IB officer
-
టైగర్ నాగేశ్వరరావుని పట్టుకునేందకు ఎంట్రీ ఇచ్చిన అనుపమ్ ఖేర్
ఐబీ ఆఫీసర్ (ఇంటెలిజెన్స్ బ్యూరో) రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా చార్జ్ తీసుకున్నారు అనుపమ్ ఖేర్. టైగర్ నాగేశ్వరరావుని పట్టుకునే మిషన్ విషయంలో రాఘవేంద్ర ఎలాంటి ప్లాన్స్ వేశారు? అనేది ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో చూడాల్సిందే. రవితేజ టైటిల్ రోల్లో వంశీ దర్శకత్వంలో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ చేస్తున్న కీలక పాత్ర అయిన ఐబీ ఆఫీసర్ రాఘవేంద్ర రాజ్‌పుత్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘టైగర్ నాగేశ్వరరావు’టీజర్‌ను ఈ నెల 17న విడుదల చేయనున్నాం. అలాగే ఈ మూవీని అక్టోబర్ 20న రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
ఇంటలిజెన్స్ అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: బిజేపీ రాష్ట్ర కార్యాలయంలో వచ్చిన ఇంటలిజెన్స్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. బిజేపీ కార్యాలయంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. ‘ఫోన్ లు ట్యాప్ చేస్తున్నది సరిపోవడం లేదా ? కార్యాలయంలోపలికి వస్తే బాగోదు. ప్రగతి భవన్, తెలంగాణ భవన్లో ఐబీ వాళ్ళను పెడతా.. ఒప్పుకుంటారా ? అక్కడ ఒప్పుకుంటే.. ఇక్కడ రాష్ట్ర ఇంటలిజెన్స్ వారికి పార్టీ కార్యాలయంలో ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేయిస్తా’ అని తీవ్రంగా మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇదీ చదవండి: అబద్ధాలపై క్షమాపణ కోరే ధైర్యం కూడా లేదు.. కిషన్‌రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం -
Hyderabad: స్టేజీపై నుంచి పడి ఇంటెలిజెన్స్ ఏడీ దుర్మరణం
సాక్షి, హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన కోసం ముందస్తు భద్రతా తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు స్టేజీపై నుంచి జారిపడి ఇంటెలిజెన్స్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. స్థానిక సీఐ రవీంద్ర ప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బీహార్‌లోని పాట్నాకు చెందిన కుమార్ అమరేష్(51) కోఠిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఐబీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 20న దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పుస్తక ఆవిష్కరణ మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరుకానున్నారు. చదవండి: (ప్రియురాలికి హాయ్ చెప్పాడని.. మరోసారి వీడు నీ జోలికి రాడంటూ) ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతా తనిఖీల్లో భాగంగా బుధవారం ఐబీ అధికారులు శిల్పకళా వేదికకు వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సెల్ఫోన్లో వీడియో చిత్రీకరిస్తున్న కుమార్ అమరేష్ స్టేజీపై నుంచి 12 అడుగుల లోతులో ఉన్న మెయింటెనెన్స్ డెక్ మెట్లపై పడ్డారు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన అతడిని సమీపంలో మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిన ఆయన పరిస్థితి విషమించడంతో సాయంత్రం 7 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బదిలీపై నాలుగు సంవత్సరాల కిందట హైదరాబాద్‌కు వచ్చిన కుమార్ అమరేష్‌కు కొద్ది నెలల క్రితమే డిప్యూటీ డైరెక్టర్ నుంచి అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (పుట్టిన రోజున ముస్తాబై.. సాయంత్రం బర్త్ డే పార్టీ ఇస్తానని..) -
ఈశాన్య ఢిల్లీ అల్లర్లు.. మృతులు 45
న్యూఢిల్లీ: వారం క్రితం అల్లర్లు జరిగిన ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే, సోమవారం అల్లర్లు జరిగిన ప్రాంతంలో మరో నాలుగు మృతదేహాలు బయటపడటంతో మృతుల సంఖ్య 45కు చేరుకుందని అధికారులు తెలిపారు. అల్లర్ల కారణంగా వాయిదాపడిన సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలను సోమవారం పటిష్ట బందోబస్తు మధ్య నిర్వహించారు. 98 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాపింప జేస్తున్న 40 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంకిత్‌శర్మ కుటుంబానికి రూ.కోటి సాయం అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ కుటుంబానికి రూ.కోటి పరిహారంగా అందజేయనున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పిస్తామన్నారు. అల్లర్లపై రేపు సుప్రీం విచారణ ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన పిటిషన్లపై 4న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. రాజకీయ నాయకులు, ఇతరుల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల అల్లర్లు జరిగాయని, వారిపై ఎఫ్ఐఆర్లు నమోదుచేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు ఈ వ్యవహారాన్ని నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. దీనిపై పిటిషన్‌దారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘అల్లర్ల కారణంగా ప్రజలు చనిపోతుంటే వాయిదా ఎలా వేయగలరు ?’ అంటూ పిటిషన్‌దారుల తరఫున లాయర్ కోలిన్ గొంజాల్వెజ్ సుప్రీంకోర్టును అడిగారు. అయితే అల్లర్లను నియంత్రించడం తమ పని కాదని, దానికి కార్యనిర్వాహక వ్యవస్థ ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది. బుధవారం విచారణ జరుపుతామని తెలిపింది. -
అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు
-
ఐబీ అధికారి హత్య : గంటల తరబడి అరాచకం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లలో హత్యకు గురైన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. శర్మ శరీరంలో పలుచోట్ల గాయాలయ్యాయని, పదునైన ఆయుధంతో శరీరంలోపల చాలా లోతుగా కోతకు గురైందని, ఆయనను పలుమార్లు కిరాతకంగా కత్తిపోట్లకు గురిచేయడంతో మరణానికి దారితీసిందని అటాప్సీ నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. ఐబీలో 2017 నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అంకిత్ శర్మ కార్యాలయం నుంచి ఇంటికి వెళుతుండగా చాంద్‌బాగ్‌లో అల్లరిమూకలు ఆయనను పాశవికంగా హత్య చేసి మృతదేహాన్ని డ్రైనేజ్‌లో పడవేసివెళ్లినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కాగా, ఢిల్లీ అల్లర్లలో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 38కి చేరింది. చదవండి : ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ -
ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి కిడ్నాప్.. ఆపై హత్య
న్యూఢిల్లీ : ఇంటెలిజెన్స్ బ్యూరోకి చెందిన ఓ యువ అధికారి తిరుగుబాటుదారుల చేతిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన మేఘాలయలోని దక్షిణ గరో కొండల్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి హోదాలో ఇటీవలే నియామకమైన అధికారి వికాస్ కుమార్ హత్యకు గురైనట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. గురువారం నాడు ఓ టాటాసుమోలో వచ్చిన దుండగులు హత్యకు గురైన అధికారితో పాటు మరో వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం కిడ్నాపైన ఐబీ అధికారి వికాస్ కుమార్ మృతదేహాన్ని కనుగొన్నట్లు సమాచారం. మరో వ్యక్తికి సంబంధించిన విషయాలు ఇంకా తెలియరాలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు మేఘాలయాలోని ఏఎస్ఏసీ గ్రూప్ కు చెందిన మిలిటెంట్లు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు.