రాత్రి బహిర్భూమికి వెళ్లిన వివాహిత చేతులు కాళ్లను టవల్‌తో కట్టేసి.. | Odisha Woman Molested By Four Men In Puri | Sakshi
Sakshi News home page

రాత్రి బహిర్భూమికి వెళ్లిన వివాహిత చేతులు కాళ్లను టవల్‌తో కట్టేసి..

Published Mon, Nov 15 2021 4:08 PM | Last Updated on Mon, Nov 15 2021 8:59 PM

Odisha Woman Molested By Four Men In Puri - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

భువనేశ్వర్‌: దేశంలో ప్రతి రోజు ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరిని వదలం లేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో వైపు నుంచి ప్రమాదాలు ఉప్పెనల పొంచుకొస్తున్నాయి. తాజాగా మరో అఘాయిత్యం వెలుగు చూసింది. రాత్రి పూట కాల కృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లిన వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒడిశాలోని పూరి జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. నిమపరా  ప్రాంతంలో శనివారం రాత్రి 22 ఏళ్ల వివాహిత బహిర్భూమికి ఒంటరిగా గ్రామంలోని నది ఒడ్డుకు వెళ్లింది.
చదవండి: యూట్యూబర్‌ మరోసారి అరెస్ట్‌.. పవిత్ర స్థలంలో వీడియో చిత్రీకరణ

అయితే ఆమె ఒంటరిగా వచ్చిందనే విషయన్ని నలుగురు వ్యక్తులు గమనించారు. మహిళ నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్లే వరకు వేచి చూసి ఆపై ఆమె చేతులు కాళ్లను బలవంతంగా టవల్‌తో కట్టేసి సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఎంతసేపటికీ మహిళ తిరిగి రాకపోవడంతో భర్త, కుటుంబ సభ్యులు వివాహితను వెతకడానికి వెళ్లారు. అదే సమయంలో నదీ ఒడ్డున మహిళ ఏడుస్తూ కనిపించింది. కుటుంబ సభ్యులకు జరిగిన విషయం వివరించగా.. ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి నిందితులపై కేసు నమోదు చేశారు.
చదవండి: విషాదం: తల్లీకూతుళ్లను కబళించిన మృత్యువు

నిందితులు.. బలరాం భోయి, అతని సహచరులు కన్హయి భోయి, బిద్యాధర్‌, అజిత్‌ దాస్‌గా పోలీసులు గుర్తించారు. నలుగురు నిందితులను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో త్వరితగతిన చర్యలు తీసుకుంటామని పూరీ ఎస్పీ కన్వర్ విశాల్ సింగ్ హామీ ఇచ్చారు. నిందితులపై 30 రోజుల్లోగా చార్జిషీట్‌ను ఫైల్‌ చేసి కోర్టులో సమర్పిస్తామని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement