
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఈ ఏడాది సీజన్ ఆద్యంతం ఎస్ఆర్‌హెచ్ అదరగొట్టనప్పటికి ఫైనల్లో మాత్రం తేలిపోయింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఓటమి పాలైంది.
ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ పరంగా దారుణ ప్రదర్శన కనబరిచింది. కేకేఆర్ బౌలర్లలో దాటికి సన్‌రైజర్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. అనంతరం సన్‌రైజర్స్ విధించిన 114 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 10. 3 ఓవర్లలో ఊదిపడేసింది.
నరైన్ (6) రెండో ఓవర్లోనే ఔట్ అయినప్పటికీ.. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (39), వెంకటేశ్ అయ్యర్ (52 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగి తమ జట్టుకు మూడో టైటిల్‌ను అందించారు.
కన్నీళ్లు పెట్టుకున్న కావ్య..
ఇక ఎస్ఆర్‌హెచ్ ఓటమి అనంతరం ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ భావోద్వేగానికి లోనయ్యారు. సీజన్ మొత్తం ఎస్ఆర్‌హెచ్ ఆడే మ్యాచ్‌లకు హాజరై తన జట్టును సపోర్ట్ చేసిన కావ్యకు ఫైనల్ మ్యాచ్‌లో తీవ్ర నిరాశ ఎదురైంది.
సీజన్ అసాంతం ఎంతో సందడి చేసిన కావ్య పాపం.. ఫైనల్లో తమ జట్టు ఓడిపోయాక కన్నీళ్లు పెట్టుకున్నారు. తొలుత స్టాండ్స్‌లో నిలబడి తమ జట్టు పోరాటాన్ని చప్పట్లు కొడుతూ అభినందించిన కావ్య.. వెంటనే వెనక్కి తిరిగి వెక్కివెక్కి ఏడ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
A season to be proud of 🧡#KKRvSRH #IPLonJioCinema #IPLFinalonJioCinema pic.twitter.com/rmgo2nU2JM
— JioCinema (@JioCinema) May 26, 2024