
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో ప్రోటీస్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిస్ క్లాసెన్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్లాసెన్.. జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సూపర్ కింగ్స్ బౌలర్లను హెన్రిచ్ ఊచకోత కోశాడు. తొలుత ఆచితూచి ఆడిన క్లాసెన్ 15 ఓవర్ తర్వాత తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
ముఖ్యంగా సూపర్ కింగ్స్ బౌలర్ సామ్ కుక్‌కు క్లాసెన్ చుక్కలు చూపించాడు. 18 ఓవర్ వేసిన కుక్ బౌలింగ్‌లో క్లాసెన్ హ్రాట్రిక్ సిక్స్‌లు బాదాడు. ఓవరాల్‌గా ఈమ్యాచ్‌లో కేవలం 30 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్.. 7 సిక్స్‌లు, 3 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా క్లాసెన్ కొనసాగుతున్నాడు.
ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన 208.87 స్ట్రైక్ రేట్‌తో క్లాసెన్ 447 పరుగులు చేశాడు. కాగా క్లాసెన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సూపర్ కింగ్స్‌పై 69 పరుగుల తేడాతో డర్బన్ సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. దీంతో తొలిసారి సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫైనల్లో డర్బన్ అడుగుపెట్టింది.
𝐇𝐞𝐢𝐧𝐫𝐢𝐜𝐡 𝐊𝐥𝐚𝐚𝐬𝐞𝐧 - Remember the name 😌#DSGvJSK #WelcomeToIncredible #SA20onJioCinema #SA20onSports18 #JioCinemaSports pic.twitter.com/SJzzo54dzK
— JioCinema (@JioCinema) February 8, 2024
Comments
Please login to add a commentAdd a comment