Rain affect
-
ఆదుకునేందుకు వాన వచ్చింది!
కంగారూ గడ్డపై భారత పేలవ బ్యాటింగ్ ప్రదర్శన మూడో టెస్టులోనూ కొనసాగింది. బౌలింగ్ వైఫల్యంతో ఆతిథ్య జట్టుకు భారీ స్కోరు చేసే అవకాశం కలి్పంచిన టీమిండియా తమ బ్యాటింగ్ వంతు వచ్చేసరికి చేతులెత్తేసింది. పది ఓవర్లలోపే పేలవ షాట్లతో యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి వెనుదిరగ్గా... కొద్ది సేపటికి రిషభ్ పంత్ వీరిని అనుసరించాడు. ఆసీస్ బౌలర్లు చెలరేగుతున్న తీరు చూస్తే మూడో రోజే మన ఆట ముగిసిపోతుందేమో అనిపించింది. అయితే ఉదయం నుంచి పదే పదే అంతరాయం కలిగించిన వర్షం చివర్లో మళ్లీ వచ్చి ఊరట అందించింది. నాలుగో రోజు మన బ్యాటర్లు ఆదుకొని జట్టును కాస్త మెరుగైన స్థితికి చేరుస్తారా... లేక ఆసీస్‌కు విజయావకాశం సృష్టిస్తారా చూడాలి. బ్రిస్బేన్: భారత్, ఆ్రస్టేలియా మధ్య మూడో టెస్టుకు మరోసారి వర్షం అడ్డుగా నిలిచింది. మ్యాచ్ మూడో రోజు సోమవారం కేవలం 33.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (64 బంతుల్లో 33 బ్యాటింగ్; 4 ఫోర్లు), కెప్టెన్ రోహిత్ శర్మ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 394 పరుగులు వెనుకబడి ఉంది. ఫాలోఆన్ నుంచి తప్పించుకోవాలంటే టీమిండియా మరో 195 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 405/7తో ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (88 బంతుల్లో 70; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా, జస్ప్రీత్ బుమ్రా (6/76) ఆరు వికెట్లతో ముగించాడు. మరో 40 పరుగులు... మూడో రోజు ఆసీస్ ఆటను కేరీ నడిపించాడు. జడేజా బౌలింగ్‌లో ఫోర్‌తో 53 బంతుల్లోనే అతను అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... మిచెల్ స్టార్క్ (30 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) కొద్దిసేపు అండగా నిలిచాడు. స్టార్క్‌ను వెనక్కి పంపించి బుమ్రా తన ఆరో వికెట్‌ను సొంతం చేసుకున్నాడు. 11 ఓవర్ల తర్వాత వాన రావడంతో కొద్దిసేపు ఆట నిలిచిపోయింది. మళ్లీ మొదలయ్యాక మరో 5.1 ఓవర్లలో ఆసీస్ చివరి 2 వికెట్లు కోల్పోయింది. లయన్ (2)ను సిరాజ్ బౌల్డ్ చేసిన మరో 4 బంతులకు కేరీ వికెట్ ఆకాశ్‌దీప్ ఖాతాలో చేరింది. సోమవారం మొత్తం 16.1 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 40 పరుగులు జత చేసింది. టపటపా... ఇన్నింగ్స్ తొలి బంతికే ఫోర్‌తో మొదలు పెట్టిన యశస్వి జైస్వాల్ (4)ను స్టార్క్ రెండో బంతికే పెవిలియన్ చేర్చగా, అతని తర్వాతి ఓవర్ తొలి బంతికే గిల్ (3 బంతుల్లో 1) కూడా అవుటయ్యాడు. గల్లీలో మిచెల్ మార్‡్ష అద్భుత రీతిలో గాల్లోకి ఎగిరి క్యాచ్‌ను అందుకోవడం విశేషం. విరాట్ కోహ్లి (16 బంతుల్లో 3) ఆఫ్‌స్టంప్ బలహీనతను మరోసారి సొమ్ము చేసుకుంటూ హాజల్‌వుడ్ చక్కటి బంతితో వెనక్కి పంపించాడు. కోహ్లి వికెట్ పడగానే వర్షం రావడంతో ఆట కాస్త ఆగింది. ఆట మళ్లీ మొదలయ్యాక రిషభ్ పంత్ (12 బంతుల్లో 9)ను అవుట్ చేసి కమిన్స్ మరో దెబ్బ కొట్టాడు. అనంతరం మరో 19 బంతులకే వాన రాకతో ఆట పూర్తిగా రద్దయింది. ఒకవైపు నాలుగు వికెట్లు పడినా... మరో ఎండ్‌లో రాహుల్ కొన్ని చక్కటి షాట్లతో పట్టుదలగా నిలబడ్డాడు. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) పంత్ (బి) బుమ్రా 21; మెక్‌స్వీనీ (సి) కోహ్లి (బి) బుమ్రా 9; లబుషేన్ (సి) కోహ్లి (బి) నితీశ్ రెడ్డి 12; స్మిత్ (సి) రోహిత్ (బి) బుమ్రా 101; హెడ్ (సి) పంత్ (బి) బుమ్రా 152; మార్‡్ష (సి) కోహ్లి (బి) బుమ్రా 5; కేరీ (సి) గిల్ (బి) ఆకాశ్‌దీప్ 70; కమిన్స్ (సి) పంత్ (బి) సిరాజ్ 20; స్టార్క్ (సి) పంత్ (బి) బుమ్రా 18; లయన్ (బి) సిరాజ్ 2; హాజల్‌వుడ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 35; మొత్తం (117.1 ఓవర్లలో ఆలౌట్) 445. వికెట్ల పతనం: 1–31, 2–38, 3–75, 4–316, 5–326, 6–327, 7–385, 8–423, 9–445, 10–445. బౌలింగ్: బుమ్రా 28–9–76–6, సిరాజ్ 23.2–5–97–2, ఆకాశ్‌దీప్ 29.5–5–95–1, నితీశ్ రెడ్డి 13–1–65–1, జడేజా 23–2–95–0. భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) మార్‡్ష (బి) స్టార్క్ 4; కేఎల్ రాహుల్ (బ్యాటింగ్) 33; గిల్ (సి) మార్‡్ష (బి) స్టార్క్ 1; కోహ్లి (సి) కేరీ (బి) హాజల్‌వుడ్ 3; పంత్ (సి) కేరీ (బి) కమిన్స్ 9; రోహిత్ (బ్యాటింగ్) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (17 ఓవర్లలో 4 వికెట్లకు) 51. వికెట్ల పతనం: 1–4, 2–6, 3–22, 4–44. బౌలింగ్: స్టార్క్ 8–1–25–2, హాజల్‌వుడ్ 5–2–17–1, కమిన్స్ 2–0–7–1, లయన్ 1–0–1–0, హెడ్ 1–0–1–0. -
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
-
ఇండియా, సౌతాఫ్రికా తొలి టీ20కి వర్షం ముప్పు..?
నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, సౌతాఫ్రికా జట్లు ఇవాళ (నవంబర్ 8) తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. డర్బన్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని యాక్యూవెదర్ పేర్కొంది. మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని సమాచారం. మ్యాచ్ ప్రారంభ సమయానికి 46 శాతం వర్షం పడే సూచనలు ఉన్నట్లు యాక్యూవెదర్ తెలిపింది. మ్యాచ్ జరిగే సమయంలో ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనున్నట్లు తెలుస్తుంది. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో వర్షం పడే అవకాశాలు 51 శాతానికి పెరుగుతాయని సమాచారం. ఇవాళ ఉదయం నుంచి డర్బన్‌లో ఆకాశం మేఘావృతమై ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే నేటి మ్యాచ్‌కు వర్షం అంతరాయాలు తప్పేలా లేవు.కాగా, భారత్-సౌతాఫ్రికా చివరి సారి టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడిన విషయం తెలిసిందే. నాటి ఫైనల్లో భారత్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది. పొట్టి ప్రపంచ కప్ అనంతరం భారత్ టీ20ల్లో తిరుగులేని జట్టుగా ఉంది. సూర్యకుమార్ నేతృత్వంలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. శ్రీలంకను వారి సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. తాజాగా బంగ్లాదేశ్‌ను సైతం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసింది. దక్షిణాఫ్రికా విషయానికొస్తే.. ప్రొటీస్ జట్టు పసికూన ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్ టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. జట్ల బలాబలాల ప్రకారం చూస్తే.. ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో స్టార్ హిట్లర్లు ఉన్నారు. దక్షిణాఫ్రికా జట్టులో క్లాసెన్, మిల్లర్, మార్క్రమ్ ఉండగా.. టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా లాంటి భారీ హిట్టర్లు ఉన్నారు. ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో ఈ సిరీస్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సిరీస్‌లో రాణించిన ఆటగాళ్లపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేసే అవకాశం ఉంది. కాబట్టి ఇరు జట్ల ఆటగాళ్లు పోటీపడి సత్తా చాటాలని భావిస్తారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు
-
#HeavyRains : తెలంగాణ అంతటా వర్ష బీభత్సం (ఫొటోలు)
-
తెలంగాణకు 'ఎల్లో అలర్ట్'..రెండ్రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు యాక్టివ్‌గా ఉండటం.. ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.ఈ క్రమంలోనే గురువారం నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, భూపాలపల్లి, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
T20 World Cup 2024: ఇలా జరిగితే ఫైనల్స్‌కు టీమిండియా..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా గయానా వేదికగా రేపు (భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) జరగాల్సిన భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు వరుణ గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్ జరిగే సమయానికి 88 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వెదర్ ఫోర్‌క్యాస్ట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే పరిస్థితి ఏంటి..?షెడ్యూల్ ప్రకారం భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే (ఒక్క బంతి కూడా పడకుండా) సూపర్-8 దశలో గ్రూప్ (గ్రూప్-1) టాపర్‌గా ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్ చేరుతుంది.ఒకవేళ భారత్-ఇంగ్లండ్ సెమీస్ మ్యాచ్‌కు వర్షం కారణంగా పాక్షికంగా అంతరాయం కలిగితే.. ఫలితం తేలేందుకు 250 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఇక్కడ కూడా ఫలితం తేలకపోతే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితాన్ని నిర్దారిస్తారు.తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్ డేమరోవైపు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ట్రినిడాడ్ వేదికగా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభంకావాల్సిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండటంతో వంద శాతం ఫలితం తేలే అవకాశం ఉంది. -
T20 World Cup 2024: టీమిండియాతో 'కీ' ఫైట్.. ఆసీస్ గుండెల్లో గుబులు
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 24) భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలక సమరం జరుగనుంది. సెయింట్ లూసియా వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభం కానుంది.అయితే ఈ మ్యాచ్‌కు వరుణ గండం పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. సెయింట్ లూసియాలో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఇవాళ కూడా వర్షం కొనసాగే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు వరుణుడు శాంతించినా మధ్యలో ఆటంకాలు తప్పవని సమాచారం.ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే భారత్‌కు ఎలాంటి నష్టం ఉండదు. 5 పాయింట్లతో టీమిండియా సెమీస్‌కు చేరుకుంటుంది. ఆసీస్ భవితవ్యం మాత్రం బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ భారత్‌తో మ్యాచ్ రద్దైతే ఆసీస్ ఖాతాలో 3 పాయింట్లు చేరతాయి.మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలో కూడా ప్రస్తుతం 2 పాయింట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు గెలిస్తే వారి ఖాతాలో 4 పాయింట్లు చేరతాయి. అప్పుడు ఆ జట్టే భారత్‌తో పాటు సెమీస్‌కు చేరుకుంటుంది. ఆసీస్ ఇంటిముఖం పట్టాల్సి ఉంటుంది. ఒకవేళ వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా రద్దైతే అప్పుడు మెరుగైన రన్ రేట్ ఉన్న కారణంగా ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడకుండా ఉండాలంటే నేటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. భారత్‌పై ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సి ఉంటుంది.ఇలా జరిగితే మాత్రం భారత్ ఇంటికే..ప్రస్తుతం భారత్ ఖాతాలో 4 పాయింట్లు ఉన్నా సెమీస్ బెర్త్ ఇంకా ఖరారు కాలేదు. ఒకవేళ భారతపై ఆ్రస్టేలియా 41 పరుగుల తేడాతో గెలిచి... అఫ్ఘనిస్తాన్ 81 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడిస్తే రన్‌రేట్‌లో వెనుకబడి టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇదిలా ఉంటే, గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆ జట్టు నిన్న యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గెలుపొంది దర్జాగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఆ గ్రూప్ నుంచి రెండో బెర్త్ కోసం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం ఆ ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. -
టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్..!?
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా తమ అఖరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం(జూన్ 15)న ఫ్లోరిడా వేదికగా కెనడాతో భారత్ తలపడనుంది. ఇప్పటికే సూపర్-8 బెర్త్‌ను ఖారారు చేసుకున్న టీమిండియా.. పసికూన కెనడాను సైతం చిత్తు చేసి ముందుకు వెళ్లాలని భావిస్తోంది.అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత అభిమానులకు ఓ బ్యాడ్‌న్యూస్. భారత్-కెనడా మ్యాచ్‌కు వర్షం ముంపు పొంచి ఉన్నట్లు వెదర్.కామ్ పేర్కొంది. మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం 50 శాతంగా ఉన్నట్లు వెదర్.కామ్ తెలిపింది. ఉరుములతో కూడా భారీ వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభించనుంది. కాగా లాడర్‌హిల్‌లో శుక్రవారం జరగాల్సిన అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. -
ఫ్లాష్ ఫ్లాష్ తెలంగాణ ఎలో అలెర్
-
IPL 2024 Playoffs: ప్లే ఆఫ్స్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే.. పరిస్థితి ఏంటి?
ఐపీఎల్-2024లో ప్లే ఆఫ్స్ సమరానికి రంగం సిద్దమైంది. మంగళవారం(మే 21)తో ప్లే ఆఫ్స్‌కు తెరలేవనుంది. పాయింట్స్ టేబుల్లో టాప్-4లో నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి.మే 21న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫియర్-1లో టాప్-2లో నిలిచిన కేకేఆర్, ఎస్ఆర్హెచ్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. అనంతరం మే 22న క్వాలిఫియర్-2లో రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. అయితే గత 8 లీగ్ మ్యాచ్‌ల్లో మూడు వర్షంతో రద్దయ్యాయి. ఆదివారం కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్ సైతం రద్దు అయింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగిస్తే ఏంటి పరిస్థితి అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.ప్లే ఆఫ్స్‌కు రిజర్వ్ డే..ఐపీఎల్-2024 సీజన్లో క్వాలిఫియర్-1, ఎలిమినేటర్, క్వాలిఫియర్-2 మ్యాచ్‌లతో పాటు ఫైనల్‌కు రిజర్వ్ డే కేటాయించారు. మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించి, ఆ రోజు ఆట సాధ్యపడకపోతే.. మ్యాచ్ నిలిచిపోయిన దగ్గరి నుంచి (స్కోర్లు) రిజర్వ్ డేలో ఆటను కొనసాగిస్తారు. అంతేకాకుండా ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల్లో ఫలితాన్ని తేల్చేందుకు రెండు గంటల ఎక్స్ట్రా టైమ్ కూడా ఉంటుంది. ఫలితం తేలాలంటేఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫలితం తేలాలంటే 20 ఓవర్ల నుంచి 15 ఓవర్ల లేదా 10 ఓవర్ల లేదా 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరపాల్సిందే. చివరకు అదీ సాధ్యం కాకపోతే రాత్రి. గం. 1.20 సమయంలో ‘సూపర్ ఓవర్’తోనైనా ఫలితాన్ని తేలుస్తారు. అయితే దానికీ అవకాశం లేకపోతే మాత్రం లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. ఉదహరణకు క్వాలిఫియర్-1లో కేకేఆర్, ఎస్ఆర్హెచ్ జట్లు తలపడనున్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దు అయితే పాయింట్ల పట్టికలో ఉన్న కేకేఆర్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తోంది. -
SRH vs GT: మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. హెచ్‌సీఏ కీలక ప్రకటన
ఐపీఎల్-2024లో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. భారీ వర్షం కారణంగా ఉప్పల్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. మైదానాన్ని సిద్ధం చేసే పనిలో గ్రౌండ్ స్టాప్ పడ్డారు.అయితే ఇంకా చిన్నపాటి జల్లు కురుస్తుండడంతో సెంట్రల్ పిచ్‌ను మాత్రం కవర్స్‌తో కప్పి ఉంచారు. దీంతో టాస్ ఆలస్యం కానుంది. ఇక ఈ మ్యాచ్ నిర్వహణపై హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు కీలక ప్రకటన చేశారు. వర్షం తగ్గినా ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మైదానాన్ని సిద్దం చేసుందుకు 100 మందికి పైగా గ్రౌండ్ స్టాప్ శ్రమిస్తున్నారని జగన్ మోహన్ రావు తెలిపారు. మ్యాచ్ నిర్వహణకు రాత్రి 10.30 వరకు సమయం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం వచ్చే నాలుగు రోజులూ..
-
Delhi: ఢిల్లీలో భారీ వర్షం..
ఢిల్లీ-ఎన్సీఆర్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈరోజు (శనివారం) ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్ సహా ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఎడతెగని వర్షం కురుస్తోంది. ఢిల్లీ-ఎన్సీఆర్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌లో మార్చి 2 న వర్షం, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. లక్నో, బిజ్నోర్, మీరట్, బరేలీ, రాంపూర్, రాయ్ బరేలీ, గోరఖ్‌పూర్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. బీహార్, జార్ఖండ్, రాజస్థాన్‌లలో జల్లులు కురిసే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తుంది. Nowcast-1 Fresh scattered thunderclouds are developing all over #Delhi & #Ncr and #Haryana region to bring on/off spells of light-mod rains with isol heavy burst w/ #hailstorm followed by gusty winds upto 20-50km/h in #Delhi,#Gurgaon,#Ghaziabad, #Noida in next 3 hrs#DelhiRains https://t.co/k1ykuNUpLy pic.twitter.com/zKKl3CkLcJ — IndiaMetSky Weather (@indiametsky) March 2, 2024 వాతావరణ శాఖ సూచనల ప్రకారం శనివారం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో వాతావరణం చల్లగా మారనుంది. మార్చి 2న పశ్చిమ హిమాలయ ప్రాంతంలో మెరుపులు, బలమైన గాలులతో పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానాలో గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మార్చి 2న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్‌లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. Temperature is going to drop today 🥶I just kept warm clothes in bed 🙄#Delhirains pic.twitter.com/K62B7dpJ1E — Kritika vaid (@KritikaVaid91) March 2, 2024 And it's raining here in Delhi.. #DelhiRains pic.twitter.com/RruuQbouRL — Ankit Sinha (@imasinha) March 2, 2024 -
భారత్-దక్షిణాఫ్రికా తొలి టీ20 వర్షార్పణం
►డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది. వర్షం ఎప్పటికి తగ్గుముఖం పట్టకపోవడంతో టాస్ పడకుండానే మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబర్ 12న సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరగనుంది. ►డర్బన్‌లో ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఇప్పటికే ఓవర్ల కుదింపు ప్రారంభమైంది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్‌కు సమయం అసన్నమైంది. డర్బన్‌లోని కింగ్స్‌మేడ్ మైదానంలో తొలి టీ20లో తాడోపేడో తెల్చుకోవడానికి ఇరు జట్లు సిద్దమయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న కింగ్స్‌మీడ్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం పడుతోంది. ప్రస్తుతం పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. దీంతో టాస్ కాస్త ఆలస్యం కానుంది. -
ఆస్ట్రేలియాతో రెండో టీ20.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!?
ఆస్ట్రేలియాతో తొలి టీ20లో గెలిచి మంచి ఊపుమీద ఉన్న టీమిండియా.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. నవంబర్ 26న తిరువనంతపురం వేదికగా జరగనున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా-భారత్ జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి తమ అధిక్యాన్ని పెంచుకోవాలని భారత్ భావిస్తుంటే.. మరోవైపు ఆసీస్ మాత్రం ఎలాగైనా విజయం సాధించి సిరీస్‌ను సమయం చేయాలని వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. మ్యాచ్ జరగనున్న తిరువనంతపురంలో గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్నాయి. మ్యాచ్ జరిగే ఆదివారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అక్యూవెదర్ రిపోర్ట్ ప్రకారం.. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం రావడానికి 55 శాతం కంటే ఎక్కువ ఆస్కారం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. తుది జట్లు(అంచనా) భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దుబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆడమ్ జంపా చదవండి: IND vs AUS: ఆసీస్‌తో రెండో టీ20.. తిలక్ వర్మకు నో ఛాన్స్! జట్టులోకి డేంజరస్ ఆటగాడు -
నేపాల్‌తో మ్యాచ్‌కూ వర్షం గండం.. రద్దయితే టీమిండియా పరిస్థితేంటి..?
ఆసియాకప్-2023లో టీమిండియా బోణీ కొట్టేందుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమవారం పల్లెకెలె వేదికగా పసికూన నేపాల్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సూపర్-4లో అడుగుపెట్టాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. అతడి స్ధానంలో మహ్మద్ షమీ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్ వర్షార్పణమైందన్న బాధలో ఉన్న అభిమానులకు మరోసారి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. భారత్-నేపాల్ మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో 80 శాతం వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు అక్కడ వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా ప్రస్తుతం పల్లెకెలె వర్షం పడుతోంది. పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఈ నేపథ్యంలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే పరిస్థితేంటి అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి? ప్రస్తుత పరిస్థితుల బట్టి భారత్- నేపాల్ మ్యాచ్ జరిగే అవకాశం కన్పించడం లేదు. టాస్ పడకుండా రద్దు అయ్యే సూచనలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఒక వేళ మ్యాచ్ రద్దు అయితే భారత్-నేపాల్ జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. దీంతో గ్రూపు-ఏ నుంచి టీమిండియా సూపర్-4కు అర్హత సాధిస్తుంది. ఎలా అంటే? గ్రూపు-ఏలో భారత్, పాకిస్తాన్, నేపాల్ జట్లు ఉన్నాయి. ఇప్పటికే ఈ గ్రూపు నుంచి పాకిస్తాన్(3 పాయింట్లు) సూపర్-4కు అర్హత సాధించింది. దీంతో మరో స్ధానం కోసం భారత్-నేపాల్ జట్లు పోటీపడతున్నాయి. అయితే ఇప్పటికే పాకిస్తాన్‌తో మ్యాచ్ రద్దు కావడంతో భారత్ ఖాతాలో ఒక్కపాయింట్ వచ్చి చేరింది. మరోవైపు పాక్ చేతిలో ఓడిపోవడంతో నేపాల్ ఖాతాలో ఎటువంటి పాయింట్లు లేదు. ఈ క్రమంలో నేపాల్‌తో మ్యాచ్ రద్దయినా భారత్‌కు ఒక్క పాయింట్ లభిస్తోంది. దీంతో 2 పాయింట్లతో భారత్ సూపర్-4కు చేరుకుంటుంది. ఇలా జరిగితే నేపాల్ ఇంటిముఖం పట్టకతప్పదు. చదవండి: Asia Cup 2023: కోహ్లి, రోహిత్‌లను అడ్డుకుంటాము.. భారత్‌కు పోటీ ఇస్తాం: నేపాల్ కెప్టెన్ -
IND vs PAK: అయ్యో ఇలా జరిగింది ఏంటి.. 26 ఏళ్ల తర్వాత! పాపం ఫ్యాన్స్
దాయాదుల పోరు కోసం ఏడాది నుంచి ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు వరుణడు ఆటంకం కలిగించాడు. ఆసియాకప్-2023లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. భారత ఇన్నింగ్స్ పూర్తి అయిన తర్వాత మొదలైన వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 266 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. టాపర్డర్ విఫలం కావడంతో 66 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లొతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో భారత్‌ను ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అదుకున్నారు. హార్దిక్ పాండ్యా(87), ఇషాన్ కిషన్(82) ఐదో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది (4/35) చెలరేగగా.. నసీమ్ షా, హారిస్ రవూఫ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. తొలి మ్యాచ్ నెగ్గిన పాకిస్తాన్ ఈ ఫలితంతో ‘సూపర్–4’ దశకు చేరగా, రేపు నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సూపర్–4 దశకు అర్హత సాధిస్తుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఇప్పటివరకు భారత్-పాక్ మధ్య ఎన్ని వన్డే మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యోయో ఓసారి తెలుసుకుందాం. ఎన్ని సార్లు అంటే? వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య 5 మ్యాచ్‌లు రద్దు అయ్యాయి. చివరగా 26 ఏళ్ల క్రితం భారత్-పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. 1997లో టొరంటోలో జరిగిన సహారా కప్‌లో ఈ రెండు జట్ల మధ్య వన్డే మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయింది. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య మొత్తం 133 మ్యాచ్‌లు జరిగాయి. 55 మ్యాచ్‌ల్లో భారత్, 73 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ గెలుపొందాయి. చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్ బౌలర్ ఓవరాక్షన్.. బుద్దిచెప్పిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్ -
బయట వర్షం.. బస్సులో గొడుగు పట్టిన డ్రైవర్!
సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందినదని తెలుస్తోంది. ఈ వీడియోలో స్టేట్ ట్రాన్స్పోర్ట్ (ఎస్టీ) బస్సు డ్రైవర్ ఒక చేతిలో గొడుగు పట్టుకుని మరో చేత్తో స్టీరింగ్ తిప్పుతూ, బస్సు నడపటం కనిపిస్తుంది. బస్సు టాప్ నుంచి నీరు కారుతున్నదని గ్రహించి, ఆ డ్రైవర్ ఇలా గొడుగు పట్టుకున్నాడు. అయితే ప్రభుత్వ బస్సులో ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఇదేమీ ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి వీడియోలు వైరల్ అయ్యాయి. As the roof of the ST bus was leaking, the driver had time to hold the umbrella in one hand and the steering wheel in one hand. A video from Aheri Agar in Gadchiroli has come to light. #gadchiroli #Maharashtra #viral #viralvideo pic.twitter.com/AfwVQMrnW5 — Zaitra (@Zaitra6) August 25, 2023 కాగా ఈ తాజా వీడియో సోషల్ మీడియా వేదికలన్నింటిలోనూ విపరీతంగా వైరల్ అవుతోంది. యూజర్లు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోలో డ్రైవర్ వర్షం పడుతున్న సమయంలో గొడుగు పట్టుకుని బస్సును నడపడాన్ని గమనించవచ్చు. ఈ వీడియో మహారాష్ట్ర రవాణా వ్యవస్థ స్థితిగతులను తేటతెల్లం చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో ఇలా చేయడం వల్ల డ్రైవర్ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: లక్షల్లో ఉద్యోగం వదిలేశాడు.. 200కెఫెలు.. రూ. 100 కోట్ల టర్నోవర్! -
ఐర్లాండ్‌తో రెండో టీ20.. టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్!
ఐర్లాండ్‌తో తొలి టీ20లో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. డబ్లిన్ వేదికగా ఆదివారం జరగనున్న రెండో టీ20లో ఐర్లాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. కాగా ఈ సిరీస్‌లో యువ భారత జట్టుకు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. బుమ్రా తన రీఎంట్రీ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ కూడా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇక తొలి టీ20కు అంతరాయం కలిగించిన వరుణుడు.. ఇప్పుడు రెండో టీ20కు కూడా అడ్డు తగిలే అవకాశం ఉంది. ఆదివారం మ్యాచ్ జరిగే సమయంలో 30-50 శాతం వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావారణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా వర్షం కారణంగా తొలి టీ20లో కేవలం 40 ఓవర్లకు 26.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్‌ను విజేతగా నిర్ణయించారు. తుది జట్లు(అంచనా) పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్,గ్రెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్ భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రవి బిష్ణోయ్ చదవండి: Asia Cup 2023: ఆసియాకప్‌కు భారత జట్టు ఇదే.. శాంసన్, అశ్విన్‌కు నో ఛాన్స్! తెలుగోడికి చోటు -
ఏపీ ప్రజలకు అలర్డ్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
-
దిక్కుమాలిన వర్షం.. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే పడాలా!
కరోనాతో రెండేళ్ల పాటు ఐపీఎల్ చాలా చప్పగా సాగింది. స్టేడియాల్లో ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో ఆటగాళ్లు కూడా కాస్త బోర్ ఫీలయ్యారు. అయితే ఐపీఎల్ 16వ సీజన్ ఆ సీన్‌ను మొత్తం రివర్స్ చేసేసింది. ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మంది వీక్షించిన సీజన్‌గా ఐపీఎల్ 2023 చరిత్రకెక్కనుంది. కారణం దాదాపు అన్ని మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగడం.. స్టేడియాల్లోకి పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతించడం.. ధోని లాంటి ఆటగాళ్ల కోసం ఈ సీజన్‌ను టీవీల్లోనూ చాలా మంది ఎంజాయ్ చేయడం కనిపించింది. అలా దాదాపు రెండు నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 16వ సీజన్‌కు నేటితో తెరపడనుంది. ఆదివారం(మే 28న) ఫైనల్లో సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. సీఎస్కే ఐదోసారి కప్పు కొడుతుందా లేక గుజరాత్ వరుసగా రెండోసారి టైటిల్‌ను నిలబెట్టుకుంటుందా అనేది పక్కనబెడితే మాకు మాత్రం ఫుల్ కిక్కు ఖాయం అని అభిమానులు భావించారు. కానీ అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు శనిలాగా తయారయ్యాడు. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించాలని మధ్యాహ్నం నుంచే స్టేడియం ముందు ప్రేక్షకులు బారులు తీరారు. అదే సమయంలో వరుణుడు కూడా తన ప్రతాపాన్ని చూపించాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో టాస్ కూడా ఆలస్యం అయింది. మ్యాచ్ సమయం గంట దాటినా వర్షం జోరు మాత్రం తగ్గడం లేదు. పూర్తి మ్యాచ్ కాకపోయినా కనీసం ఐదు ఓవర్ల ఆట అయినా సాధ్యపడుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉన్నప్పటికి సోమవారం కూడా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మ్యాచ్ జరగకుండానే టైటిల్ విజేతను ప్రకటిస్తారేమోనని అభిమానులు బాధపడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే లీగ్‌లో టాపర్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలుస్తుంది. అలా చూస్తే ఇది సీఎస్కేకు నష్టం మిగిల్చే అంశం. ధోనికి చివరి ఐపీఎల్ అని భావిస్తున్న వేళ వర్షం కారణంగా ఇలా జరిగితే మాత్రం సీఎస్కే అభిమానులకు మింగుడుపడని అంశమే. అయితే ఐపీఎల్ 16వ సీజన్లో ఏ మ్యాచ్‌కు అడ్డుపడని వరుణుడు ఫైనల్ మ్యాచ్‌కు ఇలా చేయడం ఏంటని అభిమానులు తెగ ఫీలవుతున్నారు. ఏదో కాసేపు పడి వర్షం ఆగిపోతుందనుకుంటే పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు. దిక్కుమాలిన వర్షం.. ఇన్ని రోజులు లేని వర్షం ఇప్పుడే పడాలా.. అంటూ అభిమానులు కామెంట్ చేశారు. Narendra Modi Stadium leaks rainwater from one side of the stadium and crowd had to leave that area. #CSKvsGT #rain #IPL2023Final pic.twitter.com/0MlxDDxH4g— Silly Context (@sillycontext) May 28, 2023 Rain stoppedToss at 9:10#CSKvGT #IPLFinals #IPL2023Final #Ahmedabad #rain #MSDhoni #Ahmedabad pic.twitter.com/YEyDQef1hm— proper thought. (@ThoughtProper) May 28, 2023 -
వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు వెళ్లేదెవరంటే?
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. వర్షం కారణంగా టాస్ కూడా కాస్త ఆలస్యం కానుంది. మరి ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు ఎవరు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఎలిమినేటర్ సహా రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లు షెడ్యూల్లో ఎలాంటి రిజర్వ్ డే కేటాయించలేదు. దీంతో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు వెళుతుంది. లీగ్ స్టేజీలో 20 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా గుజరాత్ నిలవగా.. ముంబై ఇండియన్స్ 16 పాయింట్లతో నాలుగో జట్టుగా ప్లేఆఫ్‌కు చేరుకుంది. ప్లేఆఫ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే రూల్ ప్రకారం లీగ్ స్టేజీలో ఏ జట్టు ఎక్కువ పాయింట్స్ సాధించి టేబుల్ టాపర్‌గా నిలుస్తుందో ఆ జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు వెళ్లే అవకాశముంది. అయితే ఇది లాస్ట్ ఆప్షన్ మాత్రమే. దానికంటే ముందు వర్షం అంతరాయం కలిగించినప్పటికి ఐదు ఓవర్ల మ్యాచ్‌కు అవకాశమిస్తారు. అదీ సాధ్యపడకపోతే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తాయి. ఒకవేళ భారీ వర్షం కారణంగా అది కూడా వీలు కాకపోతే ఇరుజట్లలో లీగ్ స్టేజీలో టాపర్‌గా నిలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్లనుంది. చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023.. లండన్‌లో కోహ్లి -
తేజ్‌నారాయణ్, బ్రాత్‌వైట్ అజేయ సెంచరీలు
వెస్టిండీస్, జింబాబ్వే జట్ల మధ్య తొలి టెస్టును వర్షం వెంటాడుతోంది. తొలి రోజు 51 ఓవర్ల ఆట సాధ్యమైతే... రెండో రోజు 38 ఓవర్లు మాత్రమే పడ్డాయి. బులవాయోలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు కూడా జింబాబ్వే బౌలర్లు వికెట్ తీయడంలో విఫలమయ్యారు. ఓవర్‌నైట్ స్కోరు 112/0తో ఆట కొనసాగించిన వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 221 పరుగులు సాధించింది. ఓవర్‌నైట్ ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (246 బంతుల్లో 116 బ్యాటింగ్; 7 ఫోర్లు)... తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ (291 బంతుల్లో 101 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలు పూర్తి చేసుకున్నారు. విండీస్ దిగ్గజ క్రికెటర్ శివనారాయణ్ చందర్‌పాల్ తనయుడైన తేజ్‌నారాయణ్ తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీ సాధించగా... క్రెయిగ్ బ్రాత్వైట్కిది 12వ శతకం. 1999లో న్యూజిలాండ్‌తో హామిల్టన్‌లో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ ఓపెనర్లు అడ్రియన్ గ్రిఫిత్ (114), షెర్విన్ క్యాంప్‌బెల్ (170) సెంచరీలు చేసిన తర్వాత... మళ్లీ విండీస్ ఓపెనర్లు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకాలు చేయడం విశేషం. -
IND VS NZ 3rd ODI: టీమిండియాకు షాకింగ్ న్యూస్
న్యూజిలాండ్‌తో మూడో వన్డేకు ముందు టీమిండియా అభిమానులకు షాకింగ్ న్యూస్ తెలిసింది. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే పార్క్ వేదికగా రేపు (నవంబర్ 30) జరుగబోయే మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ వెదర్ ఫోర్‌కాస్ట్‌లో పేర్కొంది. క్రైస్ట్‌చర్చ్‌లో రేపు ఉదయం నుంచే అకాశం మేఘావృతమై ఉంటుందని, మ్యాచ్ సమయానికి (భారతకాలమానం ప్రకారం ఉదయం 7 గంటకు) భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ ప్రెడిక్షన్‌లో వెల్లడించింది. ఈ వార్త తెలిసి భారత క్రికెటర్లు, అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ మ్యాచ్ సాధ్యపడకపోతే సిరీస్ కోల్పోవాల్సి వస్తుందని బాధ పడుతున్నారు. కనీసం 10 ఓవర్ల పాటైన మ్యాచ్ జరిగితే, సిరీస్ సమం చేసుకునే అవకాశం అయినా ఉంటుందని అనుకుంటున్నారు. కాగా, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ తొలి వన్డేలో విజయం సాధించగా (7 వికెట్ల తేడాతో).. రెండో వన్డే వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఇక మూడో వన్డే కూడా రద్దైతే న్యూజిలాండ్ 1-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే, వన్డే సిరీస్‌కు ముందు జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం మూడో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మధ్యలో జరిగిన రెండో మ్యాచ్‌లో గెలిచిన హార్ధిక్ సేన.. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. -
తొలి వన్డేకు వర్షం ముప్పు.. వరుణుడి కోసమే సిరీస్ పెట్టినట్లుంది
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న సిరీస్‌లో వరుణుడు శాంతించేలా కనిపించడం లేదు. తాజాగా నవంబర్ 25న(శుక్రవారం) ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరగనున్న తొలి వన్డేకు వరుణుడి ముప్పు పొంచి ఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది. గత కొన్ని రోజులుగా ఆక్లాండ్‌లో వర్షం కురుస్తున్నప్పటికి రెండు రోజులుగా చూసుకుంటే వాతావరణంలో కాస్త మార్పు కనపించింది. మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని పేర్కొంది. మ్యాచ్ సమయానికి 20 శాతం మాత్రమే వర్షం పడే చాన్స్ ఉందని.. గాలిలో 62 శాతం తేమ ఉంటుందని.. గంటకు 32 కి.మీ వేగంతో గాలి వీచే అవకాశం ఉండగా.. గరిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలు.. కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలుగా ఉంటుందని తెలిపింది. ఇప్పటికే ముగిసిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే పూర్తి స్థాయిలో జరిగింది. వర్షంతో తొలి టి20 ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కాగా.. రెండో టి20లో మాత్రం టీమిండియా 65 పరుగుల తేడాతో విజయం అందుకుంది. ఇక మూడో టి20లో కివీస్ ఇన్నింగ్స్ అనంతరం వరుణుడు అడ్డు తగలడం.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో మ్యాచ్ టై అయినట్లు ప్రకటించడంతో 1-0తో సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. అయితే టీమిండియా కివీస్ టూర్ఫై మాత్రం భారత అభిమానులు సంతృప్తిగా లేరు. అసలు టీమిండియా సిరీస్ ఆడడానికి వెళ్లినట్లుగా అనిపించడం లేదని వాపోయారు. టి20, వన్డే సిరీస్‌లు టీమిండియా, కివీస్‌లు ఆడేందుకు కాకుండా వరుణుడి కోసమే ఏర్పాటు చేసినట్లుగా అనిపిస్తుందని కామెంట్స్ చేశారు. ఇక టి20లకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేపట్టగా.. వన్డేలకు మాత్రం శిఖర్ ధావన్ తిరిగి నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. ఇప్పటికే రోహిత్ గైర్హాజరీలో పలుసార్లు జట్టును నడపించిన ధావన్ ప్రతీసారి సక్సెస్ అవడమే గాక బ్యాట్స్‌మన్‌గానూ సత్తా చాటుతున్నాడు. ఇక కివీస్‌తో వన్డే సిరీస్‌ను కూడా నెగ్గి రానున్న వన్డే వరల్డ్‌కప్‌లో తన స్థానం మరింత సుస్థిరం చేసుకోవాలని ధావన్ చూస్తున్నాడు. Smiles, friendly banter & the trophy 🏆 unveil! #TeamIndia | #NZvIND pic.twitter.com/3R2zh0znZ3 — BCCI (@BCCI) November 24, 2022 చదవండి: చాలా ఊహించుకున్నా.. హార్ధిక్ రీ ఎంట్రీతో ఆశలన్నీ అడియాశలయ్యాయి..! -
బీ అలర్ట్.. కళ్లు మూసి తెరిచేలోగా కొట్టుకుపోయారు
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు, అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా కొందరు సముద్రాలు, నదుల వద్ద ఎంజాయ్ చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అలాంటి ప్రదేశాల్లో ఉండటం ఎంత ప్రమాదకరమో ఈ వీడియోనే చెబుతోంది. ఐపీఎస్ అధికారిణి షిఖా గోయెల్ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. వీడియోలో కొందరు సముద్రం ఒడ్డున అలలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఓ పెద్ద కెరటం వచ్చి అక్కడున్న వారిని సముద్రంలోకి లాకెళ్లింది. అప్పుడు వారిని ఎవరూ కాపాడలేకపోయారు. కాగా, ఈ వీడియోకు షిఖా గోయెల్.. ‘‘జాగ్రత్తగా ఉండటం కంటే ధైర్యంగా తప్పు చేయడం మంచిది . గొప్ప పశ్చాత్తాపం కంటే కొంచెం జాగ్రత్త మంచిది. ముఖ్యంగా ఇప్పుడు, తీవ్రమైన వర్షపాతం హెచ్చరికల దృష్ట్యా దయచేసి జాగ్రత్తగా ఉండండి’’ అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే, ఈ ఘటన ఒమాన్ దేశంలో చోటుచేసుకుంది. సలాలహ్ హల్ ముగుసెల్ బీచ్‌లో 8 మంది భారతీయులు.. కెరటాల్లో కొట్టుకుపోగా.. ముగ్గురిని రక్షించారు. మరో ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపారు. అయితే, వారంతా సెఫ్టీ ఫెన్నింగ్ దాటిన కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. Its better to err on the side of daring than the side of caution ...... A little caution is better than a great regret Please be cautious especially now, in view of severe rainfall alert pic.twitter.com/Lo6ga6o0t4— Shikha Goel, IPS (@Shikhagoel_IPS) July 12, 2022 -
రెండో టీ20కి వరుణుడి ఆటంకం.. 50% వర్షం పడే ఛాన్స్..!
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఓటమి చెందిన టీమిండియా బదులు తీర్చుకోవడానికి సిద్దమైంది. ఆదివారం కటక్ వేదికగా జరగనున్న రెండో టీ20లో దక్షిణాఫ్రికా, భారత్ జట్లు తలపడపనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత్ భావిస్తోంది. దాదాపు రెండు ఏళ్ల తర్వాత కటక్‌లో అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆదివారం ఓ మోస్తారు జల్లులు పడే అవకాశం ఉన్నట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. "ఆదివారం సాయంత్రం కటక్‌లో వర్షం పడదని మేము ఖచ్చితంగా చెప్పలేము. తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే భారీ వర్షం పడే ఛాన్స్ లేదు" అని భువనేశ్వర్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్ బిశ్వాస్ పేర్కొన్నారు. ఒక వేళ వర్షం పడినా.. మ్యాచ్‌కు భారీ అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఒడిశా క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు వెల్లడించారు. టీమిండియా తుది జట్టు(అంచనా) : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (సి), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్ చదవండి: భారత్‌కు మరో సవాల్ -
రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు
-
రెండో రోజు ఆట వర్షార్పణం... భారత్‌కు గెలుపు దక్కేనా!
సెంచూరియన్: తొలి రోజు చక్కటి ప్రదర్శనతో దక్షిణాఫ్రికా సిరీస్‌లో శుభారంభం చేసిన భారత్‌కు రెండో రోజే ప్రతికూలత ఎదురైంది. వరుణుడి కారణంగా అదే జోరును కొనసాగించే అవకాశం లేకుండా పోయింది. వర్షం కారణంగా తొలి టెస్టు సోమవారం ఆట పూర్తిగా రద్దయింది. నగరంలో ఆదివారం రాత్రి నుంచే కురుస్తున్న వాన సోమవా రం కూడా కొనసాగడంతో క్రికెట్ సాధ్యం కాలేదు. మధ్యలో రెండుసార్లు వర్షం తగ్గడంతో అంపైర్లు మైదానాన్ని పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. అయితే అదే సమయంలో మళ్లీ వర్షం రావడంతో చేసేదేమీ లేకపోయింది. ఫలితంగా ఒక్క బంతి కూడా వేయకుండానే స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:55కు అంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 90 ఓవర్లలో 3 వికెట్లకు 272 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (248 బంతుల్లో 122 బ్యాటింగ్; 17 ఫోర్లు, 1 సిక్స్), అజింక్య రహానే (81 బంతుల్లో 40 బ్యాటింగ్; 8 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. గెలుపు దక్కేనా! వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఈ టెస్టు మూడు, నాలుగు రోజుల్లో ఎలాంటి వర్ష సూచన లేదు. ఆట పూర్తి స్ధాయిలో సజావుగా సాగే అవకాశం ఉంది. అయితే చివరి రోజైన గురువారం కూడా వాన పడే అవకాశం ఉందని నిపుణులు చెబు తున్నారు. అదే జరిగితే నాలుగు ఇన్నింగ్స్‌ల ఆట సాగడం దాదాపు అసాధ్యమే. పైగా ఇప్పటి వరకు స్పందిస్తున్న తీరు చూస్తే పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా ఉంది. ఒక్కసారిగా వికెట్లు కుప్పకూలిపోయే పరిస్థితి కూడా కనిపించడం లేదు. టీమిండియాకు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే ఆట సాగితే కచ్చితంగా మనదే పైచేయి అయి ఉండేది. సఫారీ గడ్డపై తొలిసారి సిరీస్ గెలవాలని కోరు కుంటున్న భారత్‌కు వర్షం వల్ల మ్యాచ్‌లో ఆశించిన ఫలితం రాకపోతే మాత్రం తీవ్ర నిరాశ తప్పదు. ఒలీవియర్ అందుకే ఆడలేదు! భారత్‌తో తొలి రోజు ఒక్క ఇన్‌గిడి మినహా దక్షిణాఫ్రికా బౌలర్లంతా పేలవ ప్రదర్శన కనబర్చారు. సీనియర్ రబడ పూర్తిగా విఫలం కాగా, కొత్త బౌలర్ మార్కో తేలిపోయాడు. గాయంతో నోర్జే సిరీస్‌కు దూరం కావడంతో అతని స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్, దేశవాళీలో అద్భుత ఫామ్‌లో ఉన్న డ్యువాన్ ఒలీవియర్ టెస్టులో కచ్చితంగా ఆడతారని అంతా భావించారు. అయితే అతడిని టెస్టుకు ఎంపిక చేయకపోవడంతో దక్షిణా ఫ్రికా సెలక్టర్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో సోమవారం క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) వివరణ ఇచ్చింది. ‘కొన్నాళ్ల క్రితం ఒలీవియర్ కోవిడ్–19 బారినపడ్డారు. కరోనా ప్రభావపు తదనంతర సమస్యల నుంచి అతను పూర్తిగా కోలుకోలేదు. క్వారంటైన్ కారణంగా సరిగా ప్రాక్టీస్ సాగకపోగా, క్యాంప్ ఆరంభంలోనే తొడ కండరాల గాయంతోనూ బాధ పడ్డాడు. అందుకే అతనికి బదులుగా మార్కోకు అవకాశమిచ్చాం’ అని సెలక్షన్ కమిటీ కన్వీనర్ విక్టర్ పిట్సంగ్ వెల్లడించారు. చదవండి: ఇదేమి బౌలింగ్రా బాబు.. 4 ఓవర్లలో 70 పరుగులు! -
జడేజా చక్కటి ఇన్నింగ్స్.. భారత్‌కు ఆధిక్యం
నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 84.5 ఓవర్లలో 278 పరుగుల వద్ద ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు 95 పరుగుల ఆధిక్యం లభించింది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (214 బంతుల్లో 84; 12 ఫోర్లు) తొలి సెషన్లో నిలబడగా... తర్వాత రవీంద్ర జడేజా (86 బంతుల్లో 56; 8 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ 5 వికెట్లు పడగొట్టగా, అండర్సన్‌కు 4 వికెట్లు లభించాయి. అయితే వాన మ్యాచ్‌కు పదేపదే అంతరాయం కలిగించడంతో మూడో రోజు కూడా 49.2 ఓవర్ల ఆటే సాధ్యమైంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ 11.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. ఓపెనర్లు రోరీ బర్న్స్ (11 బ్యాటింగ్), డామ్ సిబ్లీ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జడేజా ఫిఫ్టీ... ఓవర్‌నైట్ స్కోరు 125/4 శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ రెండు ఓవర్లు ఆడిందో లేదో వర్షం తరుముకొచ్చింది. మళ్లీ ఆట మొదలవగా... ఓపెనర్ రాహుల్ ఇంగ్లండ్ బౌలర్లను చక్కగా ఎదుర్కొన్నాడు. టెస్టుల్లో వన్డే ఇన్నింగ్స్ ఆడిన ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ (20 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్)ను రాబిన్సన్ ఔట్ చేశాడు. జడేజా క్రీజులోకి రాగా 191/5 స్కోరు వద్ద భారత్ లంచ్‌కు వెళ్లింది. అనంతరం ఆట మొదలైన కొద్దిసేపటి తర్వాత సెంచరీ చేస్తాడనుకున్న రాహుల్ నిష్క్రమించాడు. ఈ దశలో జడేజా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అర్ధసెంచరీ పూర్తయ్యాక జడేజా కూడా వికెట్‌ను పారేసుకోగా... టెయిలెండర్లలో బుమ్రా (34 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) కుదురుగా ఆడాడు. దీంతో భారత్‌కు చెప్పుకోదగ్గ ఆధిక్యం లభించింది. Sir Ravindra Jadeja celebrating in his own style! Well played #Jadeja!👏👏👏👏 Come on #TeamIndia get us some wickets!#ENGvIND #ENGvsIND #IndvsEng #INDvENG #Cricketpic.twitter.com/9gRy7JlPjP — BlueCap 🇮🇳 (@IndianzCricket) August 6, 2021 కుంబ్లేను అధిగమించిన అండర్సన్ ఇంగ్లండ్ సీనియర్ సీమర్ జేమ్స్ అండర్సన్ భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే వికెట్ల మైలురాయి (619)ని అధిగమించాడు. గురువారం కోహ్లి (0)ని ఔట్ చేయడం ద్వారా 619 వికెట్లతో కుంబ్లే సరసన నిలిచిన ఇంగ్లండ్ వెటరన్ పేసర్ శుక్రవారం ఓపెనర్ కె.ఎల్.రాహుల్ (84) వికెట్‌తో కుంబ్లేను దాటేశాడు. ఇప్పుడు టెస్టుల్లో మురళీధరన్ (శ్రీలంక; 800), షేన్‌వార్న్ (ఆసీస్; 708), తర్వాత స్థానం అండర్సన్‌దే. అతని ఖాతాలో 621 వికెట్లున్నాయి. కుంబ్లే (619) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ టాప్–4 అండర్సన్ మినహా ముగ్గురు ఎప్పుడో రిటైరయ్యారు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 183; భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) స్యామ్ కరన్ (బి) రాబిన్సన్ 36; రాహుల్ (సి) బట్లర్ (బి) అండర్సన్ 84; పుజారా (సి) బట్లర్ (బి) అండర్సన్ 4; కోహ్లి (సి) బట్లర్ (బి) అండర్సన్ 0; రహానే (రనౌట్) 5; పంత్ (సి) బెయిర్‌స్టో (బి) రాబిన్సన్ 25; జడేజా (సి) బ్రాడ్ (బి) రాబిన్సన్ 56; శార్దుల్ (సి) రూట్ (బి) అండర్సన్ 0; షమీ (బి) రాబిన్సన్ 13; బుమ్రా (సి) బ్రాడ్ (బి) రాబిన్సన్ 28; సిరాజ్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (84.5 ఓవర్లలో ఆలౌట్) 278. వికెట్ల పతనం: 1–97, 2–104, 3–104, 4–112, 5–145, 6–205, 7–205, 8–232, 9–245, 10–278. బౌలింగ్: అండర్సన్ 23–8–54–4, బ్రాడ్ 20–3–70–0, రాబిన్సన్ 26.5–6–85–5, స్యామ్ కరన్ 15–2–57–0. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్ (బ్యాటింగ్) 11; సిబ్లీ (బ్యాటింగ్) 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (11.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 25. బౌలింగ్: బుమ్రా 3–0–6–0, సిరాజ్ 5.1–2–10–0, షమీ 3–1–9–0. -
మ్యాచ్ పోయింది... క్యాచ్ అదిరింది!
నార్తాంప్టన్: వర్షం ఆటంకం కలిగించిన తొలి టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 18 పరుగుల తేడాతో భారత మహిళలపై గెలిచింది. మొదట ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 177 పరుగులు చేసింది. సీవర్ (27 బంతుల్లో 55; 8 ఫోర్లు, 1 సిక్స్), అమీ జోన్స్ (27 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. శిఖా పాండేకు 3 వికెట్లు దక్కాయి. తర్వాత కూడా వర్షం దోబూచులాడటంతో ఆట సరిగ్గా సాగనేలేదు. లక్ష్యఛేదనలో భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లకు 54 పరుగులు చేసింది. షఫాలీ (0) డకౌట్ కాగా, స్మృతి మంధాన (29; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. హర్లీన్ (17 నాటౌట్), దీప్తి శర్మ (3 నాటౌట్) క్రీజులో ఉండగా మళ్లీ వర్షం వచ్చింది. ఎంతకీ తగ్గకపోవడంతో ఆటను ఆపేసి డక్‌వర్త్ పద్ధతిలో ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటిం చారు. ఆటను నిలిపివేసే సమయానికి డక్‌వర్త్ పద్ధతిలో భారత్ గెలవాలంటే స్కోరు 73గా ఉండాల్సింది. సూపర్... సూపర్...ఉమన్ హర్లీన్ అబ్బాయిల క్రికెట్ ఎక్కడ... అమ్మాయిల క్రికెట్ ఎక్కడ! వారి మెరుపులు చుక్కలు... మరి వీరి మెరుపులు మామూలు సిక్సర్లు! అంటే సరిపోతుందేమో కానీ... పురుషుల ఫిట్నెస్ భళా అతివల ఫిట్నెస్ డీలా అంటే కుదరదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ మనమ్మాయే... పేరు హర్లీన్ డియోల్. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఈమె తొలి టి20లో అసాధారణ క్యాచ్ పట్టింది. బహుశా మహిళల క్రికెట్లో ఇలాంటి క్యాచ్ ఇదే మొదటిది. అందుకనే ప్రత్యర్థి ఇంగ్లండ్ శిబిరం కూడా ఆమె క్యాచ్‌కు చప్పట్లు కొట్టింది. ఆనంద్ మహీంద్రాలాంటి వ్యాపార దిగ్గజాలు సైతం ఔరా అన్నారంటే అర్థం చేసుకోండి. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో శిఖా పాండే 19వ ఓవర్ వేసింది. ఐదో బంతిని అమీ జోన్స్ భారీ షాట్ ఆడింది. బౌండరీ లైన్‌కు తాకెంత దగ్గర్లో హర్లీన్ గాల్లోకి ఎగిరి బంతిని అందుకుంది. బౌండరీ అవతల పడిపోతానని తెలిసిన ఆమె బంతిని గాల్లో వదిలి లైన్ దాటింది. మళ్లీ అక్కడ్నుంచి బంతి నేలను తాకేలోపే మైదానంలోకి డైవ్ చేసి అద్భుతంగా క్యాచ్ అందుకుంది. -
WTC Final Day 5: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా..గిల్(8) ఔట్
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా..గిల్(8) ఔట్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(8)ను సౌథీ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు. దీంతో టీమిండియా 24 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతానికి భారత్ ఇంకా 8 పరుగులు వెనుకపడి ఉంది. ఐదో రోజు ఇంకా 29 ఓవర్ల ఆట మిగిలి ఉంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా న్యూజిలాండ్‌ను 249 పరుగులకు కట్టడి చేసిన టీమిండియా అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(5), శభ్‌మన్ గిల్(2) ఆచితూచి ఆడుతున్నారు. దీంతో 5 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 7 పరుగులు స్కోర్ చేసింది. ప్రస్తుతానికి భారత్ ఇంకా 25 పరుగులు వెనుకపడి ఉంది. ఐదో రోజు ఇంకా 35 ఓవర్ల ఆట మిగిలి ఉంది. న్యూజిలాండ్ 249 ఆలౌట్.. 32 పరుగుల స్వల్ప ఆధిక్యం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. సౌథీని(30) జడేజా క్లీన్ బౌల్డ్ చేయడంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో ఆ జట్టుకు 32 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో షమీ 4, ఇషాంత్ 3, అశ్విన్ 2,జడేజా ఓ వికెట్ పడగొట్టారు. కాగా, అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఐదో రోజు ఆటలో మరో 40.4 ఓవర్లకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. వాగ్నర్ డకౌట్.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన కివీస్ కివీస్ టెయింలెండర్ నీల్ వాగ్నర్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. అశ్విన్ బౌలింగ్‌లో రహానే స్లిప్‌లో అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో వాగ్నర్ సున్నా పరుగలుకే ఔటయ్యాడు. దీంతో 234 పరుగుల వద్ద కివీస్ తొమ్మిదో వికెట్‌ను కోల్పోయింది. న్యూజిలాండ్ ప్రస్తుతం 17 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్‌లో సౌథీ(23), బౌల్ట్(0) ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 4, ఇషాంత్ 3, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదో రోజు ఆటలో ఇంకా 43 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఎనిమిదో వికెట్ కోల్పోయిన కివీస్.. డేంజరెస్ విలియమ్సన్(49) ఔట్ టీమిండియా పాలిట కొరకరాని కొయ్యలా మారిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(49)ను.. భారత పేసర్ ఇషాంత్ శర్మ ఎట్టకేలకు దొరకబుచ్చుకున్నాడు. అర్ధసెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఉండగా థర్డ్ మెన్ దిశగా షాట్ ఆడబోయి టీమిండియా కెప్టెన్ కోహ్లీకి చేతికి చిక్కాడు. దీంతో న్యూజిలాండ్ 221 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్‌లో టిమ్ సౌథీ(10), నీల్ వాగ్నర్(0) ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 4 పరుగుల తొలి ఇన్నింగ్స్‌తో కొనసాగుతుంది. టీమిండియా బౌలర్లలో షమీ 4, ఇషాంత్ 3, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు. షమీ ఆన్ ఫైర్.. ఏడో వికెట్ కోల్పోయిన కివీస్ సౌథాంప్టన్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మరోసారి చెలరేగుతున్నాడు. 2019 వన్డే ప్రపంచ కప్‌లో ఇదే వేదికగా ఆఫ్ఘనిస్తాన్పై హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన ఆయన.. సరిగ్గా రెండేళ్ల తర్వాత(జూన్ 22) మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. నాడు పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పరాభవం నుంచి కాపాడిన లాలా.. నేడు కివీస్‌పై భారత ఆధిపత్యం దిశగా తీసుకెళుక్తన్నాడు. ఐదో రోజు ఆటలో నాలుగు వికెట్లు(4/55) పడగొట్టి తన ప్రతాపం చూపుతున్న షమీ.. ప్రమాదకరంగా మారుతున్న జేమీసన్(16 బంతుల్లో 21; సిక్స్) పెవిలియన్‌కు పంపి కివీస్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. ప్రస్తుతం క్రీజ్‌లో విలియమ్సన్(37), సౌథీ(0) ఉన్నారు. 87 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ ఏడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. కివీస్ ప్రస్తుతానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే ఇంకా 25 పరుగులు వెనుకపడి ఉంది. ఆరో వికెట్ కోల్పోయిన కివీస్..గ్రాండ్‌హోమ్(13) ఔట్ ఐదో రోజు ఆటలో పేసర్ షమీ కివీస్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. తొలి సెషన్లో టేలర్(11), వాట్లింగ్(1) వికెట్లు పడగొట్టిన షమీ.. లంచ్ తర్వాత గ్రాండ్‌హోమ్(13) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు. దీంతో కివీస్ 162 పరుగలుకే 6 వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో విలియమ్సన్(28), కైల్ జేమీసన్ ఉన్నారు. ప్రస్తుతం కివీస్ భారత్ కంటే 55 పరుగులు వెనుకపడి ఉంది. భారత బౌలర్లలో షమీ 3, ఇషాంత్ 2, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు. సౌథాంప్టన్: వర్షం కారణంగా గంట ఆలస్యంగా ప్రారంభమైన ఐదో రోజు ఆటలో టీమిండియా పేసర్లు ఇరగదీస్తున్నారు. మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే సీనియర్ ఆటగాడు రాస్ టేలర్(11)ను షమీ బోల్తా కొట్టించగా, 70వ ఓవర్లో హెన్రీ నికోల్స్(7)ను ఇషాంత్ పెవిలియన్‌కు సాగనంపాడు. ఆమరుసటి ఓవర్లోనే షమీ కివీస్‌కు మరోషాకిచ్చాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వాట్లింగ్(1)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో 135 పరుగులకే కివీస్ సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్(217)కు చేరుకోవాలంటే కివీస్ ఇంకా 82 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం కేన్ విలియమ్సన్(19), గ్రాండ్‌హోమ్(0) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ 2, షమీ 2, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, వర్షం అంతరాయం లేకుండా మ్యాచ్ సజావుగా సాగితే, ఫలితం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు. నేడు, రేపు(రిజర్వ్ డే) కలుపుకుని మరో 150 ఓవర్ల ఆట సాధ్యపడితే తప్పక ఫలితాన్ని ఆశించవచ్చన్నది వారి అభిప్రాయం. కాగా, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ వరుణుడి ఆటంకం కారణంగా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. వర్షం కారణంగా తొలి రోజు, నాలుగో రోజు ఆట పూర్తిగా రద్దు కాగా, ఐదో రోజు ఆటపై కూడా సందేహాలు నెలకొని ఉన్న సమయంలో. వరుణుడు శాంతించడంతో ఐదో రోజు ఆట మొదలైంది. మంగళవారం కురిసిన వర్షం కారణంగా మ్యాచ్ సుమారు గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఐదో రోజు ఆటలో 98 ఓవర్ల వేయాల్సి ఉండగా, వరుణుడి అంతరాయం కారణంగా 7 ఓవర్లు కోత విధించారు. దీంతో ఈ రోజు మొత్తం 91 ఓవర్ల మ్యాచ్ జరగాల్సి ఉంది. చదవండి: విజేతను చూడలేం..రిజర్వ్ డే కలుపుకున్నా కష్టమే! -
విజేతను చూడలేం..రిజర్వ్ డే కలుపుకున్నా కష్టమే!
ఈ వానను ఆపలేం. ఒక విజేతను చూడలేం. ఫైనల్ ఆడుతున్న భారత్, న్యూజిలాండ్ జట్లు ఇక ప్రపంచ టెస్టు చాంపియన్లే! ఒక రోజే ఆట మిగిలున్నా... ఇంకో రోజు (రిజర్వ్ డే) కలుపుకున్నా... మొత్తం 196 ఓవర్లు పూర్తిగా వేసినా... మిగతా మూడు ఇన్నింగ్స్‌లు పూర్తి అయ్యే అవకాశాలు తక్కువే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ‘డ్రా’ తప్ప ఇంకో ఫలితం వచ్చేలా కనిపించడంలేదు. సౌతాంప్టన్: ఒక జట్టు ఓడే పరిస్థితి లేదు. మరో జట్టు గెలిచేందుకు అవకాశం కనిపించడంలేదు. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఫలితం వచ్చేలా లేదు. ఎందుకంటే నాలుగు రోజుల ఆటలో రెండు రోజుల్ని పూర్తిగా వర్షం తుడిచేసింది. ఇరు జట్లలో ఒక జట్టయితే ఇంకా తొలి ఇన్నింగ్స్నే పూర్తిగా ఆడలేదు. రెండేళ్లుగా ఉత్సాహంగా 9 జట్ల మధ్య జరిగిన డబ్ల్యూటీసీ చివరకు వాన చేతిలో ఓడేలా కనిపిస్తోంది. ప్రతిష్టాత్మక ఈ ఫైనల్‌కు తొలుత వర్షమే ‘వెల్కమ్’ చెప్పింది. తొలిరోజు ఆటకు ‘నో’అంది. రెండో రోజు ఆట మొదలైనా... చాలాసేపు వెలుతురు కమ్మేసింది. ఎట్టకేలకు మూడో రోజు బంతికి, బ్యాట్‌కు సమాన అవకాశం వచ్చింది. మొత్తానికి ఆట రక్తికట్టించింది. నాలుగో రోజుపై ఆశలు రేకెత్తించింది. తీరా సోమవారం పొద్దుపొడిచేసరికి సూరీడుని పక్కకు తప్పించిన వాన... చినుకులతో మైదానాన్ని తడిపేసింది. ఇక ఆటగాళ్లు ఆడాల్సిందిపోయి... ప్రేక్షకుల్లా డ్రెస్సింగ్ రూమ్ నుంచే వానజల్లును తిలకించారు. ఇక అంపైర్లు చేసేందుకు ఏమీ లేక నాలుగో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగు గంటల పాటు వేచిచూసిన ఫీల్డు అంపైర్లు వర్షం తెరిపినివ్వకపోవడంతో రద్దు నిర్ణయం తీసుకున్నారు. వాన ఆగదా... ఆట చూడమా... అంటూ అప్పటిదాకా గొడుగులు పట్టుకొని నిరీక్షించిన ప్రేక్షకులు నిరాశతో వెనుదిరిగారు. ఇక్కడా నిర్వహించేది! అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వాకంపై పలువురు మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌ను ఇంగ్లండ్‌లో నిర్వహించడమేంటని దుమ్మెత్తిపోస్తున్నారు. చిత్రంగా ఇంగ్లండ్‌కు చెందిన మాజీ ఆటగాడే ఇలాంటి వ్యాఖ్య చేయడం గమనార్హం. మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ ‘నాకు చాలా బాధనిపిస్తుంది. అత్యంత ప్రాధాన్యమున్న ఫైనల్స్‌ను ఇంగ్లండ్‌లాంటి వేదికలపై నిర్వహించడం ఎంతమాత్రం సమంజసం కాదు. యూఏఈలాంటి వేదికను ఎంచుకుని వుంటే బాగుండేది’ అని అన్నాడు. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఐసీసీ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. -
WTC Final: తొలి రోజు వర్షార్పణం.. మిగతా రోజులు కూడా డౌటే..?
సౌథాంప్టన్: కనీసం టాస్ కుడా పడకుండానే భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తొలి రోజు ఆట రద్దైంది. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో టీ విరామం అనంతరం రిఫరీ తొలి రోజు ఆటను రద్దు చేస్తుననట్లు ప్రకటించాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వరుణుడు కాస్త కరుణించినట్లు కనిపించినా, ఆతర్వాత మళ్లీ జల్లులు మొదలుకావడంతో తొలి రోజు ఆటను పూర్తిగా రద్దు చేశారు. మైదానమంతా వర్షం నీరుతో నిండు కుండలా మారిపోయింది. దీంతో రేపటి ఆట సాధ్యాసాధ్యాలపై కూడా అనుమానం నెలకొంది. మరోవైపు సౌథాంప్టన్‌లో వచ్చే ఆరు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని బ్రిటన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో వెదర్ వార్నింగ్‌ను జారీ చేసింది. ఎల్లో వెదర్ వార్నింగ్ అంటే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవడం అని అర్ధం. ఈ మ్యాచ్ జరిగాల్సినన్ని రోజులు ఓ మోస్తరు నుంచి భారీ, అతిభారీ వర్షాలు కురుస్తాయని బీఎండీ పేర్కొంది. ప్రస్తుతం అక్కడ 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడంతో పాటు.. చిరుజల్లులు పడుతున్నాయని తెలిపింది. ఇదిలా ఉంటే, నిన్నటి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఏజియస్ బౌల్ స్టేడియం మొత్తం చిత్తడిగా మారింది. పిచ్ డ్యామేజ్ కాకుండా గ్రౌండ్ స్టాఫ్ దాన్ని కవర్లతో కప్పి ఉంచారు. వర్షం పూర్తిగా ఎడతెరిపినిస్తే కానీ, గ్రౌండ్లో కి ఎంటర్ కాలేని పరిస్థితి. కాగా, ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉన్నప్పటికీ.. మరో వారం రోజుల పాటు వర్షాలు కురువనున్న నేపథ్యంలో ఏ రోజు ఎన్ని ఓవర్ల ఆట సాధ్యమయ్యే అవకాశం ఉందన్న విషయాన్ని విశ్లేషకులు పరిశీలిస్తున్నారు. చదవండి: కోహ్లీ మాటతప్పాడు.. సిరాజ్ అభిమానుల ఆగ్రహావేశాలు -
WTC Final: చారిత్రక మ్యాచ్‌కు వరుణ గండం..?
సౌతాంప్టన్: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారందరికీ ఇదో చేదు వార్త. భారత్, న్యూజిలాండ్ మధ్య మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న మెగా పోరుకు వరుణ గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రిజర్వు డేతో కలిపి మొత్తం ఆరు రోజులు పాటు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి డబ్ల్యూటీసీ ఫైనల్ కావడంతో.. ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. Weather forecast at the Rose Bowl. #WTCFinal #WTCFinal #NZvsIND https://t.co/hLHb7bsG11 pic.twitter.com/JhUprDqO1C — Monty Panesar (@MontyPanesar) June 14, 2021 కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్ష గండంపై పొంచి ఉందన్న అంశంపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఓ ట్వీట్ చేశాడు. జూన్ 18 నుంచి 23 వరకు సౌతాంప్టన్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మ్యాచ్‌కు ఒకరోజు ముందు నుంచే వర్షం మొదలవుతుందని పేర్కొన్నారు. ఇదే జరిగితే మొట్టమొదటి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతలుగా భారత్, న్యూజిలాండ్ జట్లు సంయుక్తంగా నిలుస్తాయని వెల్లడించాడు. ఇదిలా ఉంటే, వర్షం పడి చల్లటి వాతావరణం ఉంటే మాత్రం కివీస్‌కే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‌ను ఉదాహరణగా చూపిస్తున్నారు. మరోవైపు ఐసీసీ టోర్నీల్లో కివీస్‌కు టై గండాలు బయపెడుతున్నాయి. గత వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సూపర్ ఓవర్లలో స్కోర్లు సమం కావడంతో ఆ జట్టుకు ప్రపంచకప్ దక్కకుండా పోయింది. ఇప్పుడు టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ అలాంటి పరిణామాలే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ సంయుక్త విజేతను ప్రకటించడం ఆ జట్టుకు ఊరట కలిగించే అంశం. భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్‌గిల్, పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానే(వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషభ్ పంత్(కీపర్), సాహా(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్. కివీస్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, డేవాన్ కాన్వే, కోలిన్ గ్రాండ్‌హోమ్, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, టిమ్ సౌథీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, బీజే వాట్లింగ్, విల్ యంగ్. చదవండి: క్రికెట్లోకి రీ ఎంట్రీ అన్నాడు.. అంతలోనే? -
సన్‌రైజర్స్, బెంగళూరు మ్యాచ్‌కు వర్షం అంతరాయం..?
చెన్నై: నిన్నటి నుంచి చెన్నై నగరంలోని పలు చోట్ల వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు నగరంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు చెన్నై వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మ్యాచ్ జరుగనున్న చిదంబరం స్టేడియం పరిసరాల్లో అక్కడక్కడ చిరు జల్లులు కురుస్తున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి అక్కడ ఆకాశం మేఘావృతమై ఉండటంతో మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఒకవేళ భారీ వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యం కాకపోతే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది.అయితే ప్రస్తుతానికి చిరు జల్లులు మాత్రమే కురుస్తున్నాయి కాబట్టి.. మ్యాచ్ ఆరంభ సమయానికి వరణుడు కరుణిస్తే మ్యాచ్ సజావుగా సాగే అవకాశాలున్నాయి. -
ఏపీలో భారీగా వర్షాలు అతలాకుతలం
-
వరుణుడే ఆడుకున్నాడు
వెస్టిండీస్ పేస్ బౌలర్ కీమర్ రోచ్ రౌండ్ ద వికెట్‌గా వచ్చి తొలి బంతిని వేయగా ఇంగ్లండ్ ఎడంచేతి వాటం ఓపెనర్ రోరీ బర్న్స్ దానిని సమర్థంగా డిఫెన్స్ ఆడాడు... దాదాపు నాలుగు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఇలా మళ్లీ మొదలైంది. ప్రేక్షకుల చప్పట్లు, ఉత్సాహపు హోరు ఏమీ కనిపించకుండా ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో తమ ఆటను మొదలు పెట్టేశారు. అయితే ఇన్ని రోజుల తర్వాత వచ్చిన క్రికెట్‌ను వరుణుడు మాత్రం కరుణించలేదు. భయపడినట్లుగానే తొలి రోజు ఆటలో చాలా భాగం వర్షం బారిన పడింది. తొలి రోజు సంఘీభావం, సంతాపం మినహా రోజ్ బౌల్లో ఎలాంటి విశేషాలు లేకుండానే క్రికెట్ సాగింది. సౌతాంప్టన్: సీజన్‌కు తగినట్లుగానే ఇంగ్లండ్‌లో వాన తన ప్రతాపం చూపించడంతో ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ నిరాశాజనకంగా మొదలైంది. పదే పదే వాన అంతరాయం కలిగించడంతో అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలకు తగిన వినోదం దక్కలేదు. బుధవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. రోరీ బర్న్స్ (55 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు), డెన్లీ (48 బంతుల్లో 14 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. కేవలం 82 నిమిషాల ఆట మాత్రమే సాగింది. రెండో రోజు శుక్రవారం కూడా వర్ష సూచన ఉంది. రెండో ఓవర్లోనే... సుమారు పది నెలల తర్వాత వెస్టిండీస్ తరఫున ఆడే అవకాశం దక్కించుకున్న పేసర్ షెనాన్ గాబ్రియెల్ తన తొలి ఓవర్లోనే సత్తా చాటాడు. అతను వేసిన నాలుగో బంతిని ఆడకుండా చేతులెత్తేసిన సిబ్లీ (0) క్లీన్‌బౌల్డయ్యాడు. ఆ తర్వాత పదే పదే వచ్చిన అంతరాయాల మధ్య బర్న్స్, డెన్లీ జట్టు ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. వీరిద్దరు కొన్ని చక్కటి షాట్లు ఆడిన తర్వాత ఆగిన ఆట మళ్లీ మొదలు కాలేదు. మళ్లీ మళ్లీ... తొలి టెస్టు ఆరంభమే ఆలస్యమైంది. ఉదయం నుంచి వర్షం కురవడంతో మ్యాచ్ మొదలు కాలేదు. చివరకు సరిగ్గా 3 గంటలు ఆలస్యంగా... భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు తొలి బంతి పడింది. సరిగ్గా 3 ఓవర్లు సాగగానే వర్షంతో ఆట ఆగిపోయింది. వాన తగ్గాక మళ్లీ ఆడితే 7 బంతుల తర్వాతే మళ్లీ చినుకులతో బ్రేక్ పడింది. కొంత విరామం తర్వాత మొదలైన ఆట 13.3 ఓవర్ల పాటు సాగింది. అంతా బాగుందనుకున్న సమయంలో వెలుతురులేమితో మ్యాచ్ ఆపేయాల్సి వచ్చింది. కొద్ది నిమిషాల్లోనే మరోసారి వర్షం వచ్చింది. ఆ తర్వాత వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేయక తప్పలేదు. బ్రాడ్ అవుట్... ఇంగ్లండ్ తుది జట్టులో సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కు చోటు దక్కలేదు. సొంతగడ్డపై జరిగిన ఒక టెస్టులో బ్రాడ్ ఆడకపోవడం 2012 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. మోకాళ్లపై కూర్చోని... అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంతాపసూచకంగా మ్యాచ్‌లో తొలి బంతిని వేయడానికి ముందు ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్లు మోకాలిపై కూర్చొని నిరసనను ప్రదర్శించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా వీరందరూ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ లోగో ముద్రించి ఉన్న జెర్సీలతో బరిలోకి దిగారు. ఇటీవలే కన్నుమూసిన విండీస్ దిగ్గజ క్రికెటర్ ఎవర్టన్ వీక్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మృతి చెందిన కరోనా బాధితుల స్మృతిలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. భుజానికి నల్ల బ్యాండ్లు ధరించారు. రూట్‌కు రెండో అబ్బాయి... ఇంగ్లండ్ టెస్టు జట్టు రెగ్యులర్ కెప్టెన్ జో రూట్‌కు మరో బాబు పుట్టాడు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా రూట్ అభిమానులతో పంచుకున్నాడు. తన భార్య ప్రసవం కారణంగానే రూట్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. ‘ఇంగ్లండ్ జట్టుకు బెస్టాఫ్ లక్. మేం మ్యాచ్ చూస్తూ మీకు మద్దతునిస్తాం’ అంటూ కొత్తగా పుట్టిన అబ్బాయి, తన పెద్ద కొడుకు ఆల్ఫ్రెడ్ విలియమ్‌తో కలిసి ఉన్న ఫోటోను అతను పోస్ట్ చేశాడు. విరామం అనంతరం రూట్ నిబంధనల ప్రకారం వారం రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. ఆ తర్వాత రెండో టెస్టు కోసం అతను మాంచెస్టర్‌లో జట్టుతో కలుస్తాడు. రూట్ గైర్హాజరు కారణంగా తొలి టెస్టులో జట్టుకు స్టోక్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్ జట్టు తరఫున 81వ కెప్టెన్‌గా స్టోక్స్ నిలిచాడు. -
కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
సాక్షి, గుంటూరు : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపల్లె, పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల, వినుకొండలలో కుండపోత వర్షం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. క్రోసూరు ఎస్టీకాలనీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అధ్వర్యంలో 150 కుటుంబాలకు ప్రభుత్వ పాఠశాలలో భోజన, వసతి ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నం : కోస్తాంధ్ర జిల్లాలపై ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ నగరంలో భీమిలి, యలమంచిలి, తదితర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామం వద్ద కాజ్ వే మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
బెయిల్స్ తీసేసి ఆడించారు..
మాంచెస్టర్: యాషెస్ నాలుగో టెస్టుకు వరుణుడు అడ్డుగా నిలిచాడు. బుధవారం ఇక్కడ ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా–ఇంగ్లండ్ పరస్పరం పైచేయికి యత్నిస్తున్న సమయంలో పలుసార్లు అంతరాయం కలిగించాడు. దీంతో 44 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా... ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్ (0), హారిస్ (13) వికెట్లను త్వరగానే కోల్పోయింది. బ్రాడ్ (2/35) ఇన్నింగ్స్ నాలుగో బంతికే వార్నర్‌ను ఔట్ చేశాడు. అయితే, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ లబషేన్ (128 బంతుల్లో 67; 10 ఫోర్లు); స్టీవ్ స్మిత్ (60 బ్యాటింగ్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. ప్రస్తుతం స్మిత్‌కు తోడుగా హెడ్ (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. బెయిల్స్ తీసేసి... తొలి రోజు ఈ మ్యాచ్‌లో అరుదైన దృశ్యం కనిపించింది. తీవ్రంగా గాలి వీయడంతో పలుమార్లు బెయిల్స్ కింద పడ్డాయి. దాంతో అంపైర్లు ధర్మసేన, ఎరాస్మస్ ఇన్నింగ్స్ 32వ ఓవర్లో బెయిల్స్‌ను తొలగించి ఆటను కొనసాగించారు. ఇలా ఆడించడంపై ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, బౌలర్ బ్రాడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
కివీస్‌కు ఆధిక్యం
కొలంబో: శ్రీలంక–న్యూజిలాండ్ రెండో టెస్టుకు వర్షం అడ్డంకి తప్పడం లేదు. వాన కారణంగా నాలుగో రోజు ఆదివారం 48 ఓవర్లే పడ్డాయి. ఓవర్‌నైట్ స్కోరు 196/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్... వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ వాట్లింగ్ (208 బంతుల్లో 81 బ్యాటింగ్; 4 ఫోర్లు), ఆల్‌రౌండర్ గ్రాండ్‌హోమ్ (75 బంతుల్లో 83 బ్యాటింగ్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్ధ శతకాలతో 382/5తో నిలిచింది. ఓపెనర్ టామ్ లాథమ్ 154 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం ఆ జట్టు 138 పరుగుల ఆధిక్యంలో ఉంది. లంక తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. -
వాన దోబూచులాట
భారత్–వెస్టిండీస్ తొలి వన్డేను వరుణుడు వీడని నీడలా వెంటాడాడు. అటు కుండపోతగానైనా కురవక... ఇటు పూర్తిగానూ ఆగక ఒకటికి రెండు సార్లు అంతరాయం కలిగించాడు. ఇలా మ్యాచ్ మొదలైందో లేదో... అలా వస్తూ, పోతూ ఆటగాళ్లతో దోబూచులాడాడు. మొత్తమ్మీద 13 ఓవర్ల ఆటను మాత్రమే సాగనిచ్చాడు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 12.30 గంటల సమయానికీ వర్షం పడుతుండటంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ప్రావిడెన్స్ (గయానా): కరీబియన్ పర్యటనలో టి20లను ఆడుకోనిచ్చిన వరుణుడు వన్డే సిరీస్‌కు మాత్రం అడ్డంకిగా నిలిచాడు. గురువారం భారత్– వెస్టిండీస్ తొలి వన్డే ఒక అడుగు ముందుకు... పది అడుగులు వెనక్కు తరహాలో సాగి చివరికి రద్దయింది. ప్రావిడెన్స్‌లో ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో పిచ్ పరిసరాలను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. టాస్ గంటన్నర ఆలస్యమైంది. దీంతో మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బౌలింగ్ ఎంచుకున్నాడు. టి20 సిరీస్‌లో అవకాశం లభించని మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌ను ఈ మ్యాచ్ తుది జట్టులోకి తీసుకున్నారు. 25 నిమిషాలు సాగిన వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో 5.4 ఓవర్లు ఆడి 7 పరుగులు చేసింది. ఈ దశలో వాన గంటా 15 నిమిషాలు అంతరాయం కలిగించింది. అనంతరం మ్యాచ్‌ను 34 ఓవర్లకు తగ్గించారు. మరో 8 ఓవర్ల పాటు కొనసాగిన ఆటలో విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ (31 బంతుల్లో 4) వికెట్ కోల్పోయింది. చివరకు 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. అవతలి ఎండ్‌లో ఓపెనర్ ఎవిన్ లూయీస్ (36 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మాత్రం ధాటిని ప్రదర్శించాడు. ఖలీల్ అహ్మద్‌పై విరుచుకుపడ్డాడు. ఇంతలోనే చినుకులు పెద్దవి కావడంతో అంపైర్లు మైదానాన్ని వీడాల్సిందిగా ఆటగాళ్లకు సూచించారు. ఎంత వేచి చూసినా ఫలితం లేకపోవడంతో భారత కాలమానం ప్రకారం రాత్రి 12.45కు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఆదివారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరుగుతుంది. -
సశేషం!
ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌కు వరుణ దేవుడు అడ్డు పడ్డాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య పోరులో ఒక ఇన్నింగ్సూ పూర్తిగా ముగియకుండానే వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. అయితే వరల్డ్ కప్ నాకౌట్ నిబంధనల ప్రకారం ‘రిజర్వ్ డే’ అయిన నేడు మ్యాచ్ కొనసాగుతుంది. 46.1 ఓవర్ల వద్ద కివీస్ ఇన్నింగ్స్ నిలిచిపోగా... ఇప్పుడు అక్కడి నుంచే బుధవారం ఆట జరుగుతుంది. భారత బౌలర్లు చెలరేగడంతో స్వల్ప స్కోరు మాత్రమే చేయగలిగిన కివీస్ మిగిలిన 3.5 ఓవర్లలో మరికొన్ని పరుగులు జోడించే అవకాశం ఉంది. రెండో రోజు వాన దెబ్బ లేకుండా సెమీస్ సజావుగా సాగితే భారీ బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియాకు లక్ష్యాన్ని ఛేదించడంలో ఇబ్బంది ఉండకపోవచ్చు. ఒకవేళ నేడు కూడా మ్యాచ్ మధ్యలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగితే డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత లక్ష్యాన్ని సవరిస్తారు. భారత ఇన్నింగ్స్‌లో కనీసం 20 ఓవర్లు కూడా సాధ్యంకాకపోతే మ్యాచ్ రద్దయినట్లు ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం లీగ్ దశలో టాప్ ర్యాంక్‌లో నిలిచిన భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. మాంచెస్టర్: ప్రపంచ కప్ తొలి సెమీస్ మ్యాచ్ రెండో రోజుకు చేరింది. సుదీర్ఘ సమయం పాటు కురిసిన వర్షం కారణంగా మంగళవారం ఆట అర్ధాంతరంగా నిలిచిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ మ్యాచ్ ఆగిపోయే సమయానికి 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. రాస్ టేలర్ (85 బంతుల్లో 67 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్), విలియమ్సన్ (95 బంతుల్లో 67; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఐదుగురు భారత బౌలర్లు తలా ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం టేలర్‌తో పాటు లాథమ్ (3 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. ఎదురుచూపులు... కివీస్ ఇన్నింగ్స్‌లో భువనేశ్వర్ వేసిన 47వ ఓవర్ తొలి బంతికి టేలర్ రెండు పరుగులు తీశాడు. ఈ దశలో వర్షం వచ్చింది. కొన్ని చినుకుల వరకు అంపైర్లు ఆగినా... చహల్ మైదానంలో జారడం, వాన పెరిగితే పిచ్ పాడయ్యే ప్రమాదం ఉండటంతో వెంటనే ఆటను నిలిపివేశారు. భారత కాలమానం ప్రకారం సా. 6.30 గంటలకు ఆట ఆగిపోయింది. ఆ తర్వాతి నుంచి వర్షం పెరగడం, మధ్యలో కొంత తెరిపినిచ్చినా పూర్తిగా తగ్గకపోవడంతో గంటలు గడిచిపోయాయి. దాదాపు రెండున్నర గంటల తర్వాత వాన ఆగడంతో అంపైర్లు పరిస్థితిని సమీక్షించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ వెంటనే మళ్లీ వర్షం వచ్చింది. కివీస్ ఇన్నింగ్స్‌ను అంతటితో ఆపివేసి భారత్ కనీసం 20 ఓవర్లు ఆడే అవకాశం ఇవ్వాలన్నా రాత్రి గం.11.05కు ఆట ఆరంభం కావాల్సింది. కానీ అలాంటి పరిస్థితి కనిపించలేదు. చివరకు రాత్రి గం.10.52కు మంగళవారం ఆటను యథాతథ స్థితిలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. బౌలర్లు భళా... న్యూజిలాండ్‌ను ప్రపంచ కప్ ఆసాంతం వేధించిన ఓపెనింగ్ సమస్య సెమీస్‌లోనూ కొనసాగింది. భువీ, బుమ్రా వేసిన తొలి రెండు ఓవర్లు మెయిడిన్లుగా ముగియగా, తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఆడిన గప్టిల్ (1)ను చక్కటి బంతితో బుమ్రా పెవిలియన్ పంపించాడు. స్లిప్‌లో కోహ్లి అద్భుత రీతిలో ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. ఎనిమిదో ఓవర్ చివరి బంతికి గానీ తొలి ఫోర్ కొట్టలేకపోయిన కివీస్... తొలి 10 ఓవర్లలో 27 పరుగులే చేయగలిగింది. ఈ దశలో నికోల్స్ (51 బంతుల్లో 28; 2 ఫోర్లు), విలియమ్సన్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. రెండో వికెట్‌కు వీరిద్దరు 68 పరుగులు జత చేశారు. అయితే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో కివీస్ స్కోరు బాగా నెమ్మదిగా సాగింది. ఈ జోడి కుదురుకుంటున్న దశలో జడేజా టర్నింగ్ బంతితో నికోల్స్ స్టంప్స్‌ను పడగొట్టాడు. దాంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత కెప్టెన్‌తో పాటు మరో సీనియర్ టేలర్‌పై పడింది. అయితే ఈ జంట కూడా బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేక మరీ నెమ్మదిగా ఆడింది. ఒక దశలో 80 బంతుల పాటు న్యూజిలాండ్ ఫోర్ కూడా కొట్టలేకపోయింది! ఎట్టకేలకు చహల్ ఓవర్లో రెండు ఫోర్లు సాధించిన కివీస్ తడబాటును అధిగమించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో విలియమ్సన్ 79 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 65 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి విలియమ్సన్, టేలర్ ఏకంగా 102 బంతులు తీసుకున్నారు. చివరకు చహల్ బౌలింగ్‌లో చెత్త షాట్‌కు విలియమ్సన్ ఔటయ్యాడు. వెంటనే నీషమ్ (12), గ్రాండ్‌హోమ్ (16) పెవిలియన్ చేరారు. మరో వైపు చహల్ బౌలింగ్‌లో సిక్సర్‌తో టేలర్ 73 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. చివర్లో భారత బౌలర్లు కట్టు తప్పడంతోపాటు నాసిరకమైన ఫీల్డింగ్‌తో 5 ఓవర్లలో కివీస్ 47 పరుగులు చేయగలిగింది. వారి ఇన్నింగ్స్‌లో 153 డాట్ బాల్స్ ఉండటం ఆ జట్టు బ్యాటింగ్ వైఫల్యానికి నిదర్శనం. మ్యాచ్ రద్దయితే... మనమే ఫైనల్‌కు వాతావరణ శాఖ అంచనా ప్రకారం మాంచెస్టర్‌లో బుధవారం కూడా పరిస్థితి అంత మెరుగ్గా ఏమీ లేదు. ఒక వేళ మ్యాచ్ సమయంలో మళ్లీ వర్షం పడితే కివీస్ ఇన్నింగ్స్‌ను అక్కడితోనే ముగించి డక్‌వర్త్ లూయిస్ ప్రకారం భారత్‌కు లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంది. కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యమైనా డక్‌వర్త్ లూయిస్ వర్తిస్తుంది. అదీ జరగకుండా పూర్తిగా రద్దయితే మాత్రం లీగ్ దశలో టాప్ ర్యాంలో నిలిచిన భారత్ ఫైనల్‌కు చేరుతుంది. నిజానికి మంగళవారం మళ్లీ వర్షం రావడమే భారత్‌కు మంచిదైంది. మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదిస్తే టీమిండియా విజయానికి 148 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉంది. టి20 స్టార్లు టీమ్‌లో ఉన్నా...వర్షం ఆగిన తర్వాత పిచ్‌లో వచ్చే మార్పు, మబ్బు పట్టిన వాతావరణంలో కివీస్ బౌలర్లు స్వింగ్‌తో చెలరేగిపోయే ప్రమాదం ఉండేది. అదే జరిగితే భారత్‌కు ఛేదన కష్టంగా మారిపోయేదేమో! తొలి బంతికే రివ్యూ పోయింది! భువనేశ్వర్ వేసిన మ్యాచ్ తొలి బంతి గప్టిల్ ప్యాడ్లను తాకడంతో భారత ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూ కోసం గట్టిగా అప్పీల్ చేశారు. అయితే అంపైర్ కెటిల్‌బరో తిరస్కరించడంతో కోహ్లి రివ్యూ కోరాడు. రీప్లేలో బంతి లెగ్‌స్టంప్‌కు దూరంగా వెళుతున్నట్లు తేలింది. దాంతో గప్టిల్ బతికిపోగా... మొదటి బంతికే రివ్యూ కోల్పోయిన భారత్ తీవ్రంగా నిరాశ చెందింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) కోహ్లి (బి) బుమ్రా 1; నికోల్స్ (బి) రవీంద్ర జడేజా 28; విలియమ్సన్ (సి) జడేజా (బి) చహల్ 67; టేలర్ (బ్యాటింగ్) 67; నీషమ్ (సి) కార్తీక్ (బి) పాండ్యా 12; గ్రాండ్‌హోమ్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 16; లాథమ్ (బ్యాటింగ్) 3; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (46.1 ఓవర్లలో 5 వికెట్లకు) 211. వికెట్ల పతనం: 1–1, 2–69, 3–134, 4–162, 5–200. బౌలింగ్: భువనేశ్వర్ 8.1–1–30–1; బుమ్రా 8–1–25–1; పాండ్యా 10–0–55–1, రవీంద్ర జడేజా 10–0–34–1, చహల్ 10–0–63–1. 87 ఏళ్ల భారత అభిమాని చారులత ఉత్సాహం -
సాగైంది 26 శాతమే
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ పంటల సాగు చతికిలపడింది. రుతుపవనాలు సకాలంలో రాకపోవడం, వచ్చినా ఇప్పటికీ సరైన వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాగు నిరాశాజనకంగా ఉంది. ఖరీఫ్‌లో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 28.49 లక్షల (26%) ఎకరాలకే పరిమితమైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆ శాఖ ప్రభుత్వానికి బుధవారం ఒక నివేదిక పంపింది. ఆ నివేదిక ప్రకారం.. ఖరీఫ్ పంటల సాగు దారుణంగా ఉంది. సాధారణంగా ఇప్పటివరకు 39.39 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావాలి. కానీ ఏకంగా 10 లక్షల ఎకరాల వరకు సాగు తగ్గింది. ఇప్పటివరకు సాగైన 28.49 లక్షల ఎకరాల్లో అత్యధికంగా పత్తి 19.73 లక్షల (46%) ఎకరాల్లో సాగైంది. ఇక ఖరీఫ్‌లో పప్పుధాన్యాల సాగు సాధారణ విస్తీర్ణం.. 10.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.31 లక్షల (22%) ఎకరాల్లో సాగయ్యాయి. అందులో కంది సాగు విస్తీర్ణం 7.29 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 1.52 లక్షల (22%) ఎకరాలకే పరిమితమైంది. ఇక ఖరీఫ్‌లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 12.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.21 లక్షల (18%) ఎకరాలకే పరిమితమైంది. ఇక కీలకమైన వరి ఖరీఫ్ సాగు విస్తీర్ణం 24.11 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 61,615 ఎకరాల్లోనే నార్లు పోశారు. ఇప్పటికే నార్లు పోయడానికి సమయం కూడా తీరిపోయింది. ఇక మధ్య లేదా స్వల్పకాలిక వరి నార్లు వేయడంపైనే దృష్టి సారించాల్సి ఉంది. మరోవైపు వివిధ జిల్లాల్లో పంటల సాగులో తీవ్రమైన వ్యత్యాసం కనిపించింది. ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లాలో అత్యధికంగా 73 శాతం పంటలు సాగు కాగా, అత్యంత తక్కువగా జగిత్యాల జిల్లాలో కేవలం 3 శాతానికే పంటల సాగు పరిమితమైంది. వనపర్తిలో 5 శాతం, నిజామాబాద్, గద్వాల, నల్లగొండ జిల్లాల్లో 6 శాతం చొప్పున మాత్రమే పంటలు సాగయ్యాయి. మంచిర్యాలలో 8 శాతం పంటలు సాగయ్యాయి. 19 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు... రాష్ట్రంలో లోటు వర్షపాతం నమోదైంది. జూన్ ఒకటో తేదీ నుంచి బుధవారం నాటికి సాధారణంగా నమోదు కావాల్సిన వర్షపాతం 146.3 మిల్లీమీటర్లు (ఎంఎం) కాగా, ఇప్పటివరకు 105 ఎంఎంలే నమోదైంది. అంటే 28 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. దీంతో రాష్ట్రంలో 19 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, జనగాం, యాదాద్రి, మేడ్చల్, నల్లగొండ, సూర్యాపేట, ములుగు జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. ఖమ్మం జిల్లాలో కరువుఛాయలు నెలకొన్నాయి. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాల్లోనైతే ఏకంగా 72 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో 62 శాతం, సూర్యాపేట జిల్లాల్లో 60 శాతం లోటు నమోదైంది. హైదరాబాద్‌లో మాత్రం 10 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వర్షాధార పంటలైన జొన్న, సజ్జ, రాగి, వేరుశనగ, సోయాబీన్, పత్తి సాగు ఊపందుకుందని వ్యవసాయశాఖ తెలిపింది. వచ్చే 2 వారాల్లో వరి నార్లు ఊపందుకుంటాయని పేర్కొంది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను తాము సిద్ధంగా ఉంచినట్లు వ్యవసాయశాఖ తన నివేదికలో తెలిపింది. ఇప్పటివరకు వేసిన పంటల పరిస్థితి బాగుందని వివరించింది. -
వరుణ దేవుడా... క్రికెట్ మ్యాచ్‌లకు అడ్డురాకు...!
న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ కప్ సందర్భంగా... భారత మ్యాచులకు అడ్డు పడొద్దు వరుణుడా..!? అని సగటు అభిమానులు ప్రార్థించడం సర్వ సాధారణం. కానీ, బీమా కంపెనీలు కూడా ఇప్పుడు ఇదే కోరుకుంటున్నాయి. ఎందుకంటే వర్షం కారణంగా భారత మ్యాచులు రద్దయితే బీమా కంపెనీలు పరిహారం రూపంలో రూ.100 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుంది. సెమీ ఫైనల్స్‌కు ముందు భారత్ మరో నాలుగు మ్యాచుల్లో తలపడాల్సి ఉంది. ఈ నాలుగు కూడా వర్షం కారణంగా రద్దు కావన్న ఆశలతో బీమా కంపెనీలు ఉన్నాయి. తొలి దశలో ఇప్పటికే భారత్, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ను వర్షం కారణంగా కోల్పోవాల్సి వచ్చిన విషయం గమనార్హం. ప్రస్తుత ఐసీసీ ప్రపంచ కప్‌లో భాగంగా ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లకు వర్షం అడ్డుతగిలింది. క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి మన దేశంలో రూ.150 కోట్ల బీమా మార్కెట్ ఉంటుందని పరిశ్రమ వర్గాల సమాచారం. న్యూ ఇండియా అష్యూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ సాధారణంగా ఈ తరహా బీమా పాలసీలను ఎక్కువగా విక్రయిస్తున్నాయి. క్లెయిమ్స్ ఎదురైతే వీటిపైనే ఎక్కువ భారం పడుతుంది. భారత్–పాక్ మ్యాచ్‌కు రూ.50కోట్లు భారీగా వెచ్చించి ఐసీసీ క్రికెట్ మ్యాచుల ప్రసార హక్కులను కొనుగోలు చేసిన ప్రసార మాధ్యమాలు సాధారణంగా క్రికెట్ మ్యాచులు రద్దయితే తలెత్తే నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఈ పాలసీలను తీసుకుంటుంటాయి. దీంతో వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా, వర్షం కారణంగా అవరోధం ఏర్పడి మ్యాచ్‌ను కుదించడం వల్ల ప్రకటనల ఆదాయం నష్టపోవడం జరిగినా పరిహారం పొందొచ్చు. మ్యాచ్ యథావిధిగా జరిగితే బీమా కంపెనీలు ఊపిరిపీల్చుకున్నట్టే. భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌పై ఏకంగా రూ.50 కోట్ల బీమా తీసుకోవడం దీనికున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం మేరకు... ఒక్కో మ్యాచ్ ప్రసార సమయంలో ప్రకటనలపై రూ.5–50 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. అదే ఫైనల్స్, సెమీ ఫైనల్స్ వంఇ ప్రత్యేక మ్యాచుల్లో ఈ ఆదాయం రూ.70–80 కోట్ల వరకు ఉంటుంది. -
ప్రపంచకప్ సెమీస్‌కు వర్షం !
లండన్ : ‘ఐసీసీ ప్రపంచకప్-2019 సెమీస్‌కు 6 పాయింట్లతో ‘వర్షం’ సెమీస్‌కు వెళ్లింది. పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ తరువాతి స్థానంలో నిలిచి సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది.’ అని ప్రపంచకప్-2019 టోర్నీని ఉద్దేశించి సోషల్‌మీడియా వేదికగా అభిమానులు చేస్తున్న ట్రోల్స్. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. గత రెండు రోజులుగా అక్కడ వాతావరణ పరిస్థితి మరి దారుణంగా తయారైంది. టాస్ వేయడం.. వర్షం రావడం సాధారణం అయిపోయింది. బంగ్లాదేశ్- శ్రీలంక మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దవ్వగా... సోమవారం దక్షిణాఫ్రికా- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 7.3 ఓవర్ల అనంతరం వర్షం ఆటంకం కలిగించింది. దీంతో మ్యాచ్ రద్దై సఫారీల టైటిల్ ఆశలే గల్లంతయ్యాయి. జూన్ 7న పాకిస్తాన్-శ్రీలంక మ్యాచ్ కూడా ఇలానే ఒక్క బంతి పడకుండా రద్దైంది. (చదవండి : మళ్లీ వరుణుడు గెలిచాడు) నేడు పాకిస్తాన్ -ఆస్ట్రేలియా, రేపు భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌లకు కూడా వర్షం అడ్డంకిగా మారే అవశం ఉండటంతో యావత్ క్రికెట్ అభిమానులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. అంతర్జాతీ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడే దగ్గర ప్రపంచకప్ ఎవడు నిర్వహించమన్నాడని మండిపడుతున్నారు. సెటైరిక్ మీమ్స్‌తో కుళ్లు జోకులు పేల్చుతున్నారు. ‘ఈ ప్రపంచకప్‌లో 11వ జట్టుగా వర్షం పాల్గొంది. అది 3 మ్యాచ్‌లు గెలిచి 6 పాయింట్లతో టైటిలే లక్ష్యంగా దూసుకెళ్తుంది. సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. నేటి పాక్-ఆసీస్, రేపటి భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ గెలిస్తే వర్షానికి తిరుగేలేదు.’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. టాస్ గెలిచిన శ్రీలంక స్విమ్మింగ్ ఎంచుకుందని సెటైర్లేస్తున్నారు. ఇక వర్షానికి శ్రీలంక రెండు సార్లబలైంది. ఈ పరిణామం లంక నాకౌట్ అవకాశాలపై ప్రభావం చూపనుంది. (చదవండి : కప్పు లాక్కెళ్లిపోయిన పాకిస్తాన్..!) 11th nation to participate in the tournament. The ultimate one, RAIN. Why the hell it is being conducted in England.#ICCWorldCup2019 #ICCCricketWorldCup2019 #WorldCup2019 #ICCWC2019 pic.twitter.com/dsao01xwf7 — Anand Shankar (@ashanka77) June 12, 2019 #CWC19 #WorldCup2019 #SLvBAN pic.twitter.com/X2l3HZk15A — SAURAV JHA BADAL (@badal_saurav) June 12, 2019 -
ఈదురు గాలుల బీభత్సం
సాక్షి, మద్నూర్: జిల్లాలో పలు ప్రాంతాలలో గురువారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షంతో పంటలకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మామిడి కాయలు రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని మేనూర్, మొఘా, సుల్తాన్‌పేట్ తదితర గ్రామాల్లో మామిడి తోటలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. సుల్తాన్‌పేట్ మాజీ సర్పంచ్ రాములు ఇంటిపై చెట్టు కూలిపడింది. ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. ఎన్నికల సందర్భంగా సలాబత్పూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు టెంట్లు గాలికి కొట్టుకుపోయాయి. నేలరాలిన మామిడి కాయలు రెంజల్: ఈదురు గాలులతో కూడిన వర్షానికి బోధన్ డివిజన్లోని పలు గ్రామాలలో మామిడి కాయలు రాలిపడ్డాయి. సుమారు ఎనభై శాతం పంటకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం జిల్లా క్లస్టర్ లెవల్ హార్టికల్చర్, సెరీకల్చర్ అధికారి పండరి మండలంలో పర్యటించి, నష్టం వివరాలను సేకరించారు. బోధన్ మండలంలో 122 ఎకరాలు, ఎడపల్లి మండలంలో 46 ఎకరాలు, రెంజల్ మండలంలో 43 ఎకరాలు, నవీపేట్ మండలంలో 112 ఎకరాలు, కోటగిరి మండలంలో 146 ఎకరాలు, రుద్రూర్ మండలంలో 40 ఎకరాలు, వర్ని మండలంలో 65 ఎకరాల్లో మామిడి పంటను సాగు చేస్తున్నారు. పంట నష్టం తీవ్రంగా ఉందని పండరి పేర్కొన్నారు. 33 శాతం నష్టం వాటిల్లితే ప్రభుత్వం పరిహారం అందిస్తుందన్నారు. నష్టం అంచనాపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు. ఆయన వెంట మండల ఉద్యాన అధికారి అస్రార్, రైతులు ఉన్నారు. వర్షంతో దెబ్బతిన్న పంటలు బీర్కూర్: అకాల వర్షంతో బీర్కూర్ మండలంలో పంటలు దెబ్బతిన్నాయి. గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షంతో సంబాపూర్, అన్నారం, దామరంచ, కిష్టాపూర్ తదితర గ్రామ శివారులలోని వరి పంట కొంత నేలవాలింది. రైతునగర్ గ్రామశివారులోని మామిడి తోటలో కాయలు రాలిపోయాయి. అన్నారంలో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. బీర్కూర్ మండలంలో సుమారు 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అకాల వర్షంతో భారీ నష్టం బాల్కొండ: బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల పరిధిలో గురువారం రాత్రి చిరు జల్లులతో కూడిన గాలి వీచింది. అకాల వర్షంతో ఎక్కువగా మామిడి పంటకు నష్టం వాటిల్లింది. చిట్టాపూర్, ముప్కాల్, బాల్కొండలలో అధికంగా మామిడి వనాలున్నాయి. బలమైన ఈదురు గాలులు వీయడంతో కాయలు రాలిపోయాయి. దీంతో నష్టపోతున్నా మని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
బెంగళూరును వణికించిన వాన
బెంగళూరు: బెంగళూరులో వర్ష బీభత్సం కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే వేర్వేరు చోట్ల ఐదుగురు మృతిచెందారు. పశ్చిమ, దక్షిణ భాగాల్లో చాలా ప్రాంతాల్లో నీరు రోడ్డుపైనే నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. నీటిపై తేలియాడుతున్న కారులో చిక్కుకున్న మహిళను కొందరు యువకులు కాపాడిన వీడియా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. మైసూర్ రోడ్డులోని నాయందహల్లి సర్కిల్లో శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. కురుబ్రహల్లి ప్రాంతంలో డ్రైనేజీలో పడి కొట్టుకుపోయిన వాసుదేవ్ భట్ అనే పూజారి మృతదేహం శనివారం ఉదయం లభ్యమైంది. మరోవైపు, కనిపించకుండా పోయిన అదే ప్రాంతానికి చెందిన తల్లీకూతుళ్లు కూడా డ్రైనేజీలో కొట్టుకుపోయి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాలను చురుగ్గా కొనసాగిస్తున్నాయి. సీఎం సిద్ధరామయ్య శనివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణ నష్టంపై విచారం వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. -
కూలిన మెట్రో పిల్లర్ డివైడర్ గోడ
-
రబీ పట్టని రైతులు
సాక్షి, గుంటూరు : ఈ రబీలో రైతులు కాడి కిందేస్తున్నారు. సాగర్ జలాల విడుదలపై స్పష్టత లేకపోవడం, ఖరీఫ్ సాగులో పడిన కష్టాలను తలచుకుని దాళ్వా సాగుకు వెనుకంజవేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 74,034 హెక్టార్లలో మాత్రమే రబీ సాగు చేపట్టారు. రాష్ట్రంలో అన్ని రకాల పంటలకు ఖిల్లాగా పేరున్న గుంటూరు జిల్లాలో ఈ ఏడాది రబీ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఖరీఫ్ సాగుకు అష్ట కష్టాలుపడిన రైతాంగం దాళ్వాకు వెనుకంజ వేస్తున్నారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం నేపథ్యంలో జూన్‌లో ప్రారంభం కావలసిన ఖరీఫ్ సాగు దాదాపు 45 రోజులకు పైగా ఆలస్యమైంది. ఫలితంగా డిసెంబరు చివరినాటికి రావలసిన పంటలు ఇంకా రైతు ఇంటికి చేరలేదు. దీంతో రబీ మందకొడిగానే సాగవుతోంది. ప్రధానంగా సాగర్ జలాల విడుదల ప్రశ్నార్థకంగా మారింది. నీటి విడుదల పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వక పోవడంతో రైతులు సాగుకు వెనుకంజ వేస్తున్నారు. రబీలో రెండో పంటగా వరిసాగుకు ఆసక్తి చూపటం లేదు. ఆరుతడి పంటలకు మొగ్గు... జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో రబీలో ఎక్కువ మంది రైతులు ఆరుతడి పంటలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న, జొన్న వైపు అధిక శాతం మంది రైతులు మొగ్గు చూపుతున్నారు. ఖరీఫ్‌లో వర్షాభావానికితోడు పత్తి పంటను తెగుళ్లు ఆశించడంతో దిగుబడులు తగ్గాయి. దీనికి తగ్గట్టే మా ర్కెట్లో కూడా పత్తికి సరైన ధర రావడం లేదు. కనీసం పెట్టుబడి వార వస్తే చాలని రైతులు దేవుళ్లకు మొక్కుతున్నారు. పెట్టుబడుల కోసం బయట తెచ్చిన అప్పులు తీర్చుకోవచ్చని ఆశపడుతున్నారు. మరో వైపు ఖరీఫ్ ధాన్యంతోపాటు గత దాళ్వాలో నిల్వ ఉంచిన ధాన్యానికీ మార్కెట్లో ధర రావడం లేదు. ఆదుకోవలసిన ప్రభుత్వం నామమాత్రంగా సీసీఐ కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. ఈ కేంద్రాల్లో నిబంధనల పేరుతో ధాన్యం కోనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి అయినకాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో రబీ సాగు చేస్తే మరోసారి చేతులు కాల్చుకోవడమేనన్న భావనలో రైతులు ఉన్నారు. ఇప్పటివరకు జిల్లాలో కేవలం74,034 హెక్టార్లలో మాత్రమే రబీ సాగు చేపట్టారు.పంటలవారీగా వివరాలు ఇలావున్నాయి... -
రూ. అరకోటి నష్టం
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : అకాల వర్షాలు, ఈదురుగాలులు జిల్లా రైతులను నిలువునా ముంచేశాయి. ముఖ్యంగా ఉద్యానవన పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. సాయం చేయవలసిన అధికారులు నిబంధనల మీనమేషాలు లెక్కపెడుతూ.. నష్టాన్ని బాగా తగ్గించి చూపిస్తున్నారు. సుమారు రూ. 50 కోట్ల మేర అరటి, బొప్పాయి, మామిడి రైతులు నష్ట పోగా, అందులో సగం మాత్రమే నష్టపోయినట్టు అధికారులు అంచనాలు తయారు చేశారు. జిల్లాలో ఉద్యాన రైతుల పరిస్థితి దీనంగా మారింది. ఓవైపు ప్రకృతి విపత్తులు, చీడపీడల నుంచి పంటలను నష్టపోతున్న రైతులకు మరోవైపు అధికారుల అలసత్వం వల్ల అపార నష్టం ఏర్పడుతోంది. అకాల వర్షాలు, ఈదురుగాలులకు జిల్లాలో 120 హెక్టార్లలో అరటి, 45 హెక్టార్లలో బొప్పాయి పంటకు నష్ట వాటిల్లినట్టు సమాచారం. ఈ లెక్కన హెక్టారుకు రూ. 29వేలు చొప్పున అనధికారి కంగా రూ. 47 లక్షల 85 వేల మేరనష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే కేవలం రూ 28 లక్షల 41 వేల 600 మేర నష్టం వాటిల్లిన ట్లు అధికారులు లెక్కలేస్తున్నారు. అలాగే సుమారు 300 హెక్టార్లలో మామిడి కాయలు నేలరాలగా..ఎక్కడా నష్టం వాటిల్లలేదని అధికారులు చెప్పడం విశేషం. నిబం ధనల ప్రకారం మామిడి చెట్లు వేళ్లతో సహా బయటకు వస్తేనే నష్టంగా పరిగణిస్తామని చెబుతు న్నారు. నష్టం అంచనాల్లో భారీ వ్యత్యాసం ఉండడంతో జిల్లాలో ఉద్యాన పంట లు సాగుచేస్తున్న రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో వరి తరువాత పెద్ద మొ త్తంలో సాగు చేసిది ఉద్యాన పంటలనే. అరటి, బొప్పాయి, మామిడి పంటలను ఎక్కువగా సాగుచేస్తారు. మూడు నాలుగు రోజులుగా ఉద్ధృతంగా వీస్తున్న ఈదురుగాలులు, కురిసిన వర్షానికి ఈ మూడు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో 88.4 హెక్టార్లలో అరటి పంట నష్టపోగా, 30 హెక్టార్లలో బొప్పాయి పంటకు నష్టం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంతకన్నా పెద్ద మొత్తంలోనే నష్టం వాటిల్లింది. కాని నిబంధనల సాకు చూపి 50 శాతానికి పైగా పంట నష్టం జరిగి తేనే నష్ట పరిహారం అందజేస్తామని అధికారులు తెలిపారు. ఆ మేరకు నివేదికలు రూపొందించారు. గాలులతో భారీ ఎత్తున మామి డి పంటకు నష్టం వాటిల్లినా నష్ట పరిహారం వర్తింపజేయడంలేదు. మామిడి సంబంధించి తోటలో చెట్లు వేళ్లతో సహా కూలిపోతేనే నష్టంగా గుర్తించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఈ విషయంలో తాము చేసేదేమి ఉండదని అధికారులు చెబు తున్నారు.అనధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 200 హెక్టార్లపైనే మామిడి పంటకు నష్టం వాటిల్లినట్లు అంచనా. ఈ లెక్కన ప్రభు త్వం తరఫున అందించే నష్టపరిహారంతో లెక్క వేస్తే సుమారు రూ 18 లక్షల వరకు నష్టం వాటిల్లింది. -
లెక్క తప్పారు
సాక్షి, కడప: ఇటీవల కురిసిన వర్షం దెబ్బకు ఓ వైపు కళ్లెదుటే పంటకుళ్లిపోయి..మరోవైపు సాగుకు చేసిన పెట్టుబడి గుర్తుకొస్తూ వేలాది రైతులు వేదనపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం రైతుల వద్దకు వచ్చి, పంట పొలాలు పరిశీలించి వారికి దన్నుగా నిలవాలి. నష్టపోయిన పంటలను గుర్తించి పరిహారం చెల్లించాలి. అయితే జిల్లా యంత్రాంగం మాత్రం పరిహారపు లెక్కలను పరిహాసంగా చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 40-50వేల ఎకరాల్లో పంటనష్టపోతే కేవలం 9,203 ఎకరాల్లో మాత్రమే పంటనష్టం వాటిల్లిందని అంచనాలు సిద్ధం చేస్తున్నారు. ఈ అంచనాలనే అధికారులు ప్రభుత్వానికి నివేదిస్తే...జిల్లాలో నష్టపోయిన రైతులకు అందే అరకొర పరిహారం కూడా దూరమయ్యే ప్రమాదముంది. ఈ నష్టాలు కన్పించలేదా?: ఈ నెల 22వ తేదీ రాత్రి నుంచి వర్షాలు మొదలయ్యాయి. ఆరు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిశాయి. వర్షం దెబ్బకు జిల్లాలో సాగుచేసిన వరి, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, కొర్ర, సజ్జ, పెసర, మినుముతో పాటు ఉద్యాన పంటలైన చామంతి, ఇతర పూలతోటల్లో ఐదు రోజులపాటు వర్షపునీరు నిలిచి పంట మొత్తం నీటిపాలైంది. కొన్నిచోట్ల వంకలు, వాగులు పారి పంటల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. రాళ్లు వచ్చాయి. వర్షం కురిసినన్ని రోజులు, రోజూ అధికారులు సమావేశం నిర్వహించి పంటనష్టంపై ఆరా తీశారు. దీంతో అధికారయంత్రాంగం పంటనష్టంపై చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని బాధలో ఉన్న రైతులూ ఆనందపడ్డారు. తీరా అంచనాలు సిద్ధమయ్యాక చూస్తే కేవలం 9,200 ఎకరాల్లో మాత్రమే పంటనష్టం వాటిల్లిందని అధికారులు తేల్చారు. వాస్తవానికి జిల్లాలో 40-50 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు సుస్పష్టంగా తెలుస్తోంది. పెద్దముడియం మండలంలో ఏటా 40వేల ఎకరాల్లో పప్పుశనగ సాగు చేస్తారు. ఈ ఏడాది 25వేల ఎకరాల్లో ఇటీవల పంటసాగు చేశారు. వర్షం దెబ్బకు దాదాపు 20వేల ఎకరాల్లో పొలంలో వేసిన విత్తనం కుళ్లియిపోయింది. మొలకలు వచ్చిన పంట నిలువునా మునిగింది. అలాగే రాజుపాళెం మండలంలో 3వేల ఎకరాల్లో పప్పుశనగ, 2వేల ఎకరాల్లో పత్తి, మరో వెయ్యి ఎకరాల్లో ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. ఈ రెండు మండలాల్లోనే 26వేల ఎకరాల నష్టం వాటిల్లింది. అలాగే జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మండలాల్లో పప్పుశనగ, జొన్నకు నష్టం వాటిల్లింది. చాపాడు, దువ్వూరు, మైదుకూరుతో పాటు కుందూపరీవాహక ప్రాంతాల్లో వరిపంట నీట మునిగింది. పసుపుకూ తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే పెండ్లిమర్రి, వేముల మండలాల్లో ఉళ్లి పంటలు నష్టపోయాయి. చింతకొమ్మదిన్నె మండలంలోనే వేరుశనగ, పత్తి, సజ్జ, పసుపు, టమోటా, చామంతి, వరి కలిపి వెయ్యి ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఈ విధంగా వేంపల్లి, మైలవరం, సింహాద్రిపురం, తొండూరుతో పాటు చాలా మండలాల్లో పలురకాల పంటలకు నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తిగా పంటలను పరిశీలించి నివేదికలు రూపొందించితే వాస్తవంగా ఎన్ని ఎకరాల్లో నష్టం వాటిల్లిందనే అంశాలు స్పష్టంగా తెలుస్తాయి. కానీ మొక్కుబడిగా పర్యటించి కేవలం వారి అంచనాల మేరకే ప్రణాళికలు రూపొందిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.