ఐబీ ఆఫీసర్ (ఇంటెలిజెన్స్ బ్యూరో) రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా చార్జ్ తీసుకున్నారు అనుపమ్ ఖేర్. టైగర్ నాగేశ్వరరావుని పట్టుకునే మిషన్ విషయంలో రాఘవేంద్ర ఎలాంటి ప్లాన్స్ వేశారు? అనేది ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో చూడాల్సిందే.
రవితేజ టైటిల్ రోల్‌లో వంశీ దర్శకత్వంలో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ చేస్తున్న కీలక పాత్ర అయిన ఐబీ ఆఫీసర్ రాఘవేంద్ర రాజ్‌పుత్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘టైగర్ నాగేశ్వరరావు’టీజర్‌ను ఈ నెల 17న విడుదల చేయనున్నాం. అలాగే ఈ మూవీని అక్టోబర్ 20న రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment