Tej Narayan
-
ఏక్ దమ్ స్టెప్పులు
ఏక్ దమ్ ఎనర్జీతో స్టెప్పులేశారు రవితేజ. స్టువర్టుపురం దొంగగా చెప్పుకునే టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. వంశీ దర్శకత్వంలో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘ఏక్ దమ్... ఏక్ దమ్’ అంటూ జోష్‌గా సాగేపాట లిరికల్ వీడియోను ఈ నెల 5న విడుదల చేయనున్నట్లు వెల్లడించి,పోస్టర్‌ను విడుదల చేసింది యూనిట్. నూపుర్ సనన్‌ను రవితేజ ఆటపట్టించే సందర్భంలో ఈపాట వస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, సహనిర్మాత: మయాంక్ సింఘానియా. TIGER's Super Entertaining and Energetic Avatar for a peppy number 🤩💫#TigerNageswaraRao First Single #EkDumEkDum out on September 5th 🥁🎷 A @gvprakash musical 🎶 In cinemas from October 20th 🥷@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AAArtsOfficial @AnupamPKher pic.twitter.com/PIKO52wezZ — Tiger Nageswara Rao (@TNRTheFilm) September 1, 2023 -
తేజ్‌నారాయణ్, బ్రాత్‌వైట్ అజేయ సెంచరీలు
వెస్టిండీస్, జింబాబ్వే జట్ల మధ్య తొలి టెస్టును వర్షం వెంటాడుతోంది. తొలి రోజు 51 ఓవర్ల ఆట సాధ్యమైతే... రెండో రోజు 38 ఓవర్లు మాత్రమే పడ్డాయి. బులవాయోలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు కూడా జింబాబ్వే బౌలర్లు వికెట్ తీయడంలో విఫలమయ్యారు. ఓవర్‌నైట్ స్కోరు 112/0తో ఆట కొనసాగించిన వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 221 పరుగులు సాధించింది. ఓవర్‌నైట్ ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (246 బంతుల్లో 116 బ్యాటింగ్; 7 ఫోర్లు)... తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ (291 బంతుల్లో 101 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలు పూర్తి చేసుకున్నారు. విండీస్ దిగ్గజ క్రికెటర్ శివనారాయణ్ చందర్‌పాల్ తనయుడైన తేజ్‌నారాయణ్ తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీ సాధించగా... క్రెయిగ్ బ్రాత్వైట్కిది 12వ శతకం. 1999లో న్యూజిలాండ్‌తో హామిల్టన్‌లో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ ఓపెనర్లు అడ్రియన్ గ్రిఫిత్ (114), షెర్విన్ క్యాంప్‌బెల్ (170) సెంచరీలు చేసిన తర్వాత... మళ్లీ విండీస్ ఓపెనర్లు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకాలు చేయడం విశేషం. -
నేను, నాన్న... 50-50
చందర్‌పాల్, తేజ్ నారాయణ్‌ల అరుదైన ఘనత జమైకా: క్రికెట్లో తండ్రీ కొడుకులు వేర్వేరుగా ఆడిన దాఖలాలున్నాయి. కానీ అధికారికంగా గుర్తింపు పొందిన ఒకే మ్యాచ్‌లో తండ్రీ తనయులు కలిసి ఆడిన సందర్భాలు లేవనే చెప్పాలి. ఒకరి కెరీర్ ముగిశాక ఇంకొకరు బరిలోకి దిగిన వారున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఒకే మ్యాచ్‌లో ఆడిన తండ్రీ తనయుల అరుదైన కథ ఇది. చరిత్రకెక్కిన ఈ క్రికెట్ కహానిలో... శివనారాయణ్ చందర్‌పాల్, తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ రికార్డుకే మరో రికార్డును జోడించారు. శివనారాయణ్ చందర్‌పాల్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. వెస్టిండీస్ బ్యాటింగ్‌కు వెన్నెముకలాంటోడు. తేజ్‌నారాయణ్... పరిచయం చేయాల్సిన పేరు. చందర్‌పాల్ గారాల తనయుడు. పుట్టుకతోనే రక్తం పంచుకున్నాడు. పుట్టాక వారసత్వాన్ని పంచుకున్నాడు. ఇప్పుడు పెరిగాక... క్రీజులో పరుగులు పంచుకుంటున్నాడు! ఇద్దరు కలిసి దేశవాళీ క్రికెట్లో ఆడటమే ఒక రికార్డయితే... అందులో ఇద్దరూ అర్ధ సెంచరీలు బాదడం మరో రికార్డు. సండే రోజు ఈ సన్ అండ్ ఫాదర్ సెన్సేషన్ సృష్టించారు. జమైకాలోని సబీనా పార్క్‌లో జమైకా జట్టుతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో గయానా తరఫున ఈ ఫీట్ సాధించి చరిత్ర పుటలకెక్కారు. మొదట జమైకా 255 పరుగులు చేసి ఆలౌటైతే... తండ్రీ తనయుల అర్ధ సెంచరీలతో గయానా 262 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది.విండీస్ క్రికెట్లో బ్రియాన్ లారా తర్వాత అత్యధిక టెస్టులు ఆడింది చందర్పాలే. 164 టెస్టుల్లో 11,867 పరుగులు చేశాడు సీనియర్ చందర్‌పాల్. మరిన్ని విశేషాలు... ►చందర్‌పాల్ అంతర్జాతీయ అరంగేట్రం 1994లో చేశాడు. రెండేళ్ల (1996) తర్వాత అతని తనయుడు తేజ్‌నారాయణ్ జన్మించాడు. ► గతం (2012)లో దేశవాళీ కాని ఓ క్లబ్ మ్యాచ్‌లో ఇద్దరూ సెంచరీలు బాదేశారు. ►తేజ్ నారాయణ్‌కు ఇది మూడో అర్ధ సెంచరీకాగా తండ్రితో కలిసి చేయడం ఇదే మొదటిసారి. ►అచ్చు తండ్రిలాగే వికెట్ల ముందు స్టాన్స్ తీసుకుంటాడు. బెయిల్స్‌ను తీసి బ్యాట్‌తో పిచ్‌పై తన గార్డ్ మార్క్ వేసుకుంటాడు. ►బ్యాటింగ్ శైలీ కూడా అదే. చందర్‌పాల్ ఎడంచేతి ఆటగాడైతే తేజ్ కూడా లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మనే!