
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మరోసారి ఉర మాస్ ఇన్నింగ్స్ ఆడాడు. సోమవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. క్లాసెన్ 31 బంతుల్లో 67 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
తన ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అయితే క్లాసెన్ ఇన్నింగ్స్‌లోని ఓ సిక్స్ దెబ్బకు స్టేడియం పైకప్పు దాటి వెళ్లింది. ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన ఫెర్గూసన్ రెండో బంతిని క్లాసెన్‌కు లెంగ్త్ డెలివరీ సంధించాడు. ఆ బంతిని క్లాసెన్ అద్బుతమైన లాఫ్టెడ్ స్ట్రెయిట్ డ్రైవ్ షాట్ ఆడాడు.
దెబ్బకు బంతి చిన్నస్వామి స్టేడియం బయట పడింది. అతడు కొట్టిన సిక్స్ ఏకంగా 106 మీటర్ల దూరం వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ విజయం సాధించింది.
Got an update from #Chandrayaan, the ball is still travelling at the speed of light 😉#TATAIPL #RCBvSRH #IPLonJioCinema #HeinrichKlaasen #IPLinTelugu pic.twitter.com/fmVeijmSlk
— JioCinema (@JioCinema) April 15, 2024
Comments
Please login to add a commentAdd a comment