ఐపీఎల్-2024లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా గౌహతి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. టాస్ పడినప్పటకి మరోసారి వర్షం మొదలు కావడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్‌లు ప్రకటించారు.
ఇక లీగ్ స్టేజీ ముగియడంతో ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లపై ఓ లూక్కేద్దం. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి.
పాయింట్ల టేబుల్‌లో కేకేఆర్(19) పాయింట్లతో అగ్రస్ధానంలో ఉండగా.. ఎస్ఆర్‌హెచ్ 17(నెట్ రన్‌రేట్ +0.414), రాజస్తాన్ 17(నెట్ రన్‌రేట్ +0.273), ఆర్సీబీ(14) పాయింట్లతో వరసగా రెండు, మూడు ,నాలుగు స్ధానాల్లో నిలిచాయి.
ఇక మే 21 నుంచి నాకౌట్ మ్యాచ్‌లకు తెరలేవనుంది. మే 21న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫియర్‌లో కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ జట్లు తలపడునున్నాయి. మే 22న ఎలిమినేటర్‌లో ఆర్సీబీ, రాజస్తాన్ అమీతుమీ తెల్చుకోనున్నాయి.
అనంతరం మే 24 క్వాలిఫియర్-2లో ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు, క్వాలిఫియర్-1లో ఓడిన జట్టు తలపడనున్నాయి. మే 26న చెపాక్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment