21 బంతుల్లో 46), డికాక్(20 బంతుల్లో 43) రాణించారు. ఇక ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 19 పాయింట్లతో సూపర్ జెయింట్స్ ఐదో స్థానంలో ఉంది. చదవండి: WPL 2023: ముంబై జట్టు హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
SA20 2023: నిరాశపరిచిన బేబీ ఏబీడీ.. రెచ్చిపోయిన డికాక్.. ఆఖరి ఓవర్లో..
Durban Super Giants vs MI Cape Town: ఎంఐ కేప్‌టౌన్‌తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన టీ20 మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌దే పైచేయి అయింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ క్వింటన్ డికాక్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించడంతో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. హోరాహోరీగా జరిగిన పోరులో చివరికి ఓ బంతి మిగిలి ఉండగానే విజయం అందుకుంది. సౌతాఫ్రికా టీ20-2023 లీగ్‌లో భాగంగా డర్బన్‌లోని కింగ్స్టన్ వేదికగా ఎంఐ కేప్‌టౌన్- డర్బన్ సూపర్‌జెయింట్స్ మధ్య గురువారం మ్యాచ్ జరిగింది. సొంతమైదానంలో టాస్ గెలిచిన సూపర్‌జెయింట్స్ కెప్టెన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. నిరాశపరిచిన బేబీ ఏబీడీ ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఎంఐ కేప్‌టౌన్‌కు ఓపెనర్లు డెవాల్డ్ బ్రెవిస్(13), రొలోఫ్సెన్(10) శుభారంభం అందించలేకపోయారు. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన వాన్ డెర్ డసెన్ 32 బంతుల్లో 43 పరుగులతో రాణించగా.. ఐదో స్థానంలో వచ్చిన టిమ్ డేవిడ్ 33 రన్స్ చేశాడు. ఆఖర్లో ఓడియన్ స్మిత్ 10 బంతుల్లో 2 ఫక్షర్లు, ఒక సిక్సర్ సాయంతో 17 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. డెలానో 17 బంతుల్లో 32 పరుగులతో మెరుపులు మెరిపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కేప్‌టౌన్ 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. చెలరేగిన డికాక్ లక్ష్య ఛేదనకు దిగిన సూపర్ జెయింట్స్‌కు ఓపెనర్ డికాక్ ఆది నుంచే దూకుడు చూపడం కలిసి వచ్చింది. కెప్టెన్ డికాక్ 41 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు సాధించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన మాథ్యూ బ్రీట్జ్కె 48 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. గెలిచినా.. మిగిలిన వాళ్లలో కీమో పాల్ 18 బంతుల్లో 31 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో సమిష్టి విజయంతో సూపర్ జెయింట్స్ విజయాన్ని అందుకుంది. అయితే, పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మాత్రం మెరుగుపరచుకోలేకపోయింది. సౌతాఫ్రికా టీ20 లీగ్-2023 సీజన్లో ప్రిటోరియా క్యాపిటల్స్ ఏడింట 5 విజయాలతో టాప్‌లో ఉండగా.. సన్‌రైజర్స్ ఎనిమిదింట 4 గెలిచి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక రాయల్స్ మూడు, సూపర్‌కింగ్స్ నాలుగు స్థానాల్లో ఉండగా.. ఎంఐ, డర్బన్ ఆఖరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడగా మూడు విజయాలు సాధించాయి. అయితే, పాయింట్ల పరంగా ఎంఐ(13 పాయింట్లు) కంటే వెనుకబడ్డ డర్బన్ (12)చివరి స్థానంలో నిలిచింది. చదవండి: ILT 20 2023: ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు.. పఠాన్‌ను ఉతికారేసిన విండీస్ స్టార్ IND vs SA Womens T20 Tri Series 2023: తుది పోరులో పేలవంగా... Destructive @timdavid8 💪 Quintessential @QuinnyDeKock69 🔥#DSGvMICT was indeed a blockbuster encounter 🍿👌 🎥 the highlights and more of #SA20 action on #JioCinema, #Sports18 & @ColorsTvTamil 📺 📲#SA20onJioCinema #SA20onSports18 | @SA20_League pic.twitter.com/296WIhXFmm — JioCinema (@JioCinema) February 2, 2023 #DSG captain Quinton de Kock is all smiles after an important win over #MICT#Betway #SA20 | @Betway_India pic.twitter.com/3fjmPUDPxY — Betway SA20 (@SA20_League) February 2, 2023 #MICT captain Rashid Khan knows his side will come back stronger after their defeat at the hands of #DSG#Betway #SA20 | @Betway_India pic.twitter.com/pKCFETAYgp — Betway SA20 (@SA20_League) February 2, 2023 -
SA20 2023: ఆర్సీబీ కెప్టెన్ విధ్వంసం.. టోర్నీలో తొలి సెంచరీ నమోదు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ సౌతాఫ్రికా 20 లీగ్(SA20 2023) టోర్నీలో తొలి శతకంతో మెరిశాడు. లీగ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డుప్లెసిస్ కెప్టెన్‌గా జట్టును నడిపిస్తున్నాడు. (58 బంతుల్లోనే 113 పరుగులు నాటౌట్) చేసిన డుప్లెసిస్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండడం విశేషం. ముందు కెప్టెన్‌గా తన బాధ్యతను నిర్వహించిన డుప్లెసిస్ ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ విధ్వంసం సృష్టించాడు.కాగా తొలిసారి జరుగుతున్న సౌతాఫ్రికా 20 లీగ్ 2023లో డుప్లెసిస్‌దే తొలి శతకం కావడం విశేషం. ఇక డుప్లెసిస్ ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లు కలిపి 277 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో జాస్ బట్లర్ 285 పరుగులు(పార్ల్ రాయల్స్ జట్టు) ఉన్నాడు. మంగళవారం వాండరర్స్ వేదికగా డర్బన్ సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్(48 బంతుల్లో 65 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హోల్డర్ 28, కైల్ మేయర్స్ 28 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్ డుప్లెసిస్ ధాటికి 19.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 45 పరుగులతో రాణించాడు. ఇక గతేడాది ఐపీఎల్లో డుప్లెసిస్ ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అతని సారధ్యంలో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు షాకిచ్చిన ఆర్సీబీ క్వాలిఫయర్-2లో మాత్రం రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఖంగుతింది. అలా గతేడాది ఐపీఎల్లో ఆర్సీబీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. The maiden #Betway #SA20 CENTURY has been an absolute delight to witness! Faf du Plessis is a man for the big moments 🔥#JSKvDSG | @Betway_India pic.twitter.com/QcZAAYOLU6 — Betway SA20 (@SA20_League) January 24, 2023 చదవండి: SA20 2023: చెలరేగిన బట్లర్, మిల్లర్.. సన్‌రైజర్స్‌కు భంగపాటు '22 ఏళ్ల పరిచయం.. కచ్చితంగా తప్పు చేసి ఉండడు' -
ఫోర్టిన్ మాయాజాలం, మేయర్స్ ఆల్‌రౌండ్ షో.. రాజస్థాన్, లక్నో జట్ల విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్‌ల్లో పార్ల్ రాయల్స్ (రాజస్థాన్ రాయల్స్), డర్బన్ సూపర్ జెయింట్స్ (లక్నో సూపర్ జెయింట్స్) జట్లు విజయం సాధించాయి. తొలి మ్యాచ్‌లో రాయల్స్.. సూపర్ కింగ్స్‌ను 7 వికెట్ల తేడాతో, సూపర్ జెయింట్స్.. ముంబై కేప్ టౌన్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించాయి. తిప్పేసిన రాయల్స్ స్పిన్నర్లు.. పార్ల్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్.. స్పిన్నర్లు ఫోర్టిన్ (3/16), ఇవాన్ జోన్స్ (3/21), తబ్రేజ్ షంషి (1/4) మాయాజాలం ధాటికి 17.2 ఓవర్లలో 81 పరుగులకే చాపచుట్టేసింది. వెర్రిన్ (11), అల్జరీ జోసఫ్ (13), విలియమ్స్ (17 నాటౌట్), ఫాంగిసో (10) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. స్వల్ప లక్ష్య ఛేదనలో రాయల్స్ 10.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. జోస్ బట్లర్ (21 బంతుల్లో 29; 4 ఫోర్లు) అజేయమైన ఇన్నింగ్స్‌తో రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. తలో చేయి వేసిన ఎంఐని ఓడించిన సూపర్ జెయింట్స్.. డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్ టౌన్.. రోలోఫ్సన్ (44 బంతుల్లో 52; 4 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో, జార్జ్ లిండే (33), డెలానో పాట్గేయిటర్ (25) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. సూపర్ జెయింట్స్ బౌలర్లలో టాప్లే, సుబ్రయెన్, విల్యోన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కైల్ మేయర్స్, జేసన్ హోల్డర్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఛేదనలో కైల్ మేయర్స్ (34), వియాన్ ముల్దర్ (30), హెన్రిచ్ క్లాసిన్ (36), కీమో పాల్ (20 నాటౌట్) తలో చేయి వేసి సూపర్ జెయింట్స్‌ను గెలిపించారు. ఎంఐ బౌలర్లలో ఓలీ స్టోన్ 4 వికెట్లు పడగొట్టగా.. జార్జ్ లిండేకు ఓ వికెట్ దక్కింది. కాగా, లీగ్‌లో భాగంగా ఇవాళ (జనవరి 14) జరుగబోయే మ్యాచ్‌ల్లో ప్రిటోరియ క్యాపిటల్స్-సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్లు.. ఎంఐ కేప్ టౌన్-జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. -
SA20 2023: డికాక్ పోరాటం వృధా.. చెన్నై చేతిలో లక్నో ఓటమి
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంలో నడిచే జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టు శుభారంభం చేసింది. బుధవారం (జనవరి 11) డర్బన్ సూపర్ జెయింట్స్ (లక్నో సూపర్ జెయింట్స్)తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ సూపర్ కింగ్స్.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు డొనావాన్ ఫెరియెరా (40 బంతుల్లో 82 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (20 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 27 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సూపర్ కింగ్స్‌ను వీరి జోడీ (85 పరుగులు జోడించి) ఆదుకుంది. సూపర్ జెయింట్స్ బౌలర్లలో సుబ్రయెన్ 2 వికెట్లు పడగొట్టగా.. కేశవ్ మహారాజ్, ప్రిటోరియస్, అఖిల ధనంజయ, జేసన్ హోల్డర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 174 పరుగులకు మాత్రమే పరిమితై ఓటమిపాలైంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (52 బంతుల్లో 78; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) సూపర్ జెయింట్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. మరో ఓపెనర్ కైల్ మేయర్స్ (29 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసిన్ (20), ప్రిటోరియస్ (6 బంతుల్లో 14; 2 సిక్సర్లు) తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. జోబర్గ్ సూపర్ కింగ్స్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 2, మలుసి సిబోటో, డొనావాన్ ఫెరియెరా, ఆరోన్ ఫాంగిసో తలో వికెట్ పడగొట్టారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (82 నాటౌట్, ఒక వికెట్) అదరగొట్టిన డొనావాన్ ఫెరియెరాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ సన్‌రైజర్స్ ఈస్ట్ర్న్ కేప్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), ప్రిటోరియా క్యాపిటల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) జట్లు తలపడనున్నాయి. భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌ను మినీ ఐపీఎల్‌గా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో పాల్గొనే మొత్తం ఆరు జట్లను ఐపీఎల్ జట్ల యాజమాన్యాలే కొనుగోలు చేశాయి.