Kannada TV Actress Soujanya's Suicide Case : Father Files Complaint Against Actor Vivek - Sakshi
Sakshi News home page

Kannada Actress Soujanya Suicide: యువనటి ఆత్మహత్య కేసులో ట్విస్టు.. నటుడు వివేక్‌పై ఆరోపణలు

Published Sat, Oct 2 2021 9:54 AM | Last Updated on Sat, Oct 2 2021 11:15 AM

Kannada Actress Soujanya Suicide: Father Files Complaint Against Actor Vivek - Sakshi

శివాజీనగర్‌ (కర్ణాటక): బుల్లితెర నటి సౌజన్య ఆత్మహత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. నటుడు వివేక్‌ ప్రేమ, పెళ్లిపేరుతో వేధించడం వలన తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తండ్రి ప్రభు మాదప్ప ఆరోపించాడు. నటుడు వివేక్‌, అసిస్టెంట్‌ మహేశ్‌లపై కుంబళగోడు పోలీస్‌స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. కాగా, తన కూతురు అమాయకురాలని,ఎలాంటి తప్పు చేయలేదని తెలిపాడు.

తన కూతురు దగ్గర ఉన్న బంగారం,డబ్బులు కనిపించడంలేదని ఫిర్యాదులో ప్రభు మాదప్ప పేర్కొన్నాడు. ఈ మేరకు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితుడికి ఒక సంవత్సరం నుంచి తన కూతురితో పరిచయం ఉందని తెలిపాడు. తన కూతురిని ప్రేమించాలని వేధించాడని చెప్పుకొచ్చాడు.  కాగా, పోలీసులు వచ్చేలోగా ఘటనా స్థలం నుంచి తన కూతురి మృత దేహన్ని నిందితుడు మార్చాడని ఆరోపించాడు. ఆమె మొబైల్‌ కూడా కనిపించడం లేదని తెలిపాడు. మొబైల్‌ దొరికితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నాడు.

ఇక ఈ ఆరోపణలపై నటుడు వివేక్‌ స్పందిస్తూ.. ఇప్పుడు తానేమి చెప్పలేనని అన్నాడు. నటి సౌజన్య తనకు.. ఏడాదిగా  తెలుసని అన్నాడు. ఆమె చాలా అమాయకురాలని అన్నాడు. సౌజన్య.. ఒత్తిడికి గురైనప్పుడల్లా తనబాధను నాతో చెప్పుకునేదని వివేక్‌ పేర్కొన్నాడు.

మరోవైపు సౌజన్య  గదిలో లభించిన నాలుగు పేజీల సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో ఆమె తన మానసిక స్థితి బాగాలేదని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసింది.

ఇక ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర విచారణను వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని సూచించారు. కాగా, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.  

చదవండి: Actress Soujanya : విషాదం.. సూసైడ్‌ నోట్‌ రాసి యువనటి ఆత్మహత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement