ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన క్లాసెన్ ఆర్సీబీ బౌలర్లను ఉతికారేశాడు.
బౌలర్‌తో సంబంధం లేకుండా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 31 బంతులు మాత్రమే ఎదుర్కొన్న క్లాసెన్.. 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా ఎస్ఆర్‌హెచ్ తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఈ ఏడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 277 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు.
THE SHOOTING STAR...!!! 💫
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2024
- 106M monster by Heinrich Klaasen. 🥵 pic.twitter.com/raWQGOLOiM
Comments
Please login to add a commentAdd a comment