Barabati Stadium
-
రెండో టీ20కి వరుణుడి ఆటంకం.. 50% వర్షం పడే ఛాన్స్..!
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఓటమి చెందిన టీమిండియా బదులు తీర్చుకోవడానికి సిద్దమైంది. ఆదివారం కటక్ వేదికగా జరగనున్న రెండో టీ20లో దక్షిణాఫ్రికా, భారత్ జట్లు తలపడపనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత్ భావిస్తోంది. దాదాపు రెండు ఏళ్ల తర్వాత కటక్‌లో అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆదివారం ఓ మోస్తారు జల్లులు పడే అవకాశం ఉన్నట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. "ఆదివారం సాయంత్రం కటక్‌లో వర్షం పడదని మేము ఖచ్చితంగా చెప్పలేము. తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే భారీ వర్షం పడే ఛాన్స్ లేదు" అని భువనేశ్వర్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్ బిశ్వాస్ పేర్కొన్నారు. ఒక వేళ వర్షం పడినా.. మ్యాచ్‌కు భారీ అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఒడిశా క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు వెల్లడించారు. టీమిండియా తుది జట్టు(అంచనా) : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (సి), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్ చదవండి: భారత్‌కు మరో సవాల్ -
దక్షిణాఫ్రికాతో రెండో టీ20.. తొలి టికెట్ కొన్న ఒడిశా ముఖ్యమంత్రి..!
భారత జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ వేదికగా జూన్ 9న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇరు జట్లు మధ్య రెండో టీ20 జూన్ 12న కటక్‌లోని బరాబతి స్టేడియం వేదికగా జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌కి తొలి టికెట్‌ను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొనుగోలు చేశారు. ఇక బరాబతి స్టేడియం వేదికగా రెండో సారి దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. 2015లో జరగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆతిథ్య జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. బిజినెస్ స్టాండర్డ్ సమాచారం ప్రకారం.. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ లోచన్ మొహంతి, ఓసీఏ కార్యదర్శి సంజయ్ బెహెరా సోమవారం ముఖ్యమంత్రికి టికెట్‌ను అందజేశారు. అదే విధంగా స్టేడియం వద్ద చేసిన భద్రతా ఏర్పాట్లను నవీన్ పట్నాయక్‌కు పంకజ్ లోచన్ వివరించినట్లు తెలుస్తోంది. భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ మొదటి టీ20: జూన్ 9- గురువారం- అరుణ్ జైట్లీ స్టేడియం- ఢిల్లీ రెండో టీ20: జూన్ 12- ఆదివారం- బరాబతి స్టేడియం- కటక్ మూడో టీ20: జూన్ 14- మంగళవారం- డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం- విశాఖపట్నం నాలుగో టీ20: జూన్ 17, శుక్రవారం- సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం- రాజ్‌కోట్ ఐదో టీ20: జూన్ 19- ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు నోట్: అన్ని మ్యాచ్‌లు రాత్రి ఏడు గంటలకు ఆరంభమవుతాయి. ప్రొటిస్‌తో సిరీస్‌కు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్- వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. దక్షిణాఫ్రికా జట్టు: తెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాసీ వాన్ డెర్ డస్సెన్, మార్కో జాన్సెన్ చదవండి: SL Vs Aus 1st T20: ఆసీస్‌తో మొదటి టీ20.. శ్రీలంక తుది జట్టు ప్రకటన.. విజయం మాదే! -
ఐదో వన్డే రద్దు!
-
ఐదో వన్డే రద్దు!
కటక్: చెరువును తలపిస్తున్న మైదానం... పిచ్‌పై ఏకంగా మూడు కవర్లు... మధ్య మధ్యలో కాస్త తెరపినిస్తున్నా, వదలని వాన... ఓవర్‌టైమ్ పని చేస్తున్న మైదానం సిబ్బంది... ఇదీ బారాబతి స్టేడియంలో పరిస్థితి. మరో రెండు రోజులు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదిక. ఈ నేపథ్యంలో శనివారం భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరగాల్సిన ఐదో వన్డే రద్దయ్యే అవకాశం ఉంది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్ నిర్వహణ అసాధ్యం. అయితే రద్దయినట్లు అధికారికంగా ప్రకటించే హక్కు మాకు లేదు. శనివారం అంపైర్లు మైదానాన్ని పరిశీలించి ఈ ప్రకటన చేస్తారు. అయితే మేం టిక్కెట్ల డబ్బు ఏ తేదీల్లో (నవంబరు 8-15) వాపస్ చేసేదీ ఇప్పటికే ప్రకటించాం’ అని ఒరిస్సా క్రికెట్ సంఘం కార్యదర్శి బెహరా చెప్పారు. శనివారం ఇరు జట్ల ఆటగాళ్లు స్టేడియానికి కూడా రాకపోవచ్చు. కేవలం అంపైర్లు, అధికారులు వచ్చి మ్యాచ్ రద్దు ప్రకటన చేస్తారు. 17 సంవత్సరాల క్రితం భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఇదే వేదికలో జరగాల్సిన వన్డే కూడా వర్షం కారణంగా రద్దయింది. ఏడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. ఆరో వన్డే 30న నాగ్‌పూర్‌లో జరుగుతుంది. ఇక సిరీస్ గెలవాలంటే భారత్ కచ్చితంగా మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచి తీరాలి. అక్టోబరు 31 నుంచి ఉత్తరప్రదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన మూడు రోజుల మ్యాచ్‌ను కూడా కటక్ నుంచి ముంబైకి తరలించాలని ఒరిస్సా సంఘం ఇప్పటికే బీసీసీఐని కోరింది. వన్డే మ్యాచ్ రద్దు కావడం ద్వారా ఒరిస్సా సంఘానికి రూ. 3 కోట్ల నష్టం వస్తుంది. అయితే ఈ మ్యాచ్‌ను ఇప్పటికే ఇన్సూరెన్స్ చేశారు. కాబట్టి ఈ నష్టాన్ని భర్తీ చేసుకునే అవకాశం ఉంది. ‘ఏడు వన్డేల సిరీస్ కాస్తా ఐదు వన్డేల సిరీస్‌గా మారింది. ఇందులో 2-1 ఆధిక్యంలో ఉండటం కచ్చితంగా మాకు కలిసొచ్చే అంశం. భారత్‌లో సిరీస్ గెలవడం మా కోరిక. ఇప్పుడు అది సాధ్యమయ్యే అవకాశం ఉంది’ - వాట్సన్ ‘ఇక మాకు చివరి రెండు వన్డేలు చావోరేవో. వాతావరణం మన చేతుల్లో ఉండదు. కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలవాలి’ - జడేజా