SA20 2023: నిరాశపరిచిన బేబీ ఏబీడీ.. రెచ్చిపోయిన డికాక్‌.. ఆఖరి ఓవర్‌లో.. | SA20 2023: Durban Super Giants Beat MI Cape Town Last Over Thriller But | Sakshi
Sakshi News home page

MICT Vs DSG: నిరాశపరిచిన బేబీ ఏబీడీ.. రెచ్చిపోయిన డికాక్‌.. ఎంఐపై సూపర్‌ జెయింట్స్‌ గెలుపు

Published Fri, Feb 3 2023 10:23 AM | Last Updated on Fri, Feb 3 2023 10:40 AM

SA20 2023: Durban Super Giants Beat MI Cape Town Last Over Thriller But - Sakshi

Durban Super Giants vs MI Cape Town: ఎంఐ కేప్‌టౌన్‌తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన టీ20 మ్యాచ్‌లో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌దే పైచేయి అయింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ క్వింటన్‌ డికాక్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో రాణించడంతో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. హోరాహోరీగా జరిగిన పోరులో చివరికి ఓ బంతి మిగిలి ఉండగానే విజయం అందుకుంది.

సౌతాఫ్రికా టీ20-2023 లీగ్‌లో భాగంగా డర్బన్‌లోని కింగ్‌స్టన్‌ వేదికగా ఎంఐ కేప్‌టౌన్‌- డర్బన్‌ సూపర్‌జెయింట్స్‌ మధ్య గురువారం మ్యాచ్‌ జరిగింది. సొంతమైదానంలో టాస్‌ గెలిచిన సూపర్‌జెయింట్స్‌ కెప్టెన్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

నిరాశపరిచిన బేబీ ఏబీడీ
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఎంఐ కేప్‌టౌన్‌కు ఓపెనర్లు డెవాల్డ్‌ బ్రెవిస్‌(13), రొలోఫ్సెన్‌(10) శుభారంభం అందించలేకపోయారు. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన వాన్‌ డెర్‌ డసెన్‌ 32 బంతుల్లో 43 పరుగులతో రాణించగా.. ఐదో స్థానంలో వచ్చిన టిమ్‌ డేవిడ్‌ 33 రన్స్‌ చేశాడు.

ఆఖర్లో ఓడియన్‌ స్మిత్‌ 10 బంతుల్లో 2 ఫక్షర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 17 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. డెలానో 17 బంతుల్లో 32 పరుగులతో మెరుపులు మెరిపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కేప్‌టౌన్‌ 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

చెలరేగిన డికాక్‌
లక్ష్య ఛేదనకు దిగిన సూపర్‌ జెయింట్స్‌కు ఓపెనర్‌ డికాక్‌ ఆది నుంచే దూకుడు చూపడం కలిసి వచ్చింది. కెప్టెన్‌ డికాక్‌ 41 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు సాధించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన మాథ్యూ బ్రీట్జ్కె 48 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

గెలిచినా..
మిగిలిన వాళ్లలో కీమో పాల్‌ 18 బంతుల్లో 31 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో సమిష్టి విజయంతో సూపర్‌ జెయింట్స్‌ విజయాన్ని అందుకుంది. అయితే, పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మాత్రం మెరుగుపరచుకోలేకపోయింది.

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2023 సీజన్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ ఏడింట 5 విజయాలతో టాప్‌లో ఉండగా.. సన్‌రైజర్స్‌ ఎనిమిదింట 4 గెలిచి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక రాయల్స్‌ మూడు, సూపర్‌కింగ్స్‌  నాలుగు స్థానాల్లో ఉండగా.. ఎంఐ, డర్బన్‌ ఆఖరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడగా మూడు విజయాలు సాధించాయి. అయితే, పాయింట్ల పరంగా ఎంఐ(13 పాయింట్లు) కంటే వెనుకబడ్డ డర్బన్‌ (12)చివరి స్థానంలో నిలిచింది. 

చదవండి: ILT 20 2023: ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు.. పఠాన్‌ను ఉతికారేసిన విండీస్‌ స్టార్‌
IND vs SA Womens T20 Tri Series 2023: తుది పోరులో పేలవంగా...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement