
ముంబై: ముంబైలోని బాంద్రా అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ పూర్తైంది. అతనికి పోస్ట్‌మార్టమ్ చేసిన డా. ఆర్ఎన్ కూపర్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రి వైద్యులు సోమవారం పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికను విడుదల చేశారు. సుశాంత్‌ది ఆత్మహత్యగానే ధృవీకరించారు. అయితే అవయవాల్లో విషపూరితాలు ఉన్నాయో లేదో పరీక్షించేందుకు నటుడి అవయవాలను జేజే ఆసుపత్రికి తరలించారు. కాగా 34 ఏళ్ల వయసులోనే సుశాంత్ తన నివాసంలో ఆదివారం ఉరి వేసుకున్న విషయం తెలిసిందే. అతని ఇంట్లో ముంబై పోలీసులు యాంటీ డిప్రెషన్ మందులను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదు. మరోవైపు ఆయన మరణంపై చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. (సుశాంత్ మృతిపై అనుమానం: సీబీఐ విచారణ)
నేడు నటుడి అంత్యక్రియలు జరగగనుండగా.. సుశాంత్ కుటుంబీకులు వారి స్వస్థలమైన పాట్నా నుంచి ముంబైకు పయనమయ్యారు. ఇదిలా వుండగా రెండేళ్లు థియేటర్ ఆర్టిస్ట్‌గా కొనసాగిన సుశాంత్ "కిసీ దేశ్ మే హై మేరా దిల్" సీరియల్‌తో బుల్లితెరపై తెరంగ్రేటం చేశాడు. అనంతరం "కాయ్ పో చె" (2013) చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. అలా ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘పీకే’, ‘డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి" చిత్రాలు నటుడిగా అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా చేసిన ‘ఎం.ఎస్. ధోనీ’తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆయన చివరిసారిగా "చిచోర్" చిత్రంలో కనిపించాడు. (సుశాంత్‌సింగ్ ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment