దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఓటమి చెందిన టీమిండియా బదులు తీర్చుకోవడానికి సిద్దమైంది. ఆదివారం కటక్ వేదికగా జరగనున్న రెండో టీ20లో దక్షిణాఫ్రికా, భారత్ జట్లు తలపడపనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత్ భావిస్తోంది. దాదాపు రెండు ఏళ్ల తర్వాత కటక్‌లో అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆదివారం ఓ మోస్తారు జల్లులు పడే అవకాశం ఉన్నట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
"ఆదివారం సాయంత్రం కటక్‌లో వర్షం పడదని మేము ఖచ్చితంగా చెప్పలేము. తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే భారీ వర్షం పడే ఛాన్స్ లేదు" అని భువనేశ్వర్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్ బిశ్వాస్ పేర్కొన్నారు. ఒక వేళ వర్షం పడినా.. మ్యాచ్‌కు భారీ అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఒడిశా క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు వెల్లడించారు.
టీమిండియా తుది జట్టు(అంచనా) : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (సి), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్
చదవండి: భారత్‌కు మరో సవాల్
Comments
Please login to add a commentAdd a comment