ఆ బాలికపై లైంగికదాడి జరగలేదు..! | Postmortem Report Release On Odisha Murdered Girl | Sakshi
Sakshi News home page

ఆ బాలికపై లైంగికదాడి జరగలేదు..!

Published Fri, Jan 3 2020 10:31 AM | Last Updated on Fri, Jan 3 2020 10:49 AM

Postmortem Report Release On Odisha Murdered Girl - Sakshi

భువనేశ్వర్‌ : ఒడిశాలోని నవరంగపూర్‌ జిల్లాలోని కొశాగుమడలో వారం రోజుల క్రితం ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకిత్తించిన విషయం తెలిసిందే. గ్రామ శివారులో బాలిక మృతదేహం, దాని పక్కనే చెప్పులు పడి ఉండడంపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడి, అనంతరం ఆమెను హత్య చేసి ఉంటారన్న ఆరోపణలు వినిపించాయి. ఇదే విషయంపై పలు స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాల నేతలు, కాంగ్రెస్, బీజేపీలు నిరసన వ్యక్తం చేశాయి. (పరువు కోసం.. భర్తకు పెళ్లి చేసిన భార్య)

ఇంతవరకు ఆ సంఘటనకు సంబంధించి నిందితులను పట్టుకోకపోవడంపై పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలో బాలిక హత్య ఉదంతంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. అసలు ఆ బాలికపై ఎటువంటి లైంగికదాడి జరగలేదని పోస్టుమార్టం రిపోర్టు స్పష్టం చేసింది. సరిగ్గా రెండు రోజుల క్రితం దక్షిణ పశ్చిమ ఒడిశా డీఐజీ బాధిత గ్రామంలో పర్యటించి, బాలిక కుటుంబ సభ్యులను కలిసి, పరామర్శించారు. అనంతరం ఆ బాలిక పోస్టుమార్టం రిపోర్టు చదివి, వినిపించారు. బాలికపై లైంగికదాడి జరగలేదని, కానీ హత్య మాత్రం జరిగిందని తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుని, శిక్షిస్తామని అన్నారు. ఈ విషయం విన్న అనంతరం బాధిత కుటుంబ సభ్యులు మాఘోరో అధ్యక్షురాలు కాదంబినీ త్రిపాఠిని కలిసి, తమ గోడును విన్నవించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement