సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మూడు రోజుల్లోనే మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌తో నిన్న (జనవరి 11) జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 35 బంతుల్లోనే 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. క్లాసెన్ ఊచకోత దెబ్బకు డర్బన్ సూపర్ జెయింట్స్ 11 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్) గెలుపొందింది.
WHAT A KNOCK, HENRICH KLAASEN....!!!!
— Johns. (@CricCrazyJohns) January 11, 2024
An iconic innings in SA20 league, Durban was down & out in the chase then a one man show from Klaasen, smashed 85 runs from just 35 balls against MI Capetown - The beast. 🔥 pic.twitter.com/AklROoddtN
తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (51 బంతుల్లో 87; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోగా.. కెప్టెన్ పోలార్డ్ (14 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), లివింగ్‌స్టోన్ (20 బంతుల్లో 25; 3 సిక్సర్లు), వాన్‌డర్ డస్సెన్ (20 బంతుల్లో 24; ఫోర్, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. డర్బన్ బౌలర్లలో కీమో పాల్ 2, కెప్టెన్ కేశవ్ మహారాజ్, ప్రిటోరియస్, రిచర్డ్ గ్లీసన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనలో వరుణుడు అడ్డుతగలడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన డర్బన్‌ను విజేతగా ప్రకటించారు. 16.3 ఓవర్లు ముగిసే సమయానికి డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 166 పరుగులు చేయాల్సి ఉండగా.. డర్బన్ 177 పరుగులు (6 వికెట్ల నష్టానికి) చేసి 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. డర్బన్ ఇన్నింగ్స్‌లో క్లాసెన్‌తో పాటు మాథ్యూ బ్రీట్జ్కీ (39) రాణించాడు. కేప్‌టౌన్ బౌలర్లలో రబాడ 2, హెండ్రిక్స్, సామ్ కర్రన్, ఓలీ స్టోన్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో డర్బన్ SA20 2024 ఎడిషన్‌లో బోణీ కొట్టింది. ఈ సీజన్‌లో నిన్న జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది.
Comments
Please login to add a commentAdd a comment