
►డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది. వర్షం ఎప్పటికి తగ్గుముఖం పట్టకపోవడంతో టాస్ పడకుండానే మ్యాచ్‌ను అంపైర్‌లు రద్దు చేశారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబర్ 12న సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరగనుంది.
►డర్బన్‌లో ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఇప్పటికే ఓవర్ల కుదింపు ప్రారంభమైంది.
భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్‌కు సమయం అసన్నమైంది. డర్బన్‌లోని కింగ్స్‌మేడ్ మైదానంలో తొలి టీ20లో తాడోపేడో తెల్చుకోవడానికి ఇరు జట్లు సిద్దమయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న కింగ్స్‌మీడ్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం పడుతోంది. ప్రస్తుతం పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. దీంతో టాస్ కాస్త ఆలస్యం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment