![IPL 2024 Playoffs: What happens if matches get abandoned?](/styles/webp/s3/article_images/2024/05/20/match.jpg.webp?itok=xc15uUTZ)
ఐపీఎల్-2024లో ప్లే ఆఫ్స్ సమరానికి రంగం సిద్దమైంది. మంగళవారం(మే 21)తో ప్లే ఆఫ్స్‌కు తెరలేవనుంది. పాయింట్స్ టేబుల్‌లో టాప్-4లో నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి.
మే 21న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫియర్-1లో టాప్-2లో నిలిచిన కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. అనంతరం మే 22న క్వాలిఫియర్-2లో రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.
అయితే గత 8 లీగ్ మ్యాచ్‌ల్లో మూడు వర్షంతో రద్దయ్యాయి. ఆదివారం కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్ సైతం రద్దు అయింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగిస్తే ఏంటి పరిస్థితి అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.
ప్లే ఆఫ్స్‌కు రిజర్వ్ డే..
ఐపీఎల్-2024 సీజన్‌లో క్వాలిఫియర్-1, ఎలిమినేటర్, క్వాలిఫియర్-2 మ్యాచ్‌లతో పాటు ఫైనల్‌కు రిజర్వ్ డే కేటాయించారు. మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించి, ఆ రోజు ఆట సాధ్యపడకపోతే.. మ్యాచ్ నిలిచిపోయిన దగ్గరి నుంచి (స్కోర్లు) రిజర్వ్ డేలో ఆటను కొనసాగిస్తారు. అంతేకాకుండా ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల్లో ఫలితాన్ని తేల్చేందుకు రెండు గంటల ఎక్స్‌ట్రా టైమ్ కూడా ఉంటుంది.
ఫలితం తేలాలంటే
ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫలితం తేలాలంటే 20 ఓవర్ల నుంచి 15 ఓవర్ల లేదా 10 ఓవర్ల లేదా 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరపాల్సిందే. చివరకు అదీ సాధ్యం కాకపోతే రాత్రి. గం. 1.20 సమయంలో ‘సూపర్ ఓవర్’తోనైనా ఫలితాన్ని తేలుస్తారు.
అయితే దానికీ అవకాశం లేకపోతే మాత్రం లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. ఉదహరణకు క్వాలిఫియర్-1లో కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ జట్లు తలపడనున్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దు అయితే పాయింట్ల పట్టికలో ఉన్న కేకేఆర్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment