దాయాదుల పోరు కోసం ఏడాది నుంచి ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు వరుణడు ఆటంకం కలిగించాడు. ఆసియాకప్-2023లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. భారత ఇన్నింగ్స్ పూర్తి అయిన తర్వాత మొదలైన వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 266 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. టాపర్డర్ విఫలం కావడంతో 66 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లొతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో భారత్‌ను ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అదుకున్నారు. హార్దిక్ పాండ్యా(87), ఇషాన్ కిషన్(82) ఐదో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది (4/35) చెలరేగగా.. నసీమ్ షా, హారిస్ రవూఫ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. తొలి మ్యాచ్ నెగ్గిన పాకిస్తాన్ ఈ ఫలితంతో ‘సూపర్–4’ దశకు చేరగా, రేపు నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సూపర్–4 దశకు అర్హత సాధిస్తుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఇప్పటివరకు భారత్-పాక్ మధ్య ఎన్ని వన్డే మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యోయో ఓసారి తెలుసుకుందాం.
ఎన్ని సార్లు అంటే?
వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య 5 మ్యాచ్‌లు రద్దు అయ్యాయి. చివరగా 26 ఏళ్ల క్రితం భారత్-పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. 1997లో టొరంటోలో జరిగిన సహారా కప్‌లో ఈ రెండు జట్ల మధ్య వన్డే మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయింది. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య మొత్తం 133 మ్యాచ్‌లు జరిగాయి. 55 మ్యాచ్‌ల్లో భారత్, 73 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ గెలుపొందాయి.
చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్ బౌలర్ ఓవరాక్షన్.. బుద్దిచెప్పిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment