
వెస్టిండీస్, జింబాబ్వే జట్ల మధ్య తొలి టెస్టును వర్షం వెంటాడుతోంది. తొలి రోజు 51 ఓవర్ల ఆట సాధ్యమైతే... రెండో రోజు 38 ఓవర్లు మాత్రమే పడ్డాయి. బులవాయోలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు కూడా జింబాబ్వే బౌలర్లు వికెట్ తీయడంలో విఫలమయ్యారు. ఓవర్‌నైట్ స్కోరు 112/0తో ఆట కొనసాగించిన వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 221 పరుగులు సాధించింది.
ఓవర్‌నైట్ ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (246 బంతుల్లో 116 బ్యాటింగ్; 7 ఫోర్లు)... తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ (291 బంతుల్లో 101 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలు పూర్తి చేసుకున్నారు. విండీస్ దిగ్గజ క్రికెటర్ శివనారాయణ్ చందర్‌పాల్ తనయుడైన తేజ్‌నారాయణ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించగా... క్రెయిగ్ బ్రాత్‌వైట్‌కిది 12వ శతకం. 1999లో న్యూజిలాండ్‌తో హామిల్టన్‌లో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ ఓపెనర్లు అడ్రియన్ గ్రిఫిత్ (114), షెర్విన్ క్యాంప్‌బెల్ (170) సెంచరీలు చేసిన తర్వాత... మళ్లీ విండీస్ ఓపెనర్లు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకాలు చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment