
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లలో హత్యకు గురైన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. శర్మ శరీరంలో పలుచోట్ల గాయాలయ్యాయని, పదునైన ఆయుధంతో శరీరంలోపల చాలా లోతుగా కోతకు గురైందని, ఆయనను పలుమార్లు కిరాతకంగా కత్తిపోట్లకు గురిచేయడంతో మరణానికి దారితీసిందని అటాప్సీ నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. ఐబీలో 2017 నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అంకిత్ శర్మ కార్యాలయం నుంచి ఇంటికి వెళుతుండగా చాంద్‌బాగ్‌లో అల్లరిమూకలు ఆయనను పాశవికంగా హత్య చేసి మృతదేహాన్ని డ్రైనేజ్‌లో పడవేసివెళ్లినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కాగా, ఢిల్లీ అల్లర్లలో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 38కి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment