సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆప్ మాజీ కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ అంకిత్‌శర్మతో పాటు 50మంది చావుకు కారణమైన ఢిల్లీ అల్లర్లతో హుస్సేన్‌కు సంబంధం ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక నేరాలను విచారిస్తున్న సెంట్రల్ ఏజెన్సీ దీనిపై ఢిల్లీ కోర్టుకు ఆధారాలు సమర్పించింది. అమిత్‌గుప్తాతో కలిసి హుస్సేన్ అనేక ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు వివరించింది. నకిలీ కంపెనీలను సృష్టించి రూ. 1.10కోట్లకు పైగా రాయితీలు పొందటంతో పాటు చీటింగ్, డాక్యుమెంట్ల ఫోర్జరీ వంటి అనేక మోసాలకు పాల్పడినట్టు పేర్కొంది. చదవండి: (అంకిత్ శర్మ హత్య కేసు : ఆప్ నేతపై అనుమానాలు..!)
Comments
Please login to add a commentAdd a comment