Manchu Vishnu New Movie Bhaktha Kannappa Announced In Sri Kalahasthi, Deets Inside - Sakshi
Sakshi News home page

Manchu Vishnu Bhaktha Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదే.. త్వరలోనే షూటింగ్!

Published Fri, Aug 18 2023 3:18 PM | Last Updated on Fri, Aug 18 2023 3:40 PM

Manchu Vishnu Announces New Movie Bhaktha Kannappa In Sri Kalahasthi - Sakshi

టాలీవుడ్ హీరో మంచు విష్ణు కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు  రాబోతున్నాడు. గతంలో వచ్చిన జిన్నా చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తాజాగా మంచు విష్ణు  తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు.  తాజాగా ఈ చిత్రానికి సంబంధించి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. చాలా రోజులుగా ఈ సినిమా కథ మీద పని చేస్తున్న విష్ణు..  శ్రీ కాళహస్తిలో పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు.  త్వరలో చిత్ర షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించారు. 

(ఇది చదవండి: మగధీర టైమ్‌లో చూడాలనుకున్న ప్రదేశానికి వెళ్లిన రాజమౌళి)

అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాస్థాయిలో ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు హీరో విష్ణు మంచు. ఈ చిత్రానికి  మోహన్ బాబు నిర్మాతగా వ్యవహిస్తున్నారు. ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. మహా భారతం సిరీస్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్‌లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ఆదిపురుష్ భామ కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్‌గా కనిపించనుంది.   పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ కథకి మెరుగులు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతమందించున్నారు.

ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ...  భక్త కన్నప్ప  గొప్పతనాన్ని ఈ తరానికి కూడా తెలియజేస్తాం. త్వరలో షూటింగ్ మొదలుపెడతాం. సింగల్ షెడ్యూల్‌లోనే ఈ సినిమా మొత్తం కంప్లీట్ చేస్తాం. ఇండస్ట్రీలో స్టార్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో ప్రకటిస్తాం. ' అని అన్నారు.

(ఇది చదవండి:  ముక్కు అవినాశ్‌ భార్య సీమంతం ఫంక్షన్‌లో సోహైల్‌ రచ్చ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement