postmartam report
-
ఫిలిప్పీన్స్‌లో మణికాంత్‌రెడ్డి మృతి.. పోస్టుమార్టం రిపోర్టు ఇదే..
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం రాంలింగంపల్లి గ్రామానికి చెందిన వైద్య విద్యార్థి గూడూరు మణికాంత్‌రెడ్డి (21) మృతికి కార్డియాక్ అరెస్టే (గుండె ఆగిపోవడం) కారణమని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. మణి కాంత్‌రెడ్డి వైద్య విద్యను అభ్యసించడానికి ఫిలి ప్పీన్స్‌కి వెళ్లి అక్కడ ఈ నెల 23న ఉదయం అను మానాస్పదస్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా.. మణికాంత్ మృతదేహానికి అక్కడి వైద్యులు బుధవారం పోస్టుమార్టం నిర్వహించగా కార్డియాక్ అరెస్ట్‌తోనే మృతిచెందినట్టు తేలిందని, ఈ మేరకు అక్కడి అధికారుల నుంచి సమాచారం వచి్చందని మృతుడి బంధువులు తెలిపారు. మణికాంత్‌రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు అ«ధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతదేహం హైదరాబాద్‌కు రానుందని తెలిసింది. ఇది కూడా చదవండి: ప్రేమ విఫలమైందని సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న జవాన్! -
ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నాం: తండ్రి నరేందర్
సాక్షి, వరంగల్: కేఎంసీ మెడికో ప్రీతి మృతి విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయంటూ మొదటి నుంచి చెబుతూ వస్తున్న ఆమె కుటుంబ సభ్యులు.. తాజాగా ఇవాళ మరో ప్రకటన చేశారు. ఆమెది ఆత్మహత్యేనని నమ్ముతున్నట్లు ప్రీతి తండ్రి నరేందర్ మీడియా ముందు ప్రకటించారు. వరంగల్ సీపీతో భేటీ అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రీతి మృతి కేసులో పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆధారంగా ఆమెది ఆత్మహత్యేనని శుక్రవారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. వారం, పదిరోజుల్లో ఛార్జ్‌షీట్ వేయనున్నట్లు కూడా తెలిపారాయన. అయితే.. ఈ ప్రకటన తర్వాత కూడా ప్రీతి మృతిపై కుటుంబ సభ్యులు పాత మాటే చెప్పుకొచ్చారు. కానీ, శనివారం ప్రీతి తండ్రి నరేందర్, సోదరుడు పృథ్వీ వరంగల్ సీపీ రంగనాథ్‌ను కలిశారు. ప్రీతి మృతిపై వాళ్ల అనుమానాలను ఆయన నివృత్తి చేసినట్లు తెలుస్తోంది. అనంతరం బయటకు వచ్చిన వాళ్లు.. మీడియాతో మాట్లాడారు. ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నాం. ఛార్జ్‌షీట్‌లో ఇంకా కొందరి పేర్లు చేరుస్తామని సీపీ చెప్పారు. కేఎంసీ ప్రిన్సిపాల్, హెచ్‌వోడీల బాధ్యతా రాహిత్యం ఉందని భావిస్తున్నాం అని ప్రీతి తండ్రి నరేందర్ మీడియాకు తెలిపారు. ప్రీతి మృతికి కారణమైన సిరంజీ దొరికింది. ఆమె శరీరంలో విష పదార్థాలు ఉన్నట్లు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో వచ్చిందని సీపీ మాతో అన్నారు. రిపోర్ట్ మాత్రం చూపించలేదు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలని మేం కోరాం అని ప్రీతి తండ్రి నరేందర్ తెలిపారు. -
ఇందు మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు : బాలిక తండ్రి
-
వీడు అసలు మనిషేనా! ఎముకలు విరిగేంత బలంగా 15 కత్తిపోట్లు..
తన ప్రేమను కాదందన్న అక్కసుతో మానవ మృగంలా మారిపోయి యువతిని దారుణంగా హతమార్చాడో దుర్మార్గుడు. కత్తిలో నరికి అత్యంత దారుణంగా అమాయకురాలిని పొట్టన పెట్టుకున్నాడు. ఉన్మాదిలా మారి తమ కూతురి ప్రాణం బలిగొన్న రాక్షసుడిని ఉరి తీయాలని హతురాలి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ క్రైం: ప్రేమోన్మాది గుబ్బల వెంకట సూర్యనారాయణ చేతిలో హతమైన కాదా దేవికపై జరిగిన దాడి అత్యంత పాశవికమైనదని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. కాకినాడ జీజీహెచ్‌లో దేవిక మృతదేహానికి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారి నివేదిక ప్రకారం.. దేవికను నిందితుడు కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో ఆమె ముఖం, మెడ భాగాల్లో లోతైన గాట్లు పడ్డాయి. సూర్యనారాయణ ఆమె కాలర్ బోన్లో కత్తి దింపి ఎడమ వైపునకు చీల్చేశాడు. రెండువైపులా నరకడంతో మెడలోని రక్తనాళాలు పూర్తిగా తెగిపోయాయి. దేవిక మరణానికి అదే కారణమని గుర్తించారు. విచక్షణారహితంగా కత్తితో పొడుస్తూండటంతో దేవిక రెండు చేతులూ అడ్డం పెట్టి రక్షించుకునే ప్రయత్నం చేసింది. అయితే అంతకు మించిన బలంతో అతడు కత్తితో పొడవడంతో దేవిక రెండు మోచేతుల పైభాగాల్లో లోతైన గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె ఎడమ చేతి ఎముకను సత్యనారాయణ నరికేశాడు. ఆమె రెండు భుజాలు శరీరం నుంచి వేరు పడ్డాయి. ఎడమ భుజానికి ఆధారమైన హ్యూమరస్ ఛిద్రమైంది. అక్కడి ఎముకలో సైతం కత్తి దిగింది. కత్తి నేరుగా మెడలో దించిన ఆనవాళ్లున్నాయి. దేవిక శరీరంలో మొత్తం 15 బలమైన గాయాలున్నట్టు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. ఆ రాక్షసుడిని ఉరి తీయాలి చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం చేసుకుంటుందనుకుంటే ఇలా దారుణంగా హత్యకు గురవుతుందని ఊహించలేదని దేవిక కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. తమ వద్దే పెరిగి, చదువుకుంటోందని, ఉద్యోగం వస్తే కళ్లలో పెట్టుకుని చూసుకుంటుందని అనుకుంటే దేవుడు అన్యాయం చేశాడంటూ దేవిక అమ్మమ్మ బోరున రోదించింది. అమ్మమ్మ వద్ద ఉండి చదువుకుంటుందని హైదరాబాద్‌లో తాము నిశ్చింతగా ఉంటే కిరాతకుడి చేతిలో తమ కూతురు బలైపోయిందని దేవిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమార్తెని హత్య చేసిన రాక్షసుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. (క్లిక్: ప్రేమోన్మాది ఘాతుకం.. పట్టపగలే నడిరోడ్డుపై కిరాతకం) దేవిక కుటుంబానికి ప్రభుత్వం అండ: మంత్రి చెల్లుబోయిన వేణు రామచంద్రపురం/కె.గంగవరం: ప్రేమోన్మాది చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురైన కాదా దేవిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడి ఆదుకుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. కరప మండలం కూరాడలో హత్యకు గురైన కాదా దేవిక తల్లిదండ్రులను, ఇతర కుటుంబ సభ్యులను మంత్రి వేణు కె.గంగవరంలో ఆదివారం సాయంత్రం పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ ఆటవికంగా హత్యకు పాల్పడిన హంతకుడిపై ప్రభుత్వం తర్వతగతిన విచారణ పూర్తి చేసి కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయాలు ప్రస్తావించకూడదని, ప్రతి ఒక్కరూ ఇలాంటి దుశ్చర్యలను ఖండించాలన్నారు. ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. రామచంద్రపురం ఎంపీపీ అంబటి భవాని, కె.గంగవరం మండల విప్ కొప్పిశెట్టి లక్ష్మణ్, శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు నరాల ఏడుకొండలు, వైఎస్సార్సీపీ నాయకుడు పంపన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
రిసెప్షనిస్ట్ హత్య కేసులో మరో ట్విస్ట్.. పోస్ట్‌మార్టం నివేదికలో ఏముంది?
దేహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్, 19ఏళ్ల యువతి హత్య కేసు రాజకీయంగా దుమారానికి దారితీసింది. ఈ కేసులో బహిష్కృత భాజపా నేత కుమారుడు, రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్య, ఇద్దరు సిబ్బందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య కేసులో మరో కీలక విషయం బయటకు వచ్చింది. హత్యకు ముందు యువతిపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లేవని పోస్ట్‌మార్టం నివేదికలో తేలినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఆమె వేళ్లు, చేతులు, వీపు భాగాల్లో గాయాలైనట్లు గుర్తులు కనిపించినట్లు పేర్కొన్నాయి. ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే దిశగా చర్యలు చేపట్టారు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించనున్నట్లు చెప్పారు. అలాగే మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. అంకిత తండ్రితో సీఎం మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఈ కేసు విచారణను వేగంగా జరిపించి నిందితులకు కఠినశిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మరునాడే పరిహారం ప్రకటించారు. ఇదీ కేసు.. భాజపా బహిష్కృత నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యకు రిషికేశ్‌లో రిసార్టు ఉంది. అందులో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోన్న 19 ఏళ్ల యువతి ఇటీవలే హత్యకు గురైంది. కొద్దిరోజుల తర్వాత అక్కడికి దగ్గర్లోని కాలువలో ఆమె మృతదేహం లభించింది. రిసార్టుకు వచ్చే అతిథులకు ఆమె ‘ప్రత్యేక’ సేవలు చేసేందుకు నిరాకరించినందుకే పుల్కిత్, మరో ఇద్దరు సిబ్బంది ఆమెను హత్యచేసినట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు పోలీసులు. తనను వ్యభిచార కూపంలోకి లాగేందుకు యత్నిస్తున్నారని వాట్సాప్‌లో స్నేహితుడితో ఆమె మొరపెట్టుకున్న స్క్రీన్ షాట్లు, ఓ ఫోన్ కాల్ వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదీ చదవండి: Uttarakhand: రిసెప్షనిస్ట్ అంకిత కుటుంబానికి రూ.25లక్షల ఆర్థిక సాయం -
నటి సౌజన్యది ఆత్మహత్యే.. పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి
Kannada Tv Actress Soujanya Death By Suicide: నటి సౌజన్యది ఆత్మహత్యగా వైద్యుల నివేదికలో వెల్లడైంది. గతనెల 30న ఆమె అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. దీంతో ఆమె తండ్రి తన కుమార్తెను హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె స్నేహితుడు వివేక్‌ను విచారించారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. చదవండి: కన్నడ హాస్యనటుడు మృతి.. ప్రముఖుల సంతాపం -
యువనటి ఆత్మహత్య కేసులో ట్విస్టు.. నటుడు వివేక్‌పై ఆరోపణలు
శివాజీనగర్ (కర్ణాటక): బుల్లితెర నటి సౌజన్య ఆత్మహత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. నటుడు వివేక్ ప్రేమ, పెళ్లిపేరుతో వేధించడం వలన తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తండ్రి ప్రభు మాదప్ప ఆరోపించాడు. నటుడు వివేక్, అసిస్టెంట్ మహేశ్‌లపై కుంబళగోడు పోలీస్‌స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. కాగా, తన కూతురు అమాయకురాలని,ఎలాంటి తప్పు చేయలేదని తెలిపాడు. తన కూతురు దగ్గర ఉన్న బంగారం,డబ్బులు కనిపించడంలేదని ఫిర్యాదులో ప్రభు మాదప్ప పేర్కొన్నాడు. ఈ మేరకు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితుడికి ఒక సంవత్సరం నుంచి తన కూతురితో పరిచయం ఉందని తెలిపాడు. తన కూతురిని ప్రేమించాలని వేధించాడని చెప్పుకొచ్చాడు. కాగా, పోలీసులు వచ్చేలోగా ఘటనా స్థలం నుంచి తన కూతురి మృత దేహన్ని నిందితుడు మార్చాడని ఆరోపించాడు. ఆమె మొబైల్ కూడా కనిపించడం లేదని తెలిపాడు. మొబైల్ దొరికితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నాడు. ఇక ఈ ఆరోపణలపై నటుడు వివేక్ స్పందిస్తూ.. ఇప్పుడు తానేమి చెప్పలేనని అన్నాడు. నటి సౌజన్య తనకు.. ఏడాదిగా తెలుసని అన్నాడు. ఆమె చాలా అమాయకురాలని అన్నాడు. సౌజన్య.. ఒత్తిడికి గురైనప్పుడల్లా తనబాధను నాతో చెప్పుకునేదని వివేక్ పేర్కొన్నాడు. మరోవైపు సౌజన్య గదిలో లభించిన నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో ఆమె తన మానసిక స్థితి బాగాలేదని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసింది. ఇక ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర విచారణను వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని సూచించారు. కాగా, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. చదవండి: Actress Soujanya : విషాదం.. సూసైడ్ నోట్ రాసి యువనటి ఆత్మహత్య -
సుశాంత్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి
ముంబై: ముంబైలోని బాంద్రా అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ పూర్తైంది. అతనికి పోస్ట్‌మార్టమ్ చేసిన డా. ఆర్ఎన్ కూపర్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రి వైద్యులు సోమవారం పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికను విడుదల చేశారు. సుశాంత్‌ది ఆత్మహత్యగానే ధృవీకరించారు. అయితే అవయవాల్లో విషపూరితాలు ఉన్నాయో లేదో పరీక్షించేందుకు నటుడి అవయవాలను జేజే ఆసుపత్రికి తరలించారు. కాగా 34 ఏళ్ల వయసులోనే సుశాంత్ తన నివాసంలో ఆదివారం ఉరి వేసుకున్న విషయం తెలిసిందే. అతని ఇంట్లో ముంబై పోలీసులు యాంటీ డిప్రెషన్ మందులను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదు. మరోవైపు ఆయన మరణంపై చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. (సుశాంత్ మృతిపై అనుమానం: సీబీఐ విచారణ) నేడు నటుడి అంత్యక్రియలు జరగగనుండగా.. సుశాంత్ కుటుంబీకులు వారి స్వస్థలమైన పాట్నా నుంచి ముంబైకు పయనమయ్యారు. ఇదిలా వుండగా రెండేళ్లు థియేటర్ ఆర్టిస్ట్‌గా కొనసాగిన సుశాంత్ "కిసీ దేశ్ మే హై మేరా దిల్" సీరియల్‌తో బుల్లితెరపై తెరంగ్రేటం చేశాడు. అనంతరం "కాయ్ పో చె" (2013) చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. అలా ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘పీకే’, ‘డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి" చిత్రాలు నటుడిగా అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా చేసిన ‘ఎం.ఎస్. ధోనీ’తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆయన చివరిసారిగా "చిచోర్" చిత్రంలో కనిపించాడు. (సుశాంత్‌సింగ్ ఆత్మహత్య) -
ఐబీ అధికారి హత్య : గంటల తరబడి అరాచకం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లలో హత్యకు గురైన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. శర్మ శరీరంలో పలుచోట్ల గాయాలయ్యాయని, పదునైన ఆయుధంతో శరీరంలోపల చాలా లోతుగా కోతకు గురైందని, ఆయనను పలుమార్లు కిరాతకంగా కత్తిపోట్లకు గురిచేయడంతో మరణానికి దారితీసిందని అటాప్సీ నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. ఐబీలో 2017 నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అంకిత్ శర్మ కార్యాలయం నుంచి ఇంటికి వెళుతుండగా చాంద్‌బాగ్‌లో అల్లరిమూకలు ఆయనను పాశవికంగా హత్య చేసి మృతదేహాన్ని డ్రైనేజ్‌లో పడవేసివెళ్లినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కాగా, ఢిల్లీ అల్లర్లలో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 38కి చేరింది. చదవండి : ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ -
ఆ బాలికపై లైంగికదాడి జరగలేదు..!
భువనేశ్వర్ : ఒడిశాలోని నవరంగపూర్ జిల్లాలోని కొశాగుమడలో వారం రోజుల క్రితం ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకిత్తించిన విషయం తెలిసిందే. గ్రామ శివారులో బాలిక మృతదేహం, దాని పక్కనే చెప్పులు పడి ఉండడంపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడి, అనంతరం ఆమెను హత్య చేసి ఉంటారన్న ఆరోపణలు వినిపించాయి. ఇదే విషయంపై పలు స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాల నేతలు, కాంగ్రెస్, బీజేపీలు నిరసన వ్యక్తం చేశాయి. (పరువు కోసం.. భర్తకు పెళ్లి చేసిన భార్య) ఇంతవరకు ఆ సంఘటనకు సంబంధించి నిందితులను పట్టుకోకపోవడంపై పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలో బాలిక హత్య ఉదంతంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. అసలు ఆ బాలికపై ఎటువంటి లైంగికదాడి జరగలేదని పోస్టుమార్టం రిపోర్టు స్పష్టం చేసింది. సరిగ్గా రెండు రోజుల క్రితం దక్షిణ పశ్చిమ ఒడిశా డీఐజీ బాధిత గ్రామంలో పర్యటించి, బాలిక కుటుంబ సభ్యులను కలిసి, పరామర్శించారు. అనంతరం ఆ బాలిక పోస్టుమార్టం రిపోర్టు చదివి, వినిపించారు. బాలికపై లైంగికదాడి జరగలేదని, కానీ హత్య మాత్రం జరిగిందని తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుని, శిక్షిస్తామని అన్నారు. ఈ విషయం విన్న అనంతరం బాధిత కుటుంబ సభ్యులు మాఘోరో అధ్యక్షురాలు కాదంబినీ త్రిపాఠిని కలిసి, తమ గోడును విన్నవించుకున్నారు. -
అందని పోస్ట్‌మార్టం రిపోర్టు
చిత్తూరు, శ్రీకాళహస్తి : ఏర్పేడు మండలం రాజులకండ్రిగలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమై 48గంటలు గడిచినా పోస్ట్‌మార్టం నివేదిక రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నివేదిక ఎందుకు ఆలస్యమవుతుందో ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు. రిపోర్ట్ వస్తేగాని కేసును వేగవంతం చేయలేమని పోలీసులు బాహాటంగానే చెబుతున్నారు. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్ల పురెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆయన భార్య బుజ్జమ్మ, బిడ్డలు భవ్య, నిఖిల్ ఎందుకు చనిపోయారో అంతుపట్టక అటు కుటుంబ సభ్యులు, ఇటు గ్రామస్తులు తలలు పట్టుకుంటున్నారు. అప్పుల బాధతో మృతి చెందారా లేదా గీజర్ గ్యాస్ లీకై ఏర్పడిన ప్రమాదంతో చనిపోయారా..లేదా మరేమైనా కారణాలు ఉన్నాయా అనేది మిస్టరీగా మారింది. ఘటనకు రెండు రోజుల క్రితం మనవరాలు భవ్య తమ తాత బలరామరాజుకు ఫోన్ చేసి ‘తాతయ్య నాకు చాలా భయంగా ఉంది... నాన్న చనిపోదామని చెబుతున్నారు’ అంటూ రోదించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కుమార్తె బుజ్జమ్మ కూడా తండ్రితో అదే విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అప్పుల వేధింపులతోనే ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి పాపానాయుడుపేటలో చిన్నపాటి అద్దె గదిలో కాపురం ఉండేవాడు. పెద్ద మొత్తంలో చీటీలు వేసి, వాటిని ముందే పాడేసి ఆ డబ్బుతో ఇంటిస్థలం కొనుగోలు చేయడమేగాక ఇల్లు కట్టడానికి పెద్దమొత్తంలో అప్పులు చేసినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఆటో ద్వారా వచ్చే ఆదా యం తగ్గిపోవడంతో ప్రతినెలా చీటీలకు నగదు చెల్లించలేకపోయాడని, ఈ క్రమంలో కొత్త అప్పులు చేసేవాడని చెబుతున్నారు. కొందరు తమ బాకీలు వెంటనే చెల్లించాలని పట్టుపట్టడంతో దిక్కుతోచని స్థితిలో శ్రీనివాసులురెడ్డి సక్రమంగా ఇంటికి రావడం మానేశాడని... వచ్చినా ముభా వంగా ఉండేవాడని అంటున్నారు. ఈ క్రమంలోనే భార్యాబిడ్డలు భయంతో బలరామరాజుకు సమాచారం ఇచ్చారని చర్చించుకుంటున్నారు. అప్పుల బాధ భరించలేక శ్రీనివాసులురెడ్డి గీజర్ గ్యాస్ పైపుల లీకేజీతో ఆత్మహత్యకు పాల్పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో అధికారులు నివేదికలు అర్బన్ ఎస్పీ అన్బురాజన్‌కు అందజేయనున్నారు. దాంతో వాస్తవాలు వెలుగుచూడనున్నాయి. ప్రస్తుతానికి పోలీసులు శ్రీనివాసులురెడ్డి ఇంటికి తాళం వేసి ఉంచారు. -
వాళ్లది ఆత్మహత్య కాదు.. హత్యే!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో చనిపోవడంపై వారి బంధువులు స్పందించారు. తమ కుటుంబం ఆత్మహత్య చేసుకోలేదని, వారిని చంపేశారని మృతుల్లో ఒకరైన నారాయణ్ దేవీ భాటియా కుమార్తె సుజాత ఆరోపించారు. ‘ప్రతి రెండ్రోజులకు ఓసారి నేను మా అమ్మతో మాట్లాడేదాన్ని. అందరూ ఆనందంగా ఉన్నారు. కుటుంబంలో ఎవ్వరూ బాబాలను నమ్మరు.మీడియా అసత్యాలను ప్రచారం చేస్తూ, మా కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారని తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది’ అని మండిపడ్డారు. ఊపిరాడకే చనిపోయారు.. చనిపోయిన 11 మందిలో 8 మంది ఊపిరాడకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని పోస్ట్‌మార్టంలో తేలినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మృతులకు పోస్ట్‌మార్టం కొనసాగుతోందని పేర్కొన్నారు. మృతుల శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వెల్లడించారు. మోక్షం పొందేందుకే.. మోక్షం పొందేందుకు ఎలా ప్రాణత్యాగం చేయాలన్నదానిపై చేతిరాతతో ఉన్న కాగితాలు బాధితుల ఇంట్లో లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. రెండు రిజిస్టర్లలో లభ్యమైన ఈ కాగితాల్లో ‘మోక్షం పొందాలంటే దీన్ని మంగళ, గురు, శనివారాల్లోనే పాటించాలి. ఆ రోజు ఇంట్లో భోజనం వండకూడదు. మిగతా కుటుంబ సభ్యులు ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకునేంతవరకూ ఒకరు పర్యవేక్షించాలి. వాస్తవానికి ఈ బలిదానంతో చనిపోరు. వాళ్లను దేవుడు కాపాడతాడు.’ అని ఉంది. ఈ కుటుంబం బాధ్ తపస్యా అనే విధానాన్ని ఆచరించి ఆత్మహత్య చేసుకుందని ఇంట్లో దొరికిన రిజిస్టర్లను బట్టి తేలిందన్నారు. వీరందరూ మర్రిచెట్టు ఊడల నిర్మాణం తరహాలో ఒకేచోట తాళ్లతో ఉరివేసుకున్నారని వెల్లడించారు. 2015 నుంచి ఈ కుటుంబం తాంత్రిక క్రతువుల్ని నిర్వహించినట్లు రిజిస్టర్లను బట్టి తెలుస్తోందన్నారు. -
గుండె సమస్యతోనే జస్టిస్ లోయా మృతి
నాగ్‌పూర్: గుండె ధమనుల పనితీరు దెబ్బతినడంతోనే జస్టిస్ బ్రిజ్గోపాల్ హర్కిషన్ లోయా మృతి చెందారని పోస్ట్‌మార్టం నివేదికను ఉటంకిస్తూ ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. నాగ్‌పూర్ ప్రభుత్వ వైద్యకళాశాల, ఆస్పత్రి అందించిన ఈ నివేదికతోనే సీఆర్పీసీ సెక్షన్ 174 కింద ఈ కేసు విచారణ ముగిసిందన్నారు. వైద్యుల హిస్టోపాథాలజీ నివేదికలో లోయా భౌతికకాయంలో విషపూరితమైన పదార్థాలేవీ లేవని తేలిందన్నారు. 2014లో డిసెంబర్ 1న నాగ్‌పూర్‌లో ఓ వేడుకకు హాజరైన లోయా అకస్మాత్తుగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ చీఫ్ అమిత్ షా నిందితుడిగా ఉన్న సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసును జస్టిస్ లోయా విచారిస్తున్న సంగతి తెలిసిందే. సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాకు, మిగతా నలుగురు సుప్రీం న్యాయమూర్తులకు మధ్య నెలకొన్న తాజా సంక్షోభానికి జస్టిస్ లోయా మృతి కేసు విచారణ కూడా కారణం కావడం గమనార్హం. -
పోస్టుమార్టం నివేదిక వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం జిల్లా, టేకుపల్లి మండలం, మేళ్లమడుగు గ్రామ పరిధిలో ఈనెల 14న జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన 9 మంది సీపీఐ (ఎంఎల్) చండ్రపుల్లారెడ్డి బాట దళ సభ్యుల మృతదేహాలకు జరిపిన పోస్టుమార్టం నివేదిక, అందుకు సంబంధించిన వీడియోగ్రఫీ వివరాలను తమ ముందుంచాలని ఉమ్మడి హైకోర్టు సోమవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఎన్కౌంటర్ ఘటనపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేత దర్యాప్తు చేయించి, ఆ దర్యాప్తును పర్యవేక్షించాలని కోరుతూ పౌర హక్కుల కమిటీ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ వాదనలు వినిపిస్తూ, ఇది బూటకపు ఎన్కౌంటరని, దళసభ్యులను పట్టుకొచ్చి అతి సమీపం నుంచి కాల్చి చంపారన్నారు. మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయని తెలిపారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యానేరంకింద కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. మృతదేహాలకు హడావుడిగా అర్ధరాత్రి పోస్టుమార్టం నిర్వహించి, వాటిని మృతుల కుటుంబ సభ్యులకు అప్పగించి, అంతిమ సంస్కారాలు చేయించారని తెలిపారు. తరువాత ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, పోస్టుమార్టం నిర్వహణ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేయించామన్నారు. ఈ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించామని తెలిపారు. ఈ ఘటనపై డీఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. ఈ సమయంలో రఘునాథ్ స్పందిస్తూ, ఈ ఎన్కౌంటర్ వెనుక భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ హస్తం ఉందన్నారు. కాబట్టి డీఎస్పీ స్థాయి అధికారికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించడం సరికాదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, పోస్టుమార్టం నివేదికను, వీడియోగ్రఫీ వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. -
ఆ మరణం వెనక.. ఎన్ని మలుపులు
♦ ఇంజనీరింగ్ విద్యార్థి దేవిది హత్యే ♦ తల్లిదండ్రులు, బంధువుల ఆరోపణ ♦ భరత్ మరో ఇద్దరు కలసి చంపేశారు ♦ వారిని తప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ ♦ దేవి తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తు అధికారి మార్పు.. ♦ ఘటనపై మళ్లీ తొలి నుంచి విచారణ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థిని కట్కూరి దేవి అనుమానాస్పద మృతి అంశం ఎన్నో మలుపులు తిరుగుతోంది. తమ కుమార్తె ప్రమాదవశాత్తూ మరణించలేదని, ఆమెను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారన్న దేవి తల్లిదండ్రుల ఫిర్యాదుతో... పోలీసులు ఈ ఘటనపై తిరిగి మొదటి నుంచి దర్యాప్తు ప్రారంభించారు.ప్రమాదానికి గురైన కారును ఘటనా స్థలంలోకి తిరిగి తెప్పించి... పోలీసులతోపాటు ఫోరెన్సిక్ నిపుణులు, మోటారు వాహనాల అధికారులు పరిశీలించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో దేవి అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. గురువారం ఘటనా స్థలంలో పోలీసులు విచారణ జరుపుతుండగా.. దేవి బంధువులు, మిత్రులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రమాదం జరిగిన రోజున కారులో మరో ఇద్దరు ఉన్నారని, వారిని తప్పించారని ఆరోపించారు. ప్రమాదం జరిగిన రోజున కారు ముందు భాగం చాలా తక్కువగా దెబ్బతిన్నదని... కానీ ఇప్పుడు పోలీసులు తీసుకువచ్చేటప్పటికి చాలా ఎక్కువ డ్యామేజీ ఉందంటూ దేవి సోదరి మానస చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రమాదం జరిగినప్పుడు తీసిన ఫొటోను ఆధారంగా చూపారు. పోలీసులు కావాలనే దోషులను తప్పిస్తున్నారని ఆరోపించారు. ఇక మరోవైపు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు అధికారులు విచారణాధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ సీఐ వెంకటరెడ్డిని తప్పించి.. ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డికి కేసును అప్పగించారు. దర్యాప్తు ముమ్మరం.. తిరిగి మొదటి నుంచి దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ఉస్మానియా వైద్యులిచ్చిన పోస్టుమార్టం నివేదికను క్షుణ్నంగా పరిశీలించారు. తలకు బలమైన గాయాలు కావటం వల్లే ఆమె మరణించిందని, మిగతా శరీర భాగాలపై గాయాలేవీ లేవని ఆ నివేదిక పేర్కొంది. దీంతో తలపై గాయాలు ప్రమాదం వల్లే జరిగాయా, ఆ సమయంలో కారు ఎంత వేగంలో ఉండి ఉంటుందనే అంశాలపై ఫోరెన్సిక్, మోటార్ వాహనాల అధికారుల సహాయాన్ని తీసుకున్నారు. ఇక దేవి ఆదివారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరి ప్రమాదస్థలి వరకు ఏ మార్గంలో వచ్చారు, ఆ సమయంలో ఎవరెవరితో మాట్లాడారు, దేవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న యువకుల సెల్‌ఫోన్ టవర్ లోకేషన్లను పోలీసులు విశ్లేషించారు. భరత్ వేసుకున్న దుస్తులు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగే ముందు దేవి, భరత్ ఇద్దరూ ఐదు నిమిషాలపాటు అక్కడ ఆగినట్లు గుర్తించారు. ఇక దేవి అనుమానాస్పద మృతిపై మొదటి నుంచి దర్యాప్తు చేపట్టామని, శాస్త్రీయ కోణంలో ముందుకు వెళుతున్నామని డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు. నిజాయితీగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని, అపోహలకు తావు లేదని తెలిపారు. దోషిగా తేలితే శిక్షించండి కుమార్తె మరణించిన ఆవేదనలో దేవి తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి, భరత్ తప్పు చేశాడని తేల్చితే.. ఏ శిక్ష విధించినా సరే. అంతేగానీ పోలీసుల విచారణను అడ్డుకోవటం సరికాదు.. - భరత్ తల్లి సామ అనితారెడ్డి ఎన్కౌంటర్ చేయాలి మా అక్క మృతి పట్ల చాలా అనుమానాలున్నాయి. ఆ రోజు ఎన్నోసార్లు ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు. ఇంట్లో అందరం నిద్రాహారాలు మాని ఎదురుచూశాం. రోడ్డు ప్రమాదంలో చనిపోయిందనగానే నిశ్చేష్టులమయ్యాం. ఇందుకు కారకులైన వారిని ఎన్కౌంటర్ చేయాలి. - దేవి సోదరి మానస దేవిది మూమ్మాటికీ హత్యే నా బిడ్డ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్నది కట్టుకథ. లోతుగా విచారణ జరిపితే దోషులెవరో తేలుతుంది. ఆమె వుృతి వెనుక మిస్టరీని ఛేదించాలి. ఆ రోజు కారులో భరతసింహారెడ్డితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరో గుర్తించాలి. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తే నిజాలు వెలికి వస్తాయి. ప్రమాదం జరిగిన కారును తీయడానికి గంటల సమయం పట్టే ఈ రోజుల్లో.. అరగంటలోనే కారును అక్కడి నుంచి ఎలా తొలగిస్తారు? దాన్ని దూరంగా రహ్మత్‌నగర్‌కు తరలించడం వెనుక అనుమానాలున్నాయి. దోషులు పట్టుబడే దాకా ఉద్యమిస్తాం. - దేవి తండ్రి కట్కూరి నిరంజన్‌రెడ్డి సాయం చేయాలంటూ అరుపులు వినిపించాయి ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మా సార్ కార్లు కడగడానికి లేచాను. ఆ సమయంలో మా ఫ్లాట్ ముందు ఓ తెల్లరంగు కారు ఆగి ఉంది. కొద్దిసేపటికి కారు తలుపులు కొడుతున్న చప్పుడు వినిపించింది. తర్వాత కాసేపటికే కారులోంచి ఓ యువతి దిగి పరిగెత్తే ప్రయత్నం చేసింది. కానీ కార్లోంచి ఓ యువకుడు దిగి ఆమెను తిరిగి కారులోకి లాక్కెళ్లాడు. నేను నా పనిలో ఉండిపోయాను. కొద్దిసేపటికే హెల్ప్.. హెల్ప్ అన్న అరుపులు వినిపించాయి. నేను బయటకొచ్చి చూస్తుండగానే ఆ కారు దూసుకుపోయింది. కొద్దిసేపటికే కారు ప్రమాదం జరిగి, ఓ యువతి చనిపోయిందని తెలిసింది. - వాచ్‌మన్ రాము, ప్రత్యక్ష సాక్షి -
తాడ్వాయి ఎన్‌కౌంటర్‌పై విచారణ రేపటికి వాయిదా
వరంగల్: వరంగల్ జిల్లా తాడ్వాయి ఎన్‌కౌంటర్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా పోస్టుమార్టం నివేదికను తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన పోస్టుమార్టంపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. దాంతో ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్‌ను నిపుణులకు పంపిస్తామని హైకోర్టు పేర్కొంది. దీనిపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.