ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి కిడ్నాప్.. ఆపై హత్య | IB officer kidnapped and killed by insurgents in Meghalaya | Sakshi
Sakshi News home page

ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి కిడ్నాప్.. ఆపై హత్య

Published Fri, Sep 25 2015 10:30 PM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM

IB officer kidnapped and killed by insurgents in Meghalaya

న్యూఢిల్లీ : ఇంటెలిజెన్స్ బ్యూరోకి చెందిన ఓ యువ అధికారి తిరుగుబాటుదారుల చేతిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన మేఘాలయలోని దక్షిణ గరో కొండల్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి హోదాలో ఇటీవలే నియామకమైన అధికారి వికాస్ కుమార్ హత్యకు గురైనట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. గురువారం నాడు ఓ టాటాసుమోలో వచ్చిన దుండగులు హత్యకు గురైన అధికారితో పాటు మరో వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసిన విషయం విదితమే.

ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం కిడ్నాపైన ఐబీ అధికారి వికాస్ కుమార్ మృతదేహాన్ని కనుగొన్నట్లు సమాచారం. మరో వ్యక్తికి సంబంధించిన విషయాలు ఇంకా తెలియరాలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు మేఘాలయాలోని ఏఎస్ఏసీ గ్రూప్ కు చెందిన మిలిటెంట్లు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement