న‌డ‌వ‌లేని స్థితిలో టీమిండియా స్టార్‌ క్రికెట‌ర్‌.. వీడియో | KKR injury worries grow as Harshit Rana spotted on crutches, | Sakshi
Sakshi News home page

IPL 2026: న‌డ‌వ‌లేని స్థితిలో టీమిండియా స్టార్‌ క్రికెట‌ర్‌.. వీడియో

Mar 16 2026 1:51 PM | Updated on Mar 16 2026 2:01 PM

KKR injury worries grow as Harshit Rana spotted on crutches,

ఐపీఎల్‌-2026కు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు హ‌ర్షిత్ రాణా రూపంలో గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. మోకాలి గాయం కార‌ణంగా ఈ ఏడాది సీజ‌న్ మొత్తానికి అత‌డు దూర‌మ‌య్యే అవకాశ‌ముంది. ఆదివారం ఢిల్లీలో జ‌రిగిన బీసీసీఐ న‌మ‌న్ అవార్డుల ప్రధానోత్సవ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన రానా న‌డ‌వ‌లేని స్థితిలో క‌న్పించాడు.

ఊత‌క‌ర్ర‌ల సాయంతో హ‌ర్షిత్‌ కుంటుతూ కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఇది చూసిన నెటిజ‌న్లు అత‌డు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కామెంట్లు చేస్తున్నారు. 

కాగా బెస్ట్ ఇంట‌ర్నేష‌నల్ డెబ్యూ అవార్డు హర్షిత్‌ రాణాకు ద‌క్కింది. ఈ అవార్డు అందుకోవ‌డానికి రాణా వేదికపైకి కూడా రాలేక‌పోయాడు. దీంతో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ స్వయంగా వేదిక దిగి రాణాకు ఈ అవార్డును అందజేశారు.

కాగా హ‌ర్షిత్ గ‌త నెల‌లో సౌతాఫ్రికాతో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2026 వార్మాప్ మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డాడు. అనంత‌రం అత‌డికి అస్ప్ర‌త్రికి త‌ర‌లించి ప‌లు స్కాన్లు నిర్వ‌హించ‌గా.. స‌ర్జ‌రీ అవ‌స‌ర‌మ‌ని వైద్యులు తేల్చారు. దీంతో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు కూడా అత‌డు దూర‌మ‌య్యాడు.

అనంత‌రం ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో సర్జరీ చేయించుకున్నాడు. అత‌డు పూర్తిగా కోలుకోవ‌డానికి ఆరు వారాల స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక ఐపీఎల్‌-19వ సీజన్‌ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.

చదవండి: IPL 2026: స‌న్‌రైజ‌ర్స్‌, సీఎస్‌కే, ముంబై కాదు.. ఆ జ‌ట్టే ఐపీఎల్ విజేత‌!

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement