ఏక్‌ దమ్‌ స్టెప్పులు | Tiger Nageswara Rao: Ravi Teja Nupur Sanon first track Ek Dum Ek Dum poster out | Sakshi
Sakshi News home page

ఏక్‌ దమ్‌ స్టెప్పులు

Published Sat, Sep 2 2023 12:49 AM | Last Updated on Sat, Sep 2 2023 7:25 AM

Tiger Nageswara Rao: Ravi Teja Nupur Sanon first track Ek Dum Ek Dum poster out - Sakshi

రవితేజ, నూపుర్‌ సనన్

ఏక్‌ దమ్‌ ఎనర్జీతో స్టెప్పులేశారు రవితేజ. స్టువర్టుపురం దొంగగా చెప్పుకునే టైగర్‌ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. రవితేజ టైటిల్‌ రోల్‌ చేసిన ఈ చిత్రంలో నూపుర్‌ సనన్, గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటించారు. వంశీ దర్శకత్వంలో తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 20న రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘ఏక్‌ దమ్‌... ఏక్‌ దమ్‌’ అంటూ జోష్‌గా సాగేపాట లిరికల్‌ వీడియోను ఈ నెల 5న విడుదల చేయనున్నట్లు వెల్లడించి,పోస్టర్‌ను విడుదల చేసింది యూనిట్‌. నూపుర్‌ సనన్‌ను రవితేజ ఆటపట్టించే సందర్భంలో ఈపాట వస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, సహనిర్మాత: మయాంక్‌ సింఘానియా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement