Nupur Sanon
-
రవి తేజ ని చాలా లవ్ చేశాను కానీ
-
రన్ టైమ్ తగ్గించినా కలిసిరాలేదు.. టైగర్ నాగేశ్వరరావు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ చిత్రంలో కృతి సనన్ సోదరి నూపూర్ సనన్ హీరోయిన్గా నటించింది. విజయదశమి సందర్భంగా ఈనెల 20న థియేటర్లలో రిలీజైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంతో టైగర్ నాగేశ్వరరావు విఫలమైంది. (ఇది చదవండి: 20 ఏళ్లుగా అంటున్న మాట నిజమైంది: బన్నీ ఆసక్తికర కామెంట్స్) ఈ మూవీ రన్‌టైమ్ తగ్గించినప్పటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ పెద్దగా కనిపించలేదు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 5.50 కోట్ల షేర్.. దేశవ్యాప్తంగా అన్నీ భాషల్లో కలిపి రూ.8 కోట్ల నెట్ వసూలు చేసింది. రెండో రోజు రెండు రాష్ట్రాల్లో రూ. 3.20 కోట్లు వరకు షేర్‌ను వసూలు చేయగా... రెండో రోజు రూ.4.75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. రెండు రోజుల్లో మొత్తంగా ఈ చిత్రం రూ.9 కోట్లకు పైగా షేర్‌ను అందుకుని పది కోట్ల మార్క్‌ను చేరుకునేందుకు దగ్గరలో ఉంది. ఓవరాల్‌గా చూస్తే రెండురోజుల్లో రూ.12.75 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా.. టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని 1970 కాలంలోని స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ చిత్రాన్ని నిర్మించారు. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: 'టైగర్ నాగేశ్వరరావు'.. ఇప్పుడు జాగ్రత్త పడి ఏం లాభం?) -
‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ ట్విటర్ రివ్యూ
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’.స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ ఇది. వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. రవితేజ కెరీర్లో అత్యంత భారీగా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందించిన ‘టైగర్ నాగేశ్వరరావు’పై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. దీనికి తోడు సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా ప్రమోషన్స్ గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘టైగర్..’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 20)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్‌షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు కథేంటి? ఈ సినిమాకు ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? తదితర విషయాలు ట్విటర్(ఎక్స్)వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ‘టైగర్ నాగేశ్వరరావు’కు ట్విటర్లో మంచి స్పందన లభిస్తోంది. డార్క్ క్యారెక్టర్లో రవితేజ యాక్షన్ హైలెట్ అని అంటున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్ అదిరిపోయాయట. చాలా మంది ట్రైన్ సీక్వెన్స్ గురించి చర్చిస్తున్నారు. అదే సమయంలో రన్ టైమ్ ఇబ్బందికరంగా మారిందని కొంతమంది అంటున్నారు. లవ్‌ట్రాక్ కూడా అంతగా వర్కౌట్ కాలేదట. కానీ సినిమా మాత్రం బోరింగ్‌గా సాగదని చెబుతున్నారు. #TigerNageswaraRao An Action Drama that has a good start and engaging moments but feels dragged after awhile due to the tedious runtime. The setup of the characters and story is well done but after a point especially in the 2nd half it drags until the climax along with some… — Venky Reviews (@venkyreviews) October 20, 2023 ‘టైగర్ నాగేశ్వరరావు’ యాక్షన్ డ్రామా బాగుంది. అయితే రన్ టైమ్ ఎక్కువగా ఉండడం కారణంగా కొంత సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే లవ్ ట్రాక్ సాగదీసినట్లుగా అనిపించింది. కానీ సినిమాలోని క్యారెక్టర్లను తీర్చిదిద్దిన విధానం, యాక్షన్స్ సీన్స్ అదిరిపోయాయి. ఈ మధ్య కాలంలో రవితేజ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది’అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Completed My Show 💥 Peak @RaviTeja_offl Ni Chustaru🔥 RT career Lo Best Intro🤯💥 2nd Half >>>1st Half💥💥 Interval and Climax 🙌💥 BGM @gvprakash🔥🔥 Action Sequences🔥🔥 Block Buster Movie 💥💥💥 My Rating - 4/5 #TigerNageswaraRao #RaviTeja #BlockBusterTigerNageswaraRao pic.twitter.com/D48NOVBqfA — Srinivas (@srinivasrtfan2) October 20, 2023 రవితేజ కెరీర్లో బెస్ట్ మూవీ ఇది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెండాఫ్ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు అదిరిపోయాయి. బీజీఎం బాగుంది. ఓవరాల్‌గా టైగర్ నాగేశ్వరరావు బ్లాక్ బస్టర్ మూవీ అంటూ ఓ నెటిజన్ 4 రేటింగ్ ఇచ్చాడు. I watched #TigerNageswaraRao @BiggBossTamil7_ Review ⭐⭐⭐ so far it’s an interesting and well narrated period action drama. Ravi Teja plays a Good character which is unique to watch. VFX Low Quality #RaviTeja Good Acting . Perfect entertainerpic.twitter.com/MOjI6vvqdB — BiggBossTamil 7 (@BiggBossTamil7_) October 20, 2023 1st Half Review: #TigerNageswaraRao#RaviTeja best in recent🔥@DirVamsee few portions well handled@gvprakash Music OK but didn't create any impact Started off well then derailed with love story & lags, picked up again for interval Good so far!#TNR #TigerNageswaraRaoReview pic.twitter.com/T58yaZci0h — World Cinema (Updates & Reviews) (@UrsWorldCinema) October 20, 2023 #TigerNageswaraRao Review : 👉Rating : 2.75/5 Positives: 👉#RaviTeja Performance 👉Good First Half 👉Fight Sequences 👉Production Values Negatives: 👉Bad Songs 👉Dragged Second Half 👉Lengthy Runtime#TNR #TNRReview #TigerNageswarRaoReview — PaniPuri (@THEPANIPURI) October 19, 2023 #TigerNageswaraRao good film to watch for festival ..#RaviTeja carried the dark character very well💥💥 …Rating 3/5 — CPR News Telugu (@cprnewstelugu) October 20, 2023 #TigerNageswaraRao - 3.25/5 SuperHit ❤️ Positives: 👉#RaviTeja Performance 👉Good First Half 👉Fight Sequences 👉Production Values 👉 @gvprakash BGM Back Bone Of The Movie 🔥 Negatives: 👉Lengthy Runtime@RaviTeja_offl@AbhishekOfficl #RenuDesai pic.twitter.com/EJO9ZdBdk5 — Gayle 333 (@RajeshGayle117) October 20, 2023 #TigerNageswaraRao Outstanding ⭐⭐⭐⭐ #RaviTeja is Mind Blowing & Madras Central Jail Scene Is Bomb Basic. Bgm & Dialogues are Fire Interval block 🔥 Screen play little to long but overall worthy movies for fans#TigerNageswaraRaoReview #TigerNageshwarRao pic.twitter.com/9bLXctmoBF — Taran Adarsh (@Mrjaat0007) October 20, 2023 #TigerNageswaraRaoReview: Positives: - Ravi Teja Performance 👌👌💥 - Madras Central Jail Scene 💥💥💥💥💥💥 - Action Episodes ❤️🔥❤️🔥 - BGM in Action Sequences ☺️☺️ - Interval 💯💯 - Murder Scene in 2nd Half 🤯🤯🤯👌👌👌 Negatives: - Too Lengthy 👎👎👎 - No Proper Flow In… pic.twitter.com/P6enbesWP9 — Movies4u Official (@Movies4u_Officl) October 20, 2023 -
అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి
రవితేజ టైటిల్ రోల్ చేసిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇందులో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరో యిన్లుగా నటించారు. వంశీకృష్ణ దర్శకత్వంలో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ చెప్పిన విశేషాలు. ► మంచి కంటెంట్, కొత్త కథలను చెప్పడమే మా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలోనే పవర్ఫుల్ కంటెంట్ ఉన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చేశాం. ఈ సినిమా చేయడానికి ముందే నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను సంప్రదించి, ఆయన పూర్తి వివరాలు తెలుసుకున్నాం. టైగర్ నాగేశ్వరరావు దొంగగా మార డానికి దారి తీసిన కారణాలు, పరిస్థితులు ఏమై ఉంటాయి? ఆయన దొంగగా మారిన తర్వాత ఏం చేశారు? అనే అంశాలు ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. ► రవితేజగారు హార్డ్‌వర్క్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్‌లన్నీ ఆయనే చేశారు. ఓ రోజు ఆయన చేతికి గాయమైంది. లొకేషన్లో ఐదారు వందలమంది ఉన్నారు. ్ర΄÷డక్షన్ కాస్ట్ వృథా కాకూడదని, ఆయనకు ఇబ్బందిగా ఉన్నా షూటింగ్లో ΄ాల్గొన్నారు. ఇక అనుపమ్ ఖేర్‌గారు నా లక్కీ చార్మ్ అనే చె΄్పాలి. ఫలానా ΄ాత్ర చేయాలని అనుపమ్గారిని కోరితే వెంటనే ఓకే అంటారు. నాపై ఆయనకు ఉన్న నమ్మకం అలాంటిది. హేమలతా లవణంగా రేణూ దేశాయ్ బాగా నటించారు. రేణూదేశాయ్ 2.ఓ చూస్తారు. ప్రత్యేక శ్రద్ధతో జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించాడు. అవినాష్ కొల్లా అద్భుతంగా ఆర్ట్ డైరెక్షన్ చేశాడు. దర్శకుడిగానే కాదు.. నిర్మాతగా కూడా బాధ్యతలు తీసుకుని పని చేశారు వంశీ. కథకు ఏది అవసరమైతే అది నేను వందశాతం ఇస్తాను. నిర్మాణంలో రాజీపడను. నా కెరీర్లో ఓ మంచి గుర్తుగా నిలిచి΄ోతుంది ‘టైగర్ నాగేశ్వరరావు’. ► పండగ అంటే రెండు, మూడు సినిమాలు రావడం సహజం. మా సినిమా కంటెంట్‌పై నమ్మకం ఉంది. ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం కూడా ఉంది. నార్త్‌లోనూ మంచి ΄ాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ► తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతగా నేను అవుట్‌సైడర్‌ని. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వచ్చిన మూడేళ్ళలో నిర్మాతగా జాతీయ అవార్డు (‘కశ్మీరీ ఫైల్స్’ చిత్రం) అందుకోవడం మా సంస్థకు గౌరవాన్ని తెచ్చింది. అవార్డు అందుకుంటున్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. మా బ్యానర్లో త్వరలో ఓ క్రేజీ బయోపిక్ ప్రకటిస్తా. -
బద్రి సినిమా ఇప్పుడే రిలీజైనట్లు ఉంది: రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్!
మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావుగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని వంశీకృష్ణనాయుడు దర్శకత్వంలో.. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. 1970లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్నే ఈ చిత్రంలో చూపించనున్నారు. ఇప్పటికే ట్రైలర్, టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈవెంట్‌కు హాజరైన నటి రేణు దేశాయ్ పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. హీరో రవితేజపై ప్రశంసల వర్షం కురిపించింది. (ఇది చదవండి: రిలీజ్‌కు ముందు హైకోర్టుకు లియో మేకర్స్.. ఎందుకంటే?) రేణు దేశాయ్ మాట్లాడుతూ.. '23 ఏళ్లయినా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని చూస్తుంటే బద్రి సినిమా ఇప్పుడే రిలీజ్ అయినట్లు అనిపిస్తోంది. మీ ప్రేమకు నా దగ్గర పదాలు లేవు. ఇన్నేళ్లు నేను సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో నాకు సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చిత్రబృందానికి థ్యాంక్స్. రవితేజకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సినిమా 2019లోనే మొదలైంది. రవితేజ హీరో అని చెప్పారు. నేను వంశీని ఒక్కటే అడిగా. నేను ఈ సినిమాలో ఉన్నానా? అని. ఎందుకంటే రవితేజ పెద్ద హీరో కదా. ఈ చిత్రంలో అవకాశం రావడం నా జీవితంలో ఎంత ముఖ్యమో మీకు తెలియదు. ఈ క్షణం కోసం చాలా రోజులుగా వెయిట్ చేశా. దయచేసి మీరంతా ఈ సినిమాకు థియేటర్‌కు వెళ్లి చూడండి అంటూ అభిమానులకు రెక్వెస్ట్' చేసింది. అనంతరం ఇకపైనా కేవలం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న పాత్రలే చేస్తారని వార్తలొస్తున్నాయి నిజమేనా? కాదా? అని యాంకర్ ప్రశ్నించగా.. అలాంటిదేమి లేదని.. అవన్నీ రూమర్స్ మాత్రమేనని రేణు దేశాయ్ కొట్టిపారేసింది. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. (ఇది చదవండి: సినిమా వాళ్లపై ప్రజల్లో అలాంటి అభిప్రాయం: రాధేశ్యామ్ నటి కామెంట్స్!) -
Tiger Nageswara Rao: రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
గుడ్డిగా నమ్మేశా.. లవర్ మోసం చేశాడు: యంగ్ హీరోయిన్
రవితేజ కొత్త సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' విడుదలకు సిద్ధమైపోయింది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇకపోతే ఈ మూవీతో 'ఆదిపురుష్' ఫేమ్ కృతిసనన్ చెల్లి నుపుర్ సనన్ హీరోయిన్గా పరిచయమవుతోంది. తాజాగా ప్రచారంలో భాగంగా తన ప్రేమ-బ్రేకప్ గురించి నుపుర్ బయటపెట్టింది. ఏడ్చిన సందర్భం గురించి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: Bigg Boss Elimination: ఆమె కోసం ఈమె బలి? వారంలోనే ఆ బ్యూటీ ఎలిమినేట్!) ఎవరీ నుపుర్? కృతి సనన్ చెల్లి నుపుర్.. తొలుత 2005లో యూట్యూబర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత సింగర్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది. అక్షయ్ కుమర్‌తో రెండు ఆల్బమ్ సాంగ్స్‌లో యాక్ట్ చేసింది. అవి మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకోవడంతో నుపుర్ బాగా ఫేమస్ అయిపోయింది. అలా ఇప్పుడు రవితేజ సినిమాతో హీరోయిన్గా అదృష్టం పరీక్షించుకోబోతోంది. ఏం జరిగింది? అయితే 'టైగర్ నాగేశ్వరరావు' ప్రచారంలో భాగంగా తను అప్పట్లో ప్రేమలో మోసపోయిన విషయాన్ని నుపుర్ సనన్ బయటపెట్టింది. 'కాలేజీలో ఉన్నప్పుడు ఓ అబ్బాయిని గాఢంగా లవ్ చేశాను. కానీ తను మోసం చేస్తున్నాడని అర్థమయ్యేటప్పటికీ.. నేను అతడిని ఎంత గుడ్డిగా నమ్మేశానో అర్థమైంది. దీంతో ఏడుపు ఒక్కటే తక్కువైంది. ఇంట్లో వాళ్లకు ఎక్కడ తెలిసిపోతుందో అని బాత్రూంలో కూర్చుని మరీ గట్టిగా ఏడ్చాను. ఈ బాధ నుంచి బయటపడటానికి నెలలు పట్టింది' అని నుపుర్ గతం గురించి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో షూటింగ్లో ప్రమాదం.. ఆయన మృతి!) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) -
నువ్వు నీలా ఉండు అని చెప్పింది
రవితేజ టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహనిర్మాతగా అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో నూపుర్ సనన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఎవర్నైనా ప్రేమిస్తే వారి కోసం ఏదైనా చేయడానికి సాహసించే మార్వాడి అమ్మాయి సారా పాత్రను చేశాను. ఈ చిత్రంలో నా వేషధారణ మోడ్రన్‌గా ఉంటూనే ట్రెడిషనల్‌గా ఉంటుంది. తెలుగులో చేసిన తొలి సినిమా ‘టైగర్ నాగేశ్వర రావు’తోనే నాకు సారాలాంటి చాలెంజింగ్ రోల్ దొరకడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం దాదాపు రెండు వందల మందిని ఆడిషన్ చేశాక, ‘సారా’ పాత్రకు నన్ను ఎంపిక చేశారు వంశీగారు. సెట్స్‌లో ఆయన చెప్పినట్లు నటించాను. ప్రస్తుతం నవాజుద్దిన్ సిద్ధిఖీతో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నేను సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు ‘నువ్వు నీలా ఉండు’ అని అక్క (హీరోయిన్ కృతీ సనన్) సలహా ఇచ్చింది. ‘మిమి’ సినిమాలో అక్క నటన నాకు కన్నీళ్లు తెప్పించింది. మా అక్క తెలుగులో మహేశ్‌బాబు, ప్రభాస్, నాగచైతన్య వంటి స్టార్లతో సినిమాలు చేసింది. ఆ విధంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది’’ అని చెప్పుకొచ్చారు. -
కథ విన్నప్పుడే కన్నీళ్లొచ్చాయి
రవితేజ టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. వంశీ దర్శకత్వంలో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఈ నెల 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో గాయత్రీ భరద్వాజ్ మాట్లాడుతూ– ‘‘నా స్వస్థలం ఢిల్లీ. పుణేలో చదువుకున్నాను. మా నాన్నగారు పైలెట్. అమ్మ సైకాలజిస్ట్. నాకు చిన్నప్పట్నుంచే ఫ్యాషన్ వరల్డ్‌లో ఫేమస్ కావాలని ఉండేది. నా ఏడో తరగతిలోనే ఫ్యాషన్ ర్యాంప్ వాక్ చేసి, విజేతగా నిలిచాను. ఆ తర్వాత భరత నాట్యం, క్లాసికల్ సింగింగ్ నేర్చుకున్నాను. హిందీలో అవకాశాలు రావడంతో ఓ సినిమా, మూడు వెబ్ సిరీస్‌లు చేశాను. ‘టైగర్ నాగేశ్వరరావు’ నా తొలి తెలుగు సినిమా. నన్ను ఎంపిక చేయడానికి ముందు దాదాపు 60 మందిని ఆడిషన్ చేశారట. ఈ చిత్రంలో విలేజ్‌లో టామ్‌బాయ్‌లా కనిపించే మణి పాత్ర చేశాను. దర్శకులు వంశీగారు ఈ పాత్ర గురించి దాదాపు మూడు గంటలు వివరించారు. పాత్రలో మంచి ఎమోషన్ ఉంది. కథ వింటున్నప్పుడే కన్నీళ్లొచ్చాయి. ఈ సినిమా విషయంలో నాకు భాషాపరంగా ఏ ఇబ్బంది లేదు. నాకు తెలుగు టీచర్ ఉన్నారు. ఇక రవితేజగారు సెట్స్‌లో చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ప్రస్తుతం ఓ తెలుగు సినిమా చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నార్త్ ఇండస్ట్రీలో కాస్త హరీబరీగా ఉంటుంది. కానీ తెలుగు పరిశ్రమలో చాలా ఓర్పుతో వర్క్ చేస్తున్నారు. లభిస్తున్న గౌరవం కూడా ఎక్కువే. తెలుగు ప్రేక్షకులు కూడా సినిమాను ఎంతో ప్రేమిస్తారు’’ అని చెప్పుకొచ్చారు. -
'కొట్టేముందు.. కొట్టేసేముందు వార్నింగ్ ఇవ్వడం అలవాటు'.. మాస్ మహారాజా ట్రైలర్ అదుర్స్!
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ నుపుర్ సనన్ హీరోయిన్గా కనిపించనుంది. 1970-80ల కాలంలో స్టువర్టుపురంలోని గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని కథాంశంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రేణు దేశాయ్ కీలత పాత్ర పోషిస్తుండగా.. ఇప్పటికే ఆమెకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ చూస్తే 'గుంటూరు రైల్వే స్టేషన్.. దేవుడి పాట.. పాతికవేలు' అంటూ వేలంపాటతో మొదలైంది. 'కొట్టేముందు.. కొట్టేసేముందు వార్నింగ్ ఇవ్వడం అలవాటు' అనే రవితేజ డైలాగ్ మాస్ ఆడియన్స్‌లో మరింత ఆసక్తి పెంచుతోంది. ట్రైలర్లో పోలీసులు, టైగర్ నాగేశ్వరరావు గ్యాంగ్ చుట్టే కథ తిరగనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో రవితేజ కనిపించనున్నారు. ఈ మూవీలో గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్గా నటిస్తోంది. అక్టోబర్ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. -
రవితేజ టైగర్ నాగేశ్వరరావు.. మేకర్స్ క్రేజీ అప్డేట్!
మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. రవితేజ, నుపుర్ సనన్, గా యత్రి భరద్వాజ్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. 1970లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వంశీకృష్ణనాయుడు దర్శకత్వంలో.. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్నే ఈ చిత్రంలో చూపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను అక్టోబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇట్స్ టైమ్ టూ రోర్ అంటూ రవితేజ మాస్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫోటోలో సిగరెట్ తాగుతూ పక్కా మాస్ లుక్‌లో కనిపించారు. కాగా.. ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. It’s time to roar!#TigerNageswaraRao Trailer on OCTOBER 3rd 🔥 pic.twitter.com/hSFe65Jich — Ravi Teja (@RaviTeja_offl) September 26, 2023 -
ఏక్ దమ్ స్టెప్పులు
ఏక్ దమ్ ఎనర్జీతో స్టెప్పులేశారు రవితేజ. స్టువర్టుపురం దొంగగా చెప్పుకునే టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. వంశీ దర్శకత్వంలో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘ఏక్ దమ్... ఏక్ దమ్’ అంటూ జోష్‌గా సాగేపాట లిరికల్ వీడియోను ఈ నెల 5న విడుదల చేయనున్నట్లు వెల్లడించి,పోస్టర్‌ను విడుదల చేసింది యూనిట్. నూపుర్ సనన్‌ను రవితేజ ఆటపట్టించే సందర్భంలో ఈపాట వస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, సహనిర్మాత: మయాంక్ సింఘానియా. TIGER's Super Entertaining and Energetic Avatar for a peppy number 🤩💫#TigerNageswaraRao First Single #EkDumEkDum out on September 5th 🥁🎷 A @gvprakash musical 🎶 In cinemas from October 20th 🥷@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AAArtsOfficial @AnupamPKher pic.twitter.com/PIKO52wezZ — Tiger Nageswara Rao (@TNRTheFilm) September 1, 2023 -
నా డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ.. త్వరలోనే షూటింగ్: మంచు విష్ణు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో వచ్చిన జిన్నా చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తాజాగా మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. చాలా రోజులుగా ఈ సినిమా కథ మీద పని చేస్తున్న విష్ణు.. శ్రీ కాళహస్తిలో పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలో చిత్ర షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించారు. (ఇది చదవండి: మగధీర టైమ్‌లో చూడాలనుకున్న ప్రదేశానికి వెళ్లిన రాజమౌళి) అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాస్థాయిలో ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు హీరో విష్ణు మంచు. ఈ చిత్రానికి మోహన్ బాబు నిర్మాతగా వ్యవహిస్తున్నారు. ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. మహా భారతం సిరీస్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ఆదిపురుష్ భామ కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్గా కనిపించనుంది. పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ కథకి మెరుగులు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతమందించున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ... భక్త కన్నప్ప గొప్పతనాన్ని ఈ తరానికి కూడా తెలియజేస్తాం. త్వరలో షూటింగ్ మొదలుపెడతాం. సింగల్ షెడ్యూల్లోనే ఈ సినిమా మొత్తం కంప్లీట్ చేస్తాం. ఇండస్ట్రీలో స్టార్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో ప్రకటిస్తాం. ' అని అన్నారు. (ఇది చదవండి: ముక్కు అవినాశ్ భార్య సీమంతం ఫంక్షన్లో సోహైల్ రచ్చ..) -
టైగర్ నాగేశ్వరరావుని పట్టుకునేందకు ఎంట్రీ ఇచ్చిన అనుపమ్ ఖేర్
ఐబీ ఆఫీసర్ (ఇంటెలిజెన్స్ బ్యూరో) రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా చార్జ్ తీసుకున్నారు అనుపమ్ ఖేర్. టైగర్ నాగేశ్వరరావుని పట్టుకునే మిషన్ విషయంలో రాఘవేంద్ర ఎలాంటి ప్లాన్స్ వేశారు? అనేది ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో చూడాల్సిందే. రవితేజ టైటిల్ రోల్లో వంశీ దర్శకత్వంలో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ చేస్తున్న కీలక పాత్ర అయిన ఐబీ ఆఫీసర్ రాఘవేంద్ర రాజ్‌పుత్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘టైగర్ నాగేశ్వరరావు’టీజర్‌ను ఈ నెల 17న విడుదల చేయనున్నాం. అలాగే ఈ మూవీని అక్టోబర్ 20న రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.