అరెరే.. ఏమైందిరా మీకు! కావ్య రియాక్ష‌న్ వైర‌ల్‌ | Kavya Marans Perplexed Reaction After Abdul Samads Dismissal | Sakshi
Sakshi News home page

#Kavya Maran: అరెరే.. ఏమైందిరా మీకు! కావ్య రియాక్ష‌న్ వైర‌ల్‌

Published Fri, Apr 26 2024 12:09 AM | Last Updated on Fri, Apr 26 2024 12:09 AM

Kavya Marans Perplexed Reaction After Abdul Samads Dismissal

ఐపీఎల్‌-2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో ఓట‌మి చవిచూసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌, బ్యాటింగ్ పరంగా ఎస్‌హెర్‌హెచ్ విఫ‌ల‌మైంది.

తొలుత బౌలింగ్‌లో 206 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న స‌న్‌రైజ‌ర్స్‌.. అనంత‌రం బ్యాటింగ్‌లోనూ చెతెలేస్తేఇసింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వ‌చ్చిన స‌న్‌రైజ‌ర్స్ ఓన‌ర్‌ కావ్య మార‌న్ మ‌రోసారి త‌న ఎక్స్‌ప్రెష‌న్స్‌తో సోష‌ల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

తొలుత బౌలింగ్‌లో ఆర్సీబీ వికెట్లు ప‌డిన‌ప్పుడు ఎగిరి గెంతులేసిన కావ్యా.. త‌మ బ్యాటింగ్ వ‌చ్చేస‌రికి సీన్ రివ‌ర్స్ అయింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్లు వ‌రుస క్ర‌మంలో పెవిలియ‌న్‌కు క్యూ క‌డుతున్న స‌మ‌యంలో కావ్య మారన్ ముఖం చిన్నబోయింది. ముఖ్యంగా అబ్దుల్ స‌మ‌ద్ ఔటైన త‌ర్వాత కావ్య పాప షాకింగ్ రియాక్ష‌న్ ఇచ్చింది. ఏంటి రా ఏ బ్యాటింగ్ అన్న‌ట్లు కావ్య  ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement