దక్షిణాఫ్రికా (ఎస్‌ఏ) టి20 లీగ్‌లో వరుసగా మూడోసారి ఫైనల్స్‌కు
నేడు ఎంఐ కేప్‌టౌన్‌తో టైటిల్ పోరు
రాత్రి 9 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–2, స్పోర్ట్స్ 18 చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
సెంచూరియన్: భారత్‌కు చెందిన సన్‌రైజర్స్ యాజమాన్యంలోని ఈస్టర్న్ కేప్ జట్టు దక్షిణాఫ్రికా టి20 లీగ్(South Africa T20 League)లో ‘హ్యాట్రిక్’ టైటిల్‌పై కన్నేసింది. ‘ఎస్‌ఏ20’ పేరిట జరుగుతున్న ఈ టోర్నీలో రెండుసార్లు చాంపియన్ అయిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్(Sunrisers Eastern Cape team) వరుసగా మూడోసారి ఫైనల్స్‌కు అర్హత పొందింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ 8 వికెట్ల తేడాతో పార్ల్ రాయల్స్‌పై జయభేరి మోగించింది. 2023, 2024 సీజన్లలో సన్‌రైజర్స్ జట్టే టైటిల్స్‌ను గెలుచుకుంది.
రెండో క్వాలిఫయర్‌లో మొదట రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రూబిన్ హెర్మన్ (53 బంతుల్లో 81 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), ప్రిటోరియస్ (41 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లు క్రెయిగ్ ఓవర్టన్, జాన్సెన్, ఒటెనీల్, మార్క్‌రమ్ తలా ఒక వికెట్ తీశారు. తర్వాత సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 19.2 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి గెలిచింది.
టోని డి జొర్జి (49 బంతుల్లో 78; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్మాన్ (48 బంతుల్లో 69 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 111 పరుగులు జోడించి జట్టును సులువుగా లక్ష్యానికి చేర్చారు. ఎలిమినేటర్ మ్యాచ్ లో జొబర్గ్ సూపర్‌కింగ్స్‌ను ఓడించిన 24 గంటలకే మరో ప్లేఆఫ్స్ మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ నెగ్గి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.
నేడు జరిగే ఫైనల్లో భారత్‌కు చెందిన ముంబై ఇండియన్స్ యాజమాన్యంలోని ఎంఐ కేప్‌టౌన్‌తో తలపడుతుంది. తొలి క్వాలిఫయర్‌లో అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నేతృత్వంలోని కేప్‌టౌన్ జట్టు 39 పరుగుల తేడాతో పార్ల్ రాయల్స్‌పై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment