ఐపీఎల్-2024లో గౌహతి వేదికగా చివరి లీగ్ మ్యాచ్‌లో తలపడేందుకు రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు సిద్దమయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు.
బర్సపరా క్రికెట్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. దీంతో 7:00 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యం కానుంది. కాగా ఇరు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్ 19 పాయింట్లతో అగ్రస్ధానంలో ఉండగా.. రాజస్తాన్ 16 పాయింట్లతో మూడో స్ధానంలో ఉంది. ఇక పంజాబ్‌పై తమ చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 17 పాయింట్లతో రెండో స్ధానంలో కొనసాగుతోంది.
ఈ క్రమంలో రాజస్తాన్- కేకేఆర్ మ్యాచ్ రద్దవ్వాలని సన్‌రైజర్స్ అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ మ్యాచ్ మొత్తానికి రద్దు అయితే రాజస్తాన్, కేకేఆర్‌కు తలో పాయింట్ లభిస్తుంది.
దీంతో ఎస్‌ఆర్‌హెచ్ 17 పాయింట్లతో తమ రెండో స్ధానాన్ని పదిలం చేసుకుంటుంది. కాగా మ్యాచ్ రద్దు అయితే రాజస్తాన్ ఖాతాలో కూడా 17 పాయింట్లు ఉంటాయి. కానీ రాజస్తాన్ జట్టు కంటే ఎస్‌ఆర్‌హెచ్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది. కాబట్టి ఎస్‌ఆర్‌హెచ్ సెకెండ్ ప్లేస్‌కు ఎటువంటి ఢోకా లేదు.
Comments
Please login to add a commentAdd a comment